Home /News /explained /

TENSIONS BETWEEN UKRAINE AND RUSSIA HOW IS INDIAS RELATIONS WITH THESE TWO COUNTRIES DETAILS HERE GH VB

Explained: ఉక్రెయిన్‌, రష్యా మధ్య ఉద్రిక్తతలు.. ఈ రెండు దేశాలతో భారతదేశం సంబంధాలు ఎలా ఉన్నాయి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉక్రెయిన్‌, రష్యా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల విషయంలో భారతదేశ మొదటిసారి అధికారికంగా స్పందించింది.

పాశ్చాత్య దేశాలతో సంబంధాల విషయంలో రష్యాకు(Russia) ఉక్రెయిన్‌(Ukraine) వివాదంగా నిలుస్తోంది. రష్యా తన బలగాలను ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో మొహరించింది. అదే సమయంలో ఒకవేళ రష్యా దాడి చేస్తే ఎదుర్కొనేందుకు NATO బలగాలు ఉక్రెయిన్‌లో ఉన్నాయి. తూర్పు, ఉత్తర సరిహద్దులను ఉక్రెయిన్‌ బలగాలు పహారా కాస్తున్నాయి. ఇక్కడే చెర్నోబిల్‌(Chernobyl) కూడా ఉంది. రష్యా నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కివ్‌(Kiw) చేరేందుకు ఇది చాలా దగ్గర మార్గం. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉక్రెయిన్‌, రష్యా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల విషయంలో భారతదేశ మొదటిసారి అధికారికంగా స్పందించింది.

 వివాదం ఎందుకు మొదలైంది?
తూర్పు దిశగా NATO ను మరింత విస్తరించబోమని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని పాశ్చాత్య దేశాలను రష్యా కోరుతోంది. పోలాండ్‌, బాల్టిక్‌ దేశాల నుంచి NATO బలగాలను తొలగించడంతో పాటు యూరోప్‌ నుంచి అమెరికా అణ్వాయుధాలు ఉపసంహరించాలన్నది రష్యా డిమాండ్. ఈ డిమాండ్లలో అతి ముఖ్యమైనది NATOలో ఉక్రెయిన్‌ను ఎప్పటికీ చేరనీయవద్దని. అమెరికా, పాశ్చాత్య దేశాలు దీన్ని తిరస్కరించాయి. ఫ్రాన్స్‌, జర్మనీ, అమెరికా, రష్యాకు చెందిన మధ్యవర్తుల సమక్షంలో రెండు పక్షాలు పారిస్‌లో చర్చలు జరుపుతున్నాయి. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యూల్‌ మక్రాన్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో మాట్లాడారు. ఆ వీడియో కాల్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌ కూడా కలిశారు.

Allie Rae: కరోనా టైమ్‌లో నర్సు జాబ్ పోయింది.. ఇప్పుడు నెలకు కోటికి పైగా ఆదాయం..

1991లో సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం కాకముందు ఉన్న అప్పటి 14 రిపబ్లిక్లలో అత్యంత కీలకమైనది ఉక్రెయిన్‌. ఎందుకంటే అది అన్నింటి కంటే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ, అత్యంత జనాభా కలిగిన ప్రాంతం. USSR ఏర్పడటంలోనూ, దాని విచ్ఛిన్నంలోనూ ఉక్రెయిన్‌ కీలక పాత్ర పోషించింది. డిసెంబర్‌ 1, 1991న ఉక్రెయిన్‌ నిర్వహించిన రెఫరెండంలో ఓటింగ్‌లో పాల్గొన్న 90 శాతానికి పైగా జనాభా USSR నుంచి బయటకు రావాలని కోరారు. దాంతో ప్రచ్ఛన్న యుద్దం పరిసమాప్తమైంది.

రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దూరం జరిగిపోవడంతో ఆ భారాన్ని రష్యా భరించలేకపోయింది. యూరోప్‌లో రష్యా తర్వాత రెండో అతి పెద్ద దేశం ఉక్రెయిన్‌. నల్లసముద్రంలో దానికి భారీ ఓడరేవులు ఉన్నాయి. నాలుగు NATO దేశాలతో దానికి సరిహద్దులు ఉన్నాయి. యూరోప్‌ తన సహజ వాయువు అవసరాల్లో మూడోవంతు రష్యాపైనే ఆధారపడుతుంది. పాశ్చాత్య దేశాలతో వివాదాలకు పుతిన్‌కు ఇది ఎంతో వెసులుబాటు కల్పిస్తుంది. అందులో ఒక ప్రధాన పైప్‌లైన్‌ ఉక్రెయిన్‌ గుండా వెళ్తుంది. ఉక్రెయిన్‌లోని ఆ భాగాన్ని నియంత్రిస్తే రష్యా పైప్‌లైన్‌ భద్రత పెరుగుతుంది.

పాశ్చాత్య దేశాలతో గొడవలు ఏంటి?
1990ల్లో ప్రచ్ఛన్న యుద్దం ముగిసిన తర్వాత 14 దేశాలను చేర్చుకొని NATO విస్తరించింది. ఇందులో సోవియట్‌ యూనియన్‌లోని కొంత భాగం కూడా ఉంది. దీన్ని రష్యా ఒక ముప్పుగా భావిస్తోంది. అంతే కాదు 1990 ప్రారంభంలో చేసుకున్న కట్టుబాట్లను పశ్చిమ దేశాలు గౌరవించడం లేదని అనుకుంటోంది. ఉక్రెయిన్‌ NATOలో సభ్యదేశం కాదు, కానీ కాలక్రమంలో చేరవచ్చని 2008లో హామీ లభించింది. 2014లో రష్యా అనుకూల అధ్యక్షుడిని తొలగించిన తర్వాత పశ్చిమ దేశాలతో రాజకీయంగా ఉక్రెయిన్‌ సన్నిహితమైంది.

ఫుట్‌బాల్ టీమ్‌ నుంచి గెంటేశారు.. కానీ ఇప్పుడు నగ్న వీడియోలతో కోట్లల్లో ఆదాయం

NATOతో కలిసి ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించింది. అంతే కాదు అమెరికా నుంచి యాంటీ ట్యాంక్‌ మిస్సైల్స్ పొందింది. క్రిమియా ప్రాంతాన్ని 2014లో రష్యా స్వాధీనం చేసుకోవడం, తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాదులకు సహకారం అందించడం వంటి రష్యా చర్యల కారణంగా తమ రక్షణ వ్యవస్థను పెంచుకోవాల్సి వస్తోందని ఉక్రెయిన్‌ వాదిస్తోంది.

రష్యాపై మిస్సైల్‌ దాడి చేసేందుకు ఉక్రెయిన్‌ను NATO వేదికగా ఉపయోగించుకుంటుందని పుతిన్‌ అంటున్నారు. ఉక్రెయిన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా వైపు తిప్పుకోవాలన్నది పుతిన్‌ ఆలోచన. దాని కోసం గత ఎనిమిది సంవత్సరాలుగా నేరుగా సైన్యాన్ని పంపించడం, సైబర్‌ దాడులు, తప్పుడు సమాచారంతో ప్రచారాలు, ఆర్థికపరంగా ఒత్తిడి, బెదిరింపు దౌత్యంతో ఉక్రెయిన్‌పై ఒత్తిడి పెంచుతున్నారని అంటున్నారు బ్రిటీష్‌ విద్యావేత్త టారస్‌ కుజియో. ఈ ప్రయత్నాలన్నీ విఫలం కావడమే ప్రస్తుత ఘర్షణ పరిస్థితులకు కారణం. ఉక్రెయిన్‌తో సంబంధాలు పునరుద్ధరించుకోవడంలో విఫలమైతే సైనిక చర్యలకు దిగక తప్పదని రష్యా ఇప్పుడు హెచ్చరిస్తోంది.

భారత్‌ వైఖరి ఏంటి?
ఉక్రెయిన్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు సహ రష్యా, అమెరికా మధ్య జరుగుతున్న ఉన్నతస్థాయి చర్చలను నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ. ‘స్థానిక పరిమాణాలను కివ్‌లోని మన ఎంబసీ కూడా పరిశీలిస్తోంది. దీర్ఘకాలిక శాంతి, సుస్థిరత కోసం సుస్థిరమైన దౌత్య సంబంధాల ద్వారా ఒక శాంతియుత పరిష్కారం కనుగొనాలని మేము కోరుకుంటున్నాం” అని బాగ్చీ తెలిపారు.

ఇప్పుడు ఎందుకు?
ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా తన బలగాలను మొహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తూ జనవరి 19న, అమెరికా విదేశాంగ శాఖ ఉపమంత్రి వెండీ షెర్మన్‌, భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్‌వర్ధన్‌ శృంగ్లాకు ఫోన్‌ చేశారు. అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలించాలనే భావనతో భారత్‌ అప్పుడు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇప్పుడు ఎట్టకేలకు మౌనాన్ని వీడింది.

రెండు వైపులా కీలకమైన వ్యూహాత్మక భాగస్వాములు ఉండటంతో తొందరపాటు చర్యలతో భారత్‌ తన కీలక వాటాలకు భంగం కలిగించుకోలేదు. రష్యా చేపడుతున్న శక్తి ప్రదర్శనపై ఆందోళన ఉన్నప్పటికీ ఆ దేశంతో తన సన్నిహిత సైనిక సంబంధాలకు ముఖ్యంగా తూర్పు సరిహద్దులో చైనాతో ఉన్న ప్రతిష్ఠంభనను దృష్టిలో ఉంచుకొని విఘాతం కలగాలని భారత్‌ కోరుకోవడం లేదు.

కిమ్ మూత్రంలో అంత సీక్రెట్ ఏముంది? టాయిలెట్ కుండీకి భారీగా సెక్యూరిటీ ఎందుకు?

ఈ ఒప్పందాల్లో అంతా వాటా ఏం ఉంది?
రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలు ఏడు దశాబ్దాలుగా ఉన్నాయి. కొన్ని రంగాల్లో స్తబ్ధుగా, కొన్ని రంగాల్లో క్షీణించినా రక్షణ రంగం మాత్రం బలమైన పునాదిగా ఉంది. ఇటీవల కొత్త కొనుగోళ్లను ఉద్దేశపూర్వకంగా భారతదేశం ఇతర దేశాల నుంచి చేపడుతున్నా ఇప్పటికీ రక్షణ పరికరాల్లో పెద్ద మొత్తం రష్యా నుంచే తీసుకుంటోంది. మొత్తం రక్షణ సరఫరాల్లో 60%-70% రష్యా నుంచి వస్తున్నాయని అంచనా.

ప్రధాని నరేంద్ర మోదీ, చైనా, రష్యా దేశాధినేతలు పుతిన్‌, జీ జిన్‌పింగ్‌తో మాత్రమే అనధికారిక శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తతల నడుమ కీలకమైన దౌత్యబంధంగా రష్యా నిలుస్తోంది. అటు ఏడాదిన్నరగా భారత విదేశాంగ, రక్షణ శాఖ మంత్రులు రష్యాలో చైనా నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అఫ్ఘనిస్థాన్‌ తాలిబాన్ల వశమైన తర్వాత ఆ దేశంలో భారత్‌ చేపడుతున్న కార్యకలాపాలకు రష్యా కీలకంగా నిలుస్తోంది.

భారత్‌ వైఖరి ఏంటి?
క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకున్నప్పుడు, భారత్‌ కేవలం ఆందోళన మాత్రమే వ్యక్తం చేసింది. అదే సమయంలో రష్యా న్యాయబద్ధమైన ప్రయోజనాలకు ఇది సబబేనని పేర్కొంది. ఈ విషయంలో భారత్‌కు పుతిన్‌ ధన్యవాదాలు తెలిపారు. కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయన అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ఫోన్‌ కూడా చేశారు. రష్యాతో ఉన్న సంబంధాల దృష్ట్యా పాశ్చాత్య దేశాల తరహలో భారత్‌ ఎటువంటి ఖండన ప్రకటనలు జారీ చేయడం లేదు. రెండు వైపులా ఉన్న అనుభవజ్ఞులైన మధ్యవర్తుల కారణంగా సమస్య పరిష్కారం అవుతుందని భారత్‌ భావిస్తోంది.
Published by:Veera Babu
First published:

Tags: Explained, Russia

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు