హోమ్ /వార్తలు /Explained /

Telangana: 111 జీవోలో అసలేముంది? సీఎం కేసీఆర్‌ ప్రకటనపై ఎందుకింత దుమారం?

Telangana: 111 జీవోలో అసలేముంది? సీఎం కేసీఆర్‌ ప్రకటనపై ఎందుకింత దుమారం?

సీఎం కేసీఆర్​ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్​ (ఫైల్ ఫోటో)

GO 111: సీఎం కేసీఆర్‌ నిర్ణయం వల్ల జీవో పరిధిలోని 84 గ్రామాలకు మేలు జరుగుతుందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. భవిష్యత్తుల్లో వందేళ్ల వరకు కూడా హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య రాదుని పేర్కొంటున్నారు.

  జీవో 111 (GO 111) ని ఎత్తివేస్తామన సీఎం కేసీఆర్ (cm kcr) అసెంబ్లీ వేదికగా ప్రకటించడంపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతోంది. గండిపేట, హిమాయత్ సాగర్ జంట జలాశయాల పరిరక్షణకు గతంలో జారీ చేసిన జీవో 111 ఎత్తివేస్తామని మంగళవారం ఆయన ప్రకటించారు. ఐతే సీఎం ప్రకటనపై జీవో పరిధిలోని గ్రామలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఉన్నపళంగా జీవోను ఎత్తవేయాల్సిన అవసరం ఏమొచ్చిందని విపక్ష ప్రశ్నిస్తున్నారు. జీవో 111ని రద్దు చేస్తే గండిపేట, హిమాయత్ సాగర్ జంట జలాశయాల భవితవ్యం ప్రశ్నార్థకమవుతుందని వాపోతున్నారు. మిషన్ కాకతీయతతో గ్రామాల్లో చెరువుల సంరక్షణకు కంకణం కట్టుకున్న సర్కార్.. హైదరాబాద్ జలాశయాల విషయంలో మాత్రం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందని విమర్శలు గుప్పిస్తున్నారు.

  అసలేంటి జీవో 111..?

  హైదరాబాద్ నగర శివారులోని గండిపేట, హిమాయ తసాగర్ జలాశయాలున్నాయి. హైదరాబాద్ మహా నగరానికి ఎన్నో ఏళ్లుగా తాగునీటి అవసరాలను తీర్చుతున్నాయి. ఈ రిజర్వాయర్‌ల పరిరక్షణకు జీవో 111 అమల్లో ఉంది. వీటి చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ.. 1994లో తొలుత జీవో నం. 192ను తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111ను తెచ్చింది. ఈ రెండు జలాశయాల పరిరక్షణ కోసం పలు వాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నారు. మొత్తం 84 గ్రామాలు దీని పరిధిలో ఉన్నాయి. క్యాచ్మెంట్ పరిధిలో వేసే లే అవుట్లలో 60శాతం ఓపెన్ స్థలాలు, రోడ్లకు వదలాలి. అక్కడ వినియోగించే భూమిలో 90శాతం కన్జర్వేషన్ కోసం కేటాయించాలి. జలాశయాల్లో రసాయనాలు, క్రిమిసంహారకాల స్థాయిలు లెక్కించేందుకు ప్రత్యేక ఏజెన్సీతో పర్యవేక్షించాలి. జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో జీ+2కి మించి నిర్మాణాలు చేసేందుకు వీల్లేదు.

  ఆర్ఆర్ఆర్‌ను ఆ విధంగా వాడుకున్న సజ్జనార్.. ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఆర్టీసీ ఎండీ..

  ఐతే ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించేందుకు గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల అవసరం ఉండేది. కానీ ఇప్పుడా అవసరం లేదు. కృష్ణా, గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో... జంట జలాశయాలపై ఆధారపడడం లేదని నగరవాసులు చెబుతున్నారు. అందువల్ల జీవో 111ని ఎత్తివేయాలని కోరుతున్నారు. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల చుట్టూ ఆంక్షల కారణంగా.. ఆ ప్రాంతాల్లో పెద్దగా అభివృద్ధి జరగడం లేదు. మిగతా ప్రాంతాలతో పోల్చితే భూముల ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం జంట జలాశయాల అవసరం హైదరాబాద్‌కు లేదని.. అందుకే జీవోను రద్దు చేయాలని చాలా మంది కోరుతున్నారు. అప్పుడే తమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని.. భూముల ధరలు కూడా పెరుగుతాయని అంటున్నారు.

  Telangana: బీజేపీ ఖాతాలో మరో విజయం.. CM KCR మెడలు వంచాం కాబట్టే శుభవార్త: బండి

  ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో... ఈ జీవో పై అధ్యయనం చేసేందుకు 2016లో తెలంగాణ ప్రభుత్వం హైపర్ కమిటీని నియమించింది. ఐతే ఆ కమిటీ సమావేశం కాలేదని గుడ్ గవర్నెన్స్ సంస్థ చైర్మన్ పద్మనాభరావు తెలిపారు. కానీ గ్రామాల పరిధిలోని పాలకవర్గాలు జీవోను రద్దు చేయాలని కోరుతూ.. గతంలో పలుమార్లు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాయి. అదే సమయంలో జీవో ఎత్తివేతకు వ్యతిరేకంగా పలువురు పర్యావరణవేత్తలు కోర్టులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జీవోపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల అనంతరం.. గతేడాది సెప్టెంబరులో సీఎం కేసీఆర్ అధికారులతో జీవో 111పై ప్రత్యేకంగా సమీక్షించారు. జలాశయాలను పరిరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్

  రూపొందించాలని ఆదేశించారు. ఐతే గతంలో నియమించిన ఉన్నతస్థాయి కమిటీ నుంచి నివేదిక రాకపోవడంతో మరికొంత సమయం కావాలని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. అంతలోనే జీవో 111పై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

  CM KCR: ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు ఆ ఉద్యోగులకు కేసీఆర్ శుభవార్త.. ఉక్రెయిన్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కు కూడా.. వివరాలివే

  సీఎం కేసీఆర్‌ నిర్ణయం వల్ల జీవో పరిధిలోని 84 గ్రామాలకు మేలు జరుగుతుందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. భవిష్యత్తుల్లో వందేళ్ల వరకు కూడా హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య రాదుని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు ఈ జీవో అవసరం లేదని చెబుతున్నారు. జీవో రద్దు చేస్తే తాము బాగుపడతామని అక్కడి ప్రజలు కూడా అంటున్నారు. కానీ విపక్ష నేతలు, పర్యావరణవేత్తలు మాత్రం మండిపడుతున్నారు. గ్రామాల్లో మిషన్ కాకతీయ పేరుతో చెరువులను పరిరక్షిస్తున్నామని చెబుతున్న సర్కార్.. హైదరాబాద్‌లో మాత్రం జంట జలాశయాలను రక్షించే జీవోను ఎందుకు రద్దు చేశారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ప్రశ్నిచారు. వాటిని రక్షించేందుకు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్లాన్ ఉందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం జీవో రద్దును స్వాగతిస్తూనే... ఆ ప్రాంతం వరకు ప్రత్యేకమాస్టర్ ప్లాన్ రూపొందించాలని కోరుతున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Hyderabad, Telangana

  ఉత్తమ కథలు