TELANGANA IF CONGRESS GIVES TELANGANA WHAT IS BJP STRATEGY BEHIND MODI LATEST COMMENTS EVK
Telangana: కాంగ్రెస్ ఇస్తేనే తెలంగాణ వచ్చింది.. మోదీ తాజా కామెంట్ల వెనుక బీజేపీ వ్యూహం అదేనా?
బీజేపీ (ప్రతీకాత్మక చిత్రం)
Modi Comments on Telangana | తెలంగాణపై బీజేపీ గురి పెట్టింది. ఇది ప్రస్తుత రాజకీయాలను పరిశీలించిన అందరికీ తెలిసిందే. అయితే బడ్జెట్ సెషన్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో తెలంగాణపై మోదీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎంతో ముందస్తు వ్యూహంతో చేసినట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణపై బీజేపీ (BJP) గురి పెట్టింది. ఇది ప్రస్తుత రాజకీయాలను పరిశీలించిన అందరికీ తెలిసిందే. అయితే బడ్జెట్ సెషన్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో మోదీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎంతో ముందస్తు వ్యూహంతో చేసినట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రభుత్వం తరఫున సమాధానమిస్తూ ప్రధాని మంగళవారం రాజ్యసభలో మాట్లాడారు. అధికారం అనే మత్తులోకాంగ్రెస్ (Congress) పార్టీ ఆంధ్రా, తెలంగాణ మధ్య చిచ్చులు పెట్టిందని ప్రధాని ఆరోపించారు. రాజకీయ స్వార్థం కోసమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించారాని, కనీసం చర్చ కూడా జరగకుండా విభజన బిల్లును కాంగ్రెస్ ఆమోదించిందని, దాని పర్యవసానాల వల్ల ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు ఇబ్బందలు పడుతున్నాయని మోదీ అన్నారు.
తాను తెలంగాణ (Telangana) వ్యతిరేకి కాదన్న మోదీ.. ఏపీ విభజన మాత్రం సరైన పద్దతిలో జరగలేదన్నారు. తెలంగాణ- ఏపీల మధ్య వైషమ్యాలకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికీ సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు.
ఇప్పుడు ఈ కామెంట్లు హాట్ టాపిక్ (Hot Topic) గా మారాయి. మోదీ తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేస్తున్నారు. స్వార్థం కోసమే కాంగ్రెస్ చేసిందని ఆరోపిస్తున్నా.. కాంగ్రెస్ ఇస్తేనే తెలంగాణ వచ్చిందని మోదీ స్పష్టం చేశారు. ఈ కామెంట్లతో టీఆర్ఎస్ను టార్గెట్ చేసినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ ఇవ్వడం వల్ల తెలంగాణ వచ్చింది.. కేసీఆర్ (KCR) తేవడం వల్ల రాలేదు అని అంతర్లీణంగా మోదీ చెప్పదలుచుకున్నారా అనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ చర్చ తమకు నష్టం కాబట్టే మోదీ కామెంట్లపై టీఆర్ఎస్ విరుచుకపడుతుందని భావిస్తున్నారు.
ఈ కామెంట్లను విస్తృతంగా జనంలోకి వెళ్లాలని బీజేపీ భావిస్తుంది. దీని ద్వారా కేసీఆర్ తెలంగాణ తెచ్చిన ఉద్యమకారుడిగా ఉన్న ఇమేజ్ తగ్గించడమే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. లోక్‌సభలోనూ, రాజ్యసభలోనూ మోదీ ఇలాంటి కామెంట్లే చేశారు.
కాంగ్రెస్‌కు ఉపయోగమేనా..
కాంగ్రెస్ అధికారం కోసం సరైన చర్చ చేయకుండా తెలంగాణ ఇచ్చిందని.. అంటున్నప్పటికీ కాంగ్రెస్ ఇస్తే వచ్చింది.. కేసీఆర్ తెస్తే రాలేదనే అభిప్రాయాన్ని చెబుతున్నాడని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఏదీ ఏమైన తెలంగాణలో మోదీ కాంగ్రెస్‌కు ఉపయోగపడే కామెంట్లు చేసినట్టు కనిపిస్తున్నాయి. అయితే ఈ కామెంట్లను కాంగ్రెస్ వాడుకోగలదా అనేదే ప్రశ్న. 2014లోనే తెలంగాణ ఇస్తేనే కాంగ్రెస్ ఆ సెంటిమెంట్‌ను ఉపయోగించుకోలేదు. ఇప్పుడు ఉపయోగించుకోగలుగుతుందా అనేది ప్రశ్న
టీఆర్ఎస్కు నష్టమా..
ఈ వ్యాఖ్యలు టీఆర్ఎస్ ఎక్కువ నష్టం తేకున్నా.. వ్యాఖ్యలను వ్యతిరేఖించలేని పరిస్థితి నెలకొంది. కేసీఆర్ తెస్తే తెలంగాణ ఇవ్వడానికి రాజకీయ అనివార్యతను కేసీఆర్ సృష్టించాడని టీఆర్ఎస్ ఇన్ని రోజులు చెబుతోంది. కానీ మోదీ వ్యాఖ్యలతో కేసీఆర్ అనివార్యత సృష్టించడం కాదు.. కాంగ్రెస్ అధికారం కోసం చేసింది అని మోదీ నోట రావడం తెలంగాణ తెచ్చిన క్రెడిట్ మొత్తం టీఆర్ఎస్ది కాదు. అని చెప్పకనే చెప్పినట్టు అయింది.
బీజేపీ వ్యూహం..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మొత్తం క్రెడిట్ కేసీఆర్ తీసుకొన్నారు. ఇప్పుడు ఆ క్రెడిట్ తగ్గించే పనిలో పడింది. మళ్లీ రాష్ట్ర ఏర్పాటుపై తెలంగాణలో విస్తృత చర్చజరగాలని భావిస్తోంది. దాని ద్వారా తెలంగాణ ఏర్పాటు ఒక్క కేసీఆర్ వల్ల మాత్రమే కాలేదని రుజువు చేయాలని భావిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
లాభం ఏమిటీ?
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పొత్తు సమయంలో టీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్‌ను ప్రయోగించింది. అప్పుడు తెలంగాణ ఏర్పాటు కేవలం కేసీఆర్ వల్లే అనే అభిప్రాయం బలంగా ఉండడంతో ప్రజలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించే పక్షంలో క్రెడిట్ మొత్తం కేసీఆర్‌ది కాదు అనే అంశం చర్చకు రావాలని బీజేపీ ఆలోచిస్తుంది. దీని ద్వారా తెలంగాణ ఏర్పాటు సెంటిమెంట్ ఓట్లు ఇటు కాంగ్రెస్, అటు టీఆర్ఎస్కు చీలీపోయే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.