Home /News /explained /

TELANGANA GOVERNMENT PLANS TO ANNOUNCE PRC SOON HERE DETAILS OF WHAT IS PRC NS

PRC: తెలంగాణలో కొన్నాళ్లుగా పీఆర్సీ పంచాయితీ.. అసలు పీఆర్సీ అంటే ఏంటో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telanagana PRC: తెలంగాణలో పీఆర్సీ అంశంపై గత కొద్ది కాలంగా తీవ్రంగా చర్చ జరుగుతోంది. అయితే పీఆర్సీ అంటే ఏంటి తదితర వివరాలు మీ కోసం..

    తెలంగాణలో పీఆర్సీ అంశంపై గత కొద్ది కాలంగా తీవ్రంగా చర్చ జరుగుతోంది. అయితే పీఆర్సీ అంటే ఏమిటో తెలియక అనేక మంది గందరగోళానికి గురవుతూ ఉంటారు.  పీఆర్సీ అనగా పే రివిజన్ కమిషన్.  ప్రభుత్వంలో పని చేసే ఉద్యోగులు, టీచర్లకు ఎంత మేర జీతం ఇవ్వాలి? ఎంత భత్యం ఇవ్వాలి? తదితర అంశాలను అధ్యాయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసే కమిటీ. ప్రతీ ఐదేళ్లకు ఒక సారి ప్రభుత్వం ఈ కమిటీని నియమించాల్సి ఉంటుంది. ఈ కమిటీ ఇచ్చే సిఫార్సు ఆధారంగా ప్రభుత్వం వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఈ కమిటీ సిఫార్సులు ఖచ్చితంగా అముల చేయాలన్న నిబంధన ఏమీ లేదు. సాధారణంగా కమిటీ సిఫార్సుల్లో సూచించిన మొత్తానికి కంటే ఎక్కువగానే ప్రభుత్వాలు వేతనాలను పెంచుతుంటాయి.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 మేలో పే రివిజన్ కమిషన్ ను ఏర్పాటు చేసింది.

    విశ్రాంత ఐఏఎస్ అధికారులైన సీఆర్ బిస్వాల్, ఉమామహేశ్వర రావు, మహమ్మద్ అలీ రఫత్ సభ్యులుగా ఈ కమిషన్ ను సర్కారు ఏర్పాటు చేసింది. అయితే.. ఈ కమిషన్ గత డిసెంబర్ లో నివేదికను సమర్పించింది. అయితే నివేదిక ఆలస్యమైనా పెరిగిన జీతం మాత్రం 2018 నుంచే అమలులోకి వస్తుంది. ఆ బకాయిలను ఉద్యోగులకు ప్రభుత్వం చెల్సించాల్సి ఉంటుంది.

    ఇదిలా ఉంటే.. దాదాపు రెండున్నరేళ్లుగా తెలంగాణ ఉద్యోగులకు ఊరిస్తున్న వేతన సవరణ అంశంపై కీలక ప్రకటన చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 22న సీఎం కేసీఆర్ స్వయంగా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన ఆనందంలో సీఎం కేసీఆర్ ఉద్యోగులపై వరాలు కురిపిస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే.  ఆ సమయంలో ఏపీలో అమలవుతున్న మధ్యంతర భృతి(ఐఆర్) కన్నా కనీసం రెండు శాతం ఎక్కువే ఫిట్మెంట్ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.

    దీంతో 29 శాతం ఫిట్మెంట్ లేదా అంత కన్నా ఎక్కువగానే ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పాటు ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై సైతం సీఎం హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ఆయా ఈ అంశాలపై సీఎం నుంచి రానున్న అధికారిక ప్రకటన కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆర్థిక శాఖకు చేసిన కేటాయింపుల్లో రూ. 8 వేల కోట్లను ప్రత్యేకంగా చూపారు. అయితే ఈ నిధులను పీఆర్సీ కోసమే ప్రత్యేకంగా చూపారన్న చర్చ జోరుగా సాగుతోంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: CM KCR, Telangana, Telangana employees

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు