AP Municipal Elections: ఆ ఒక్క గంట ఏం జరిగింది? చంద్రబాబుకు గంటా ఏం చెప్పారో తెలుసా?

గంటాపై చంద్రబాబు ప్రశ్నల వర్షం

గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారా? టీడీపీలో ఉంటున్నారా? ఏపీ రాజకీయాల్లో ఇది పుల్ స్టాప్ లేని చర్చ. అయితే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా విశాఖ వెళ్లిన చంద్రబాబు గంటాను కలిసి.. దీనిపై చర్చించినట్టు సమాచారం? ఈ సందర్భంగా అధినేత ముందు తన ఆవేధనను అంతా గంటా ఏకరువు పెట్టినట్టు తెలుస్తోంది? ఇంతకీ చంద్రబాబుకు గంటా ఏం చెప్పారో తెలుసా?

 • Share this:
  టీడీపీలో నేతల తీరు చంద్రబాబుకు తలనొప్పి తెచ్చి పెడుతోంది. టీడీపీ అంటే ఒకప్పుడు చాలా క్రమశిక్షణ ఉన్న పార్టీగా గుర్తింపు ఉండేది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత.. నేతలు చంద్రబాబును లైట్ తీసుకుంటున్నారనే ప్రచారం ఉంది. ఇప్పటికే బెజవాడ రాజకీయాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే.. కేశినేని నాని వర్సెస్ బుద్ధా, బొండాగా మారింది. చంద్రబాబు కలుగుచేసుకుని సర్ధిచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక విశాఖలో అయితే ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ జై జగన్ అంటూ.. వైసీపీ పంచన చేరారు. గంటా అయితే ఆ గట్టున ఉండాలా? ఈ గట్టుకు వెళ్లాలా అంటూ ఊగిసలాడుతున్నారంటూ ప్రచారం జరిగింది.

  అయితే ఇటీవల గంటా ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైసీపీలో చేరారు. ఆ సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గంటా శ్రీనివాసరావు తమ పార్టీలో త్వరలోనే చేరుతారని.. ఆయన అధిష్టానం ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టారని.. వాటికి అధినేత జగన్ ఒకే చెబితే ఆయన తమ పార్టీలోకి వస్తారు అంటూ ఆరోపించారు. వెంటనే దీనికి గంటా కూడా కౌంటర్ ఇచ్చారు. తాను ఏం ప్రతిపాధనలు పెట్టానో చెప్పాలని డిమాండ్ చేశారు.

  తాను పార్టీ మారితే చంద్రబాబుకు చెప్పే చేస్తాను అని చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం అలర్ట్ అయ్యింది. గంటా వ్యవహారం ఏంటో తేల్చియాలి అనుకుంది. దీనిలో భాగంగా విశాఖ ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు.. స్వయంగా గంటా శ్రీనివాసరావును కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య గంటకు పైగా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.

  గంటా వ్యవహారంపై మొదటి నుంచి అనుమానం ఉండడంతో.. చంద్రబాబు పలు రకాల ప్రశ్నలను గంటా ముందు ఉంచినట్టు తెలుస్తోంది. పార్టీ నేతలతో ఏమైనా ఇబ్బంది ఉందా? లేక వైసీపీ నేతల నుంచి ఏదైనా ఒత్తిడి ఉందా..? అక్రమ కేసులు పెడతమాని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారా? నిజంగానే పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా..? విజయసాయి రెడ్డి ఎందుకు అలా అనాల్సి వచ్చింది అని ఇలా ప్రశ్నల వర్షం కురిపించినట్టు గంటా సన్నిహితులు చెబుతున్నారు.

  అయితే గంటా మాత్రం తాను వైసీపీలోకి వెళ్లే ఆలోచనలో లేను అని స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. కొందరు కార్యకర్తలపై ఒత్తిడి ఉన్నమాట వాస్తవమే అని.. వారిని కాపాడుకోవడం ఇబ్బందికరంగా మారిందని.. దానికి తోడు సొంత పార్టీ నేతలే తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని.. తనపై ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ అండగా నిలవలేదని చెప్పినట్టు తెలుస్తోంది. కేవలం విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే విజయసాయి రెడ్డి ఇలా డ్రామాలు ప్లే చేస్తున్నారని అధినేత చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం.

  గంటా చెప్పిన వివరణ విన్న చంద్రబాబు పార్టీ నుంచి ఏవైనా సమస్యలు ఉంటే తనకు చెబితే సరి చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇకపై ఎలాంటి పొరపాట్లు జరగవని.. గతంలో లాగే పార్టీలో చురుగ్గా ఉండాలని గంటాకు చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే స్టీల్ ప్లాంట్ పై పోరాటంలో మరింత దూకుడుగా ఉండాలని.. రాజీనామ నిర్ణయాన్ని కూడా సమర్ధించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రావడంతో గంటా శ్రినివాసరావు టీడీపీలో మళ్లీ యాక్టివ్ అయ్యారు.

  మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పలు రోడ్ షోలలో పాల్గొన్నారు.. అలాగే ఇండివిడ్యువల్ గా కూడా పార్టీ అభ్యర్థుల తరుపున వార్డు వార్డులకు తిరిగి ప్రచారం చేశారు. అయితే గంటా మళ్లీ యాక్టివ్ అవ్వడంతో టీడీపీ కేడర్ లో జోష్ పెరిగింది. గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అనందం ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.. గంటా రాజకీయ చరిత్రను చూస్తే పార్టీలు మారడం ఆనవాయితీగా వస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..
  Published by:Nagesh Paina
  First published: