హోమ్ /వార్తలు /Explained /

Vaccine wastage: కరోనా వ్యాక్సిన్ వృధా కానివ్వకుండా తమిళనాడు భలే ఐడియా..

Vaccine wastage: కరోనా వ్యాక్సిన్ వృధా కానివ్వకుండా తమిళనాడు భలే ఐడియా..

ఆ తరువాత 60 ఏళ్లు పైడిన వారితో పాటు 45 ఏళ్లు పైబడి ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి కేంద్రం వ్యాక్సినేషన్ అందిస్తోంది.

ఆ తరువాత 60 ఏళ్లు పైడిన వారితో పాటు 45 ఏళ్లు పైబడి ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి కేంద్రం వ్యాక్సినేషన్ అందిస్తోంది.

వ్యాక్సిన్ వృథా కాకుండా తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి జె.రాధాకృష్ణన్ సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఒక వయల్‌ను ఓపెన్ చేసినప్పుడు.. దాంట్లో ఉండే వ్యాక్సిన్ డోసులన్నీ అయిపోవాలి. లేదంటే మిగిలిన డోసులను సరిగ్గా భద్రపరచక వృథా అవుతున్నాయి.

కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిన తరువాత ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తోంది. కానీ రాష్ట్రాలకు పంపిన డోసుల్లో కొంతవరకు వృథా అవుతోందని ప్రధానమంత్రి మోదీ ఇటీవల తెలిపారు. వ్యాక్సిన్ వృథాను అరికట్టడానికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ఆ రాష్ట్రంలో వ్యాక్సిన్ల వృథాను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ సిబ్బందిని ఆదేశించారు. ఇందుకు కొన్ని సూచనలు కూడా చేశారు. ఇప్పటికే తమిళనాడులో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ఇప్పటి వరకు 3.7 శాతం డోసులు వృథాగా పోయాయి. వ్యాక్సిన్ వృథాలో జాతీయ సగటు 6.5 శాతం కంటే తక్కువగా ఉన్నా.. ఈ వేస్టేజీని నివారించాలని రాధాకృష్ణన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

ఎలా భద్రపరచాలి?

కోవిడ్-19 వ్యాక్సిన్‌ను నిర్ణీత ఉష్ణోగ్రతల వద్ద భద్రపరచాలి. ప్రతి COVISHIELD వ్యాక్సిన్ వయల్‌ (vial- వ్యాక్సిన్లు ఉంచే డబ్బా లేదా బుడ్డి)లో 10 డోసులు, COVAXIN వయల్‌లో 20 డోసులు ఉంటాయి. వీటిని సరిగ్గా భద్రపరచపోతే వయల్‌లో ఉన్న వ్యాక్సిన్ డోసులన్నీ వృథాగా పోతాయి. కానీ మల్టీ డోస్‌లో వయల్ వేస్టేజ్ అనేది సాధారణమని సిబ్బంది చెబుతున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న వయల్‌లను ఓపెన్ చేసిన నాలుగు గంటల్లోగా వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలి. లేదంటే అవి పనికిరాకుండా పోతాయి. అందువల్ల వ్యాక్సిన్ తయారీదారులు వాటి నిల్వ గురించి కూడా ప్రయోగాలు చేయాలని చెబుతున్నారు.

వేగంగా వ్యాక్సినేషన్

తమిళనాడుకు తక్కువ మొత్తంలో వ్యాక్సిన్ డోసులు వస్తున్నాయి. దీంతో వృథా కూడా తక్కువగానే ఉంటోంది. జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. అప్పటికి రాష్ట్రంలో ప్రతి రోజూ 16000 మందికి వ్యాక్సినేషన్ చేసే సామర్థ్యం ఉండగా.. మొదటి రోజు కేవలం 2684 మంది హెల్త్ కేర్ వర్కర్లు మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పూర్తి సామర్థ్యం మేరకు టీకాలు వేయలేదు. కానీ గత రెండు నెలలుగా తమిళనాడులో టీకా తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 60, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి వ్యాక్సిన్ వేసేందుకు అనుమతించిన తరువాత ఈ సంఖ్య పెరిగింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 19,66,845 వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. గత కొన్ని రోజులుగా.. సగటున లక్ష మందికి పైగా వ్యాక్సిన్ తీసుకోవడం విశేషం.


వృథా నివారణ సాధ్యమే

వ్యాక్సిన్ వృథా కాకుండా తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి జె.రాధాకృష్ణన్ సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఒక వయల్‌ను ఓపెన్ చేసినప్పుడు.. దాంట్లో ఉండే వ్యాక్సిన్ డోసులన్నీ అయిపోవాలి. లేదంటే మిగిలిన డోసులను సరిగ్గా భద్రపరచక వృథా అవుతున్నాయి. ఒకవేళ ఒక వయల్‌లో రెండు లేదా మూడు డోసుల వ్యాక్సిన్ మిగిలితే.. టీకా తీసుకునే లబ్ధిదారులను గుర్తించి, వారికి మిగిలిన డోసులు ఇచ్చి వయల్ ఖాళీ చేయాలి. ఒకవేళ నిర్ణీత సమయానికి వయల్‌లో ఒకరికి డోసు తక్కువైతే.. వారిని మరుసటి రోజు రమ్మని కోరాలి. ఇలా చేయడం వల్ల వ్యాక్సిన్ వృథా చాలా వరకు తగ్గుతుందని రాధాకృష్ణన్ చెప్పారు. దీంతోపాటు వ్యాక్సిన్ వృథాను తగ్గించే ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

First published:

Tags: Corona Vaccine, Corona virus, Coronavirus, COVID-19 vaccine, Tamil nadu

ఉత్తమ కథలు