• HOME
  • »
  • NEWS
  • »
  • EXPLAINED
  • »
  • SWINE FEVER VACCINE FOR ANIMALS AVAILABLE FOR 2 RUPEES NO NEED OF SECOND DOSE WITHIN 2YEARS FULL DETAILS HERE PRN GH

Swine Fever: 2 రూపాయలకే వ్యాక్సిన్... రెండేళ్ల వరకు సెకండ్ డోస్ అవసరం లేదు.. ఐతే..!

Swine Fever: 2 రూపాయలకే వ్యాక్సిన్... రెండేళ్ల వరకు సెకండ్ డోస్ అవసరం లేదు.. ఐతే..!

రూ.2లకే స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్

Swine Fever: స్వైన్ ఫీవర్కు చెక్ పెట్టేందుకు 1964లో యూకేలో లాపినైజ్డ్ సిఎస్ఎఫ్ వ్యాక్సిన్ను రూపొందించారు. అప్పటి నుండి మన దేశంలో ఈ వ్యాక్సిన్నే ఉపయోగిస్తున్నారు.

  • Share this:


ఒకవైపు కరోనా వైరస్ ప్రపంచ మానవాళిని భయపెడుతుంటే.. మరోవైపు క్లాసికల్ స్వైన్ ఫీవర్ పందులు, గొర్రెలు వంటి జంతువులను బయపెడుతుంది. అయితే, స్వైన్ ఫీవర్ విరుగుడుకు ఎప్పటి నుంచో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ వీటి తయారీకి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చేది. అంతేకాక, టీకా తయారీ కోసం పెద్ద మొత్తంలో కుందేళ్ళను చంపాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ సమస్యకు చెక్ పెట్టారు. ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్త వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్ అతి త్వరలో మార్కెట్లోకి రానుంది. సెల్ కల్చర్ పద్ధతి ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ వ్యాక్సిన్ చాలా తక్కువ ధరకే లభించనుండటం విశేషం. ఈ వ్యాక్సీన్ ఉత్పత్తి వినియోగంతో కుందేళ్లను చంపాల్సిన అవసరం లేకుండా పోనుంది. ఈ క్లాసికల్ స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్‌తో పాటు షీప్ పాక్స్ వ్యాక్సిన్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చేందుకు అహ్మదాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ సంస్థ ఇటీవలే అన్ని హక్కులను పొందింది. కాగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఎఆర్) పరిధిలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐవిఆర్‌ఐ), ఇజత్నగర్ శాస్త్రవేత్తలు ఈ రెండు వ్యాక్సిన్లను అభివృద్ధి చేశారు.

ఈ కొత్త వ్యాక్సిన్ రూపకల్పనపై ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (యానిమల్ సైన్సెస్), భూపేంద్ర నాథ్ త్రిపాఠి మాట్లాడుతూ ‘‘భారత్కు ప్రతి ఏటా1.8 కోట్ల మోతాదు క్లాసికల్ స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ అవసరం. అయితే, ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ఇంత పెద్ద మొత్తంలో అవసరాలను తీర్చడానికి సరిపోదు. అంతేకాక, దీనిలో రోగనిరోధక శక్తి కూడా చాలా తక్కువ. అయితే, నూతనంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాక, ఇది తక్కువ ధరకే లభిస్తుంది. వీటిని వేగంగా ఉత్పత్తి చేయవచ్చు. తద్వారా, ఎటువంటి ఆలస్యం లేకుండా టీకాలను అభివృద్ధి చేయవచ్చు. కమర్షియల్ గా ఈ వ్యాక్సీన్ ఉత్పత్తి ఇప్పుడే ప్రారంభమవుతోంది.

కాగా, గతంలో ఈ వ్యాక్సిన్కు రూ .20 నుంచి 25 రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. అయితే, కొత్త వ్యాక్సిన్కు కేవలం రూ .2 మాత్రమే ఖర్చవుతుందని త్రిపాఠి తెలిపారు. ఇకపై వ్యాక్సిన్ తయారీకి పెద్ద సంఖ్యలో కుందేళ్ళను చంపాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ను ఒక్కసారి ఇస్తే రెండేళ్ల వరకు మరోసారి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకసారి ఇస్తే రెండేళ్ల వరకు ఆ రోగ నిరోధక శక్తి అలాగే నిలిచి ఉంటుంది.

కాగా, జంతువుల్లో వచ్చే స్వైన్ ఫీవర్కు చెక్ పెట్టేందుకు 1964లో యూకేలో లాపినైజ్డ్ సిఎస్ఎఫ్ వ్యాక్సిన్ను రూపొందించారు. అప్పటి నుండి మన దేశంలో ఈ వ్యాక్సిన్నే ఉపయోగిస్తున్నారు. కానీ ఈ వ్యాధిని నిరోధించేందుకు పెద్ద ఎత్తున కుందేళ్లను బలి ఇవ్వాల్సి వచ్చేది. ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కొత్త వ్యాక్సీన్ వేసిన రోజు నుండి 24 నెలల, 14 రోజుల వరకు ఆయా జంతువుల్లో రోగనిరోధక శక్తిని నిర్వహిస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్లాసికల్ స్వైన్ ఫీవర్ అనే వ్యాధి పందుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అధిక జ్వరం, చర్మం నుంచి రక్తస్రావం, చెవి, పొట్ట వంటి భాగాల్లో సైనోసిస్తో ప్రారంభమై పక్షవాతానికి దారి తీస్తుంది. ఈ వ్యాధి 100 శాతం మరణాల రేటు కలిగి ఉంటుంది. దీనివల్ల పెద్ద ఎత్తున జంతువులు చనిపోయి భారీ ఆర్థిక నష్టాలు సంభవించేవి. అందుకే దీన్ని నివారించేందుకు కుందేళ్ల నుంచి తీసిన మందుతో వ్యాక్సీన్ తయారుచేసేవారు.

ఒక కుందేలు నుండి 50 డోసుల వ్యాక్సిన్ తయారవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల ఇది చాలా ఖరీదైనదిగా పేర్కొంటున్నారు. అందుకే ఇది సరిపోయేది కూడా కాదు. ఏటా మన దేశంలో 90.6 లక్షల పందులకు అందించేందుకు 1.8 కోట్ల వ్యాక్సిన్లు అవసరమవుతాయి. సెల్ కల్చర్ పద్ధతి నుండి అభివృద్ధి చేసిన తాజా వ్యాక్సిన్ దేశ అవసరాలను సులభంగా తీర్చగలదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక, షీప్ పాక్స్ అనేది గొర్రెల్లో వచ్చే అంటువ్యాధి. ఇది 100 శాతం వరకు అనారోగ్యం, 50 శాతం వరకు మరణాలతో తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది.

ఏటా దేశంలో గొర్రెల పాక్స్ వల్ల వచ్చే ఆర్థిక నష్టం దాదాపు రూ .125 కోట్ల మేర ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టాన్ని నివారించడానికి ఏకైక మార్గం గొర్రెలకు టీకావేయడమే అని పేర్కొంటున్నారు. అందువల్ల, IVRI గొర్రెల స్వదేశీ పరిజ్ఞానంతో లైవ్ అటెన్యూయేటెడ్ గొర్రె వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ టీకా సురక్షితమైనదిగా, సమర్థవంతమైనదని నిరూపించబడింది. ఒక్కసారి వ్యాక్సిన్ ఇస్తే 48 నెలల పాటు గొర్రెలకు రక్షిణగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 'మేక్ ఇన్ ఇండియా' చొరవతో ఈ రెండు వ్యాక్సిన్లు అభివృద్ధి చేయబడ్డాయి. ICAR-IVRI గత వారం అహ్మదాబాద్ కి చెందిన హెస్టర్ బయో సైన్సెస్ కి సంస్థతో ఈ క్లాసికల్ స్వైన్ ఫీవర్, షీప్ పాక్స్ ల వ్యాక్సీన్లు సిద్ధం చేసేందుకు ఓ ఒప్పందాన్ని కూడా చేసుకోవడం విశేషం.
First published: