SWEET LIME CAN PREVENT CANCER AND MANY MORE USES IIT BHU LATEST RESEARCH KNOW DETAILS EVK
Sweet lime: బత్తాయి తొక్కతో బోలెడు ప్రయోజనాలు.. ఈ సారి పడేయకుండా ట్రై చేయండి!
Sweet Lime
మనకు ఎక్కువ అందుబాటులో ఉండే బత్తాయిలోనే కాదు బత్తాయి తొక్కలోనూ ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి.. దీనిపై ఇండియన్ ఇస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology) (BHU) ప్రత్యే పరిశోధనల చేసింది. క్యాన్సర్‌తోపాటు ఇతర ప్రాణాంతక వ్యాధులను నివారించడానికి ఉపయోపడే ఎన్నో మెటల్ ఐయాన్స్ ఉన్నట్టు తెలిపింది.
ఆరోగ్య ఎక్కడో ఉండదు.. మన చేతుల్లోనే ఉంటుంది. ఏదైనా పెద్ద వ్యాధి వస్తే మందులకు ఎంత ఖర్చు చేస్తాం.. ఆ ఖర్చులో కేవలం 10% ఖర్చు పెట్టినా.. అసలు వ్యాధే రాకుండా ఉంటుంది. మనం ఏ సూపర్ మార్కెట్‌కు వెళ్లినా కనపడే పండు మోసాంబి (బత్తాయి). మనం వాటిని పట్టించుకోకుండా ఏవేవో కొనిక్కొని వస్తాం. అసలు ఎప్పుడు మనకు కనపడే బత్తాయిలోనే కాదు బత్తాయి తొక్కలోనూ ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయో తెలుసా.. దీనిపై ఇండియన్ ఇస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology) (BHU) ప్రత్యే పరిశోధనల చేసింది. క్యాన్సర్‌తోపాటు ఇతర ప్రాణాంతక వ్యాధులను నివారించడానికి ఉపయోపడే ఎన్నో మెటల్ ఐయాన్స్ ఉన్నట్టు తెలిపింది. స్కూల్ ఆఫ్ బయోకెమికల్ ఇంజనీరింగ్, IIT (BHU) పరిశోధకులు బత్తాయిపై పరిశోధనలు చేశారు. ఇది పర్యావరణ అనుకూలమైందని, తక్కువ ఖర్చుతో యాడ్సోర్బెంట్‌ను సంశ్లేషణ చేయగలదని తెలిపారు.
బత్తాయి ఎన్నో హెక్సావాలెంట్ క్రోమియం వంటి విషపూరిత హెవీ మెటల్ అయాన్‌లను కలుషితమైన నీరు నుంచి తొలగించగలదని వీరి పరిశోధనలో వెల్లడైంది. స్కూల్ ఆఫ్ బయోకెమికల్ ఇంజినీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ మిశ్రా, అతని విద్యార్థి వీర్ సింగ్ ఈ పరిశోధన చేశారు. వారి పరిశోధన వివరాలను సెపరేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే అంతర్జాతీయ జర్నల్‌లో ఇప్పటికే ప్రచురించారు.
పరిశోధనల వివరాలు..
క్యాన్సర్లు, కాలేయం వ్యాధులు, మూత్రపిండ సమస్యలతోపాటు కాలేయం పనిచేయకపోవడం, చర్మ సమస్యల వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు హెక్సావాలెంట్ క్రోమియం కారణమని మిశ్రా చెప్పారు. బత్తాయి సిట్రస్ లిమెట్టా పీల్స్ బయోమాస్ నుంచి సంశ్లేషణ చేయబడిన కొత్త పర్యావరణ అనుకూల ఉత్పత్తి అని అన్నారు. ఇతర సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే వ్యర్థ జలాల నుంచి హెక్సావాలెంట్ క్రోమియంను తొలగించడానికి ఈ యాడ్సోర్బెంట్ చాలా ప్రభావవంతంగా ఉంటుందిని వెల్లడించారు. హెక్సావాలెంట్ క్రోమియంను సజల ద్రావణం నుంచి బత్తాయి రసంలోని మెటల్ అయాన్‌లు వేరు చేయడానికి తక్కువ సమయం పడుతుందని పరిశోధనలో తేలినట్టు తెలిపారు.
ఈ పరిశోధనపై వీర్ సింగ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముందుగా మురుగునీటిలో ఈ యాడ్సోర్బెంట్, హెక్సావాలెంట్ క్రోమియం తొలగింపు సామర్థ్యాన్ని పరీక్షించినట్టు తెలిపారు. ఈ యాడ్సోర్బెంట్ యొక్క హెవీ మెటల్ రిమూవల్ సామర్థ్యం సీసం, రాగి, కాడ్మియం వంటి ఇతర హెవీ మెటల్ అయాన్ల కోసం కూడా పరీక్షించారు. ఇక్కడ యాడ్సోర్బెంట్ సమర్థవంతంగా పని చేసినట్టు గుర్తించారు.
బత్తాయి పొట్టుతో..
పరిశోధనలో ముందుగా వారు 'మోసాంబి' తొక్కలను సేకరించి, వాటిని ఎండబెట్టారు. తరువాత వాటిని మెత్తగా చేశారు. అనంతరం దానిని చిటోసాన్, బయోపాలిమర్ జత చేశారు. తరువాత నీటిలో ఉంచారు. ఈ పదార్థం నీటీలోని లోహ పదార్థాలను వేరు చేయడం ప్రారంభించిందని పరిశోధకులు తెలిపారు.
ఏటా వ్యాధుల బారిన పిల్లలు..
డబ్ల్యూహెచ్ఓ (WHO) ప్రతి సంవత్సరం 3.4 మిలియన్ల మంది, ఎక్కువగా పిల్లలు, నీటి సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (UNICEF) అంచనా ప్రకారం, బ్యాక్టీరియాతో కలుషితమైన నీటిని తీసుకోవడం వల్ల ప్రతిరోజూ 4,000 మంది పిల్లలు మరణిస్తున్నారు. 2.6 బిలియన్లకు పైగా ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేదని WHO నివేదించింది, ఇది సంవత్సరానికి 2.2 మిలియన్ల మరణాలకు కారణమైంది, అందులో 1.4 మిలియన్ల మంది పిల్లలు. నీటి నాణ్యతను మెరుగుపరచడం ద్వారా ప్రపంచ నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను తగ్గించవచ్చు.
దేశంలో ఏటా అత్యధిక మంది విషపూరిత హెవీ మెటల్స్‌తో కూడిన నీటిని తాగుతున్నారని జలవనరుల మంత్రిత్వ శాఖ నివేదిక చెబుతోంది. ప్రస్తుత పరిశోధనలతో బత్తాయి తొక్కలు చాలా సులభంగా దొరుతాయని తక్కువ ఖర్చుతో పర్యావరణ హితంగా నీటిని శుద్ధి చేసుకోవడం వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిపై పరిశోధన చేసిన మిశ్రా మాట్లాడుతూ.. ప్రాథమిక పరిశోధనలు విజయవంతం అయ్యాయి. దీన్ని విస్తృతంగా చేపట్టి ల్యాబ్ స్థాయి నుంచి క్లినికల్ స్థాయిలో పరిశీలించి ట్రయల్స్ పారంభించిన తర్వాత్త వెంటనే ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.