Summer tips: చల్లని నీరు తాగొచ్చా? మామిడి తినొచ్చా? వేసవిలో ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలి?

సమ్మర్ లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి

ఓ వైపు కరోనా పంజా.. మరోవైపు మండే ఎండలు? ఇలాంటి సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా? ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోకూడదు? నిపుణులు ఇఛ్చే సూచనలు ఏంటి?

  • Share this:
    తెలుగు రాష్టాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. భానుడి భగభగలతో రోడ్డు ఎక్కాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఉక్కపోతతో ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. గతంలో పోల్చుకుంటే ఈ సారి ఏప్రిల్ లోనే సమ్మర్ సుర్రుమంటోంది? చాలాచోట్ల 45కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అప్పుడే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇంకా పీక్ సమ్మర్ రాకుండా పరిస్థితి ఇలా ఉంటే. మే నెలలో పరిస్థితి ఏంటి? ఓ వైపు కరోనా టెన్షన్.. మరోవైపు మండే ఎండలతో ప్రజలు పరేషాన్ అవుతున్నారు. మరి ఇలాంటి సమయంలో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఎలాంటి ఆహారం తింటే ఇబ్బందులు పడతాం..

    ఓ వైపు కరనో.. మరోవైపు మాడు పగిలే ఎండ.. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరి ఆరోగ్యంపై వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే. కొద్దిపాటి అజాగ్రత్త వహించినా అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే. ముఖ్యంగా ఈ సమ్మర్ లో సన్ స్ట్రోక్, డీహైడ్రేషన్ బారిన పడడమే కాకుండా.. ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ప్రజల ఇళ్ల నుంచి బయలుదేరేటప్పుడు ఆరోగ్య చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్నదానిపై అందరికీ అవగాహన ఉండాలి.

    ఒంటికి చలువ చేసే వస్తువులతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వేసవిలో ముఖ్యంగా వేడి ఉత్పన్నం చేసే ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి. మరి ఈ సమ్మర్ లో ఎలాంటి ఆహారం తీసుకోకుడాదు. నిపుణులు ఇచ్చినర సలహాల ప్రకారం చూద్దాం. ముఖ్యంగా మాంసంలో ప్రొటీన్, కొవ్వు పదార్ధాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎండలు మండే సమయంలో ఇలాంటి పదార్ధాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే రెడ్ మీట్ తినడం జీర్ణ వ్యవస్థకు విఘాతం కలుగుతుంది అంటున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో తప్పక రెడ్ మీట్ కు దూరంగా ఉండాలన్నది నిపుణుల సలహా. లేదంటే ఉదర సంబంధ వ్యాదులు వెంటాడుతాయి.

    కేవలం రెడ్ మీట్ మాత్రమే కాదు.. మసాల, ఘాటు కారం లాంటి పదార్ధాలను పూర్తిగా ఎవైడ్ చేయాలి. మరోవైపు వేసవి కాలం ఎక్కువగా మామిడి పండ్లను తినేందుకు ఇష్టపడతారు. ఎందుకంటే ఈ సీజిన్ లోనే రుచికరమైన మామిడిపళ్లు దొరుకుతాయి. అయితే మామిడి పళ్లు ఆరోగ్యాన్ని ఉపయోగపడతాయని కొందరు వైద్యులు చెబుతారు. కానీ అధిక వేడిని కలిగిస్తాయి. దీంతో జీర్ణ ప్రక్రియ ప్రభావం అయ్యే అవకాశం ఉంటుంది. పరిమితికి మించి మామిడిపళ్లు తినడం ఏ మాత్రం మంచిది కాదు. దీంతో పాటు ముఖ్యంగా వేసవి కాలంలో చల్లటి నీటిని తాగడం అస్సలు మంచిది కాదు. సాధారణంగా సమ్మర్ వచ్చిదంటే చాలు ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగకుండా ఉండలేం. కానీ అలాంటి నీరు ఏ మాత్రం మంచిది కాదు అంటున్నారు నిపుణులు. కూలింగ్ వాటర్ మన దాహాన్ని తీర్చవచ్చు.. కానీ ఆ నీరు కారణంగా శరీరంలో చాలా వేడి ఉత్పన్నమవుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు రిఫ్రిజిరేటర్ లోని నీటికి దూరంగా ఉంటూ.. కుండలోని నీటిని తాగాలని సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే వేసవి కాలంలో కాస్త అయినా మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం..
    Published by:Nagesh Paina
    First published: