Home /News /explained /

STUDY ON INTELLIGENCE RESEARCH THAT SAYS EVERYONE IS EQUAL IN INTELLIGENCE WHETHER SCIENTIST OR SURGEON GH EVK

Study on Intelligence: సైంటిస్ట్ అయినా.. సర్జన్ అయినా.. తెలివితేటల్లో అందరూ సమానమే అంటున్న పరిశోధన

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Study on Intelligence: మన అందరిలోనూ మెదడు ఒకే విధమైన పనితీరు కనబరుస్తుందని చెబుతోంది తాజా అధ్యయనం. రాకెట్ సైంటిస్టులు (Scientists), బ్రెయిన్ సర్జన్లు లాంటి నిపుణులు సాధారణ ప్రజల కంటే మెరుగ్గా ఏమి ఆలోచించరని స్పష్టం చేసింది.

మనలో చాలా మంది ప్రతి విషయానికీ ఇతరులతో పోల్చుకోవడం (Comparison) సాధారణమే. ముఖ్యంగా తెలివితేటలు, చదువు లాంటి అంశాల్లో తమ కంటే మెరుగైన వారితో పోల్చుకుంటారు. అయితే కొంతమంది ఎదుటివారితో పోటీ పడలేక సాకులు చెబుతుంటారు. నేనేమి సైంటిస్టు (Scientist) ను కాదు, నాకంత బ్రెయిన్ లేదు అంటూ వాపోతారు. అయితే మన అందరిలోనూ మెదడు ఒకే విధమైన పనితీరు కనబరుస్తుందని చెబుతోంది తాజా అధ్యయనం.  రాకెట్ సైంటిస్టులు, బ్రెయిన్ సర్జన్లు (Brain Surgeons) లాంటి నిపుణులు సాధారణ ప్రజల కంటే మెరుగ్గా ఏమి ఆలోచించరని స్పష్టం చేసింది. కొద‌రికి ఎక్కువ సామ‌ర్థ్యం.. మ‌రికొంద‌రికి త‌క్కువ సామ‌ర్థ్యం వంటివి ఏమీ ఉండ‌ద‌ని స‌ర్వేలో తెలిపింది.  ఇందుకోసం కాగ్నిట్రాన్ ప్లాట్‌ఫాంలో (Cognitron) గ్రేట్ బ్రిటీష్ ఇంటెలిజెన్స్ టెస్ట్(GBIT)ను ఎదుర్కొన్న వారిపై పరిశోధనలు చేశారు. GBITకి సంబంధించిన 12 ఆన్​లైన్ టాస్క్​లను సమర్థవంతంగా పూర్తి చేసిన 329 ఏరోస్పేస్ ఇంజనీర్లు (Engineers), 72 న్యూరోసర్జన్ల బృందం డేటాను పరిశోధకులు పరీక్షించారు.

18 వేల మంది ప్ర‌జ‌ల నుంచి డేటా సేక‌ర‌ణ‌
అలాగే వారి వయసు, లింగం, స్పెషలైజేషన్ (Specialization), అనుభవం సంబంధిత ప్రశ్నల సమాధానాలను సంగ్రహించారు. అంతేకాకుండా టాస్క్​ ప్లానింగ్, రీజనింగ్, వర్కింగ్ మెమరీ, అటెన్షన్, ఎమోషనల్ ప్రాసెసింగ్ ఎబిలిటీ (Emotional Processing Ebility) లాంటి పలు అంశాల్లో వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. ఈ ఫలితాలను 18 వేల మంది బ్రిటీష్ ప్రజల నుంచి సేకరించిన డేటాతో పోల్చారు.

Explained: కాశీ విశ్వనాథ్ కారిడార్ అంటే ఏంటి? ఇది pm modi డ్రీమ్ ప్రాజెక్ట్ ఎందుకైంది?


CDS Bipin Rawat: సీడీఎస్ బిపిన్ రావత్ మరణంతో Mi-17V5‌ హెలికాప్టర్లపై మొదలైన సందేహాలు.. అంత సామర్థ్యం ఉందా ?


ఈ ఫలితాలను సాధారణ ప్రజలతో పోల్చగా.. వేగవంతమైన సమస్య పరిష్కరణలు, మెమరీ రీకాల్ లాంటి అంశాల్లో న్యూరోసర్జన్లు మాత్రమే కొంత వ్యత్యాసాన్ని చూపించారు. స్వతహాగా వారికున్న నైపుణ్యం (Skill), వేగవంతంగా పూర్తి చేసే శిక్షణ, క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం లాంటి కారణాల వల్ల న్యూరో సర్జన్లు ఈ తేడాలు చూపించగలిగారని పరిశోధకులు కనుగొన్నారు. ఏరోస్పేస్ ఇంజనీర్లు, న్యూరో సైంటిస్టుల కాగ్నిటివ్(అభిజ్ఞా) సామర్థ్యాల మధ్య తేడాలను ఈ పరిశోధకుల బృందం కనుగొంది. ఈ పరిశోధన ఇద్దరు ప్రొఫెషనల్స్ (Professional) మధ్య జరిగిన వాదనల ఆధారంగా జరిగింది. రాకెట్ సైంటిస్ట్, న్యూరోసర్జన్ ఇద్దరిలో ఎవరిది పైచేయి, ఎవరు అత్యంత తెలివైనవారు అనే చర్చ అనుగుణంగా అధ్యయనం నిర్వహించారు.

పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటి? చట్ట సభల్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్‌కు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుంది?


Mutual Fund: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో ఇన్వెస్టర్ స్టేటస్‌ను మైనర్ నుంచి మేజర్‌కు ఎలా మార్చాలి?


కొన్ని విషయాల్లో ఏరో స్పేస్ ఇంజనీర్లు ఎక్కువ స్కోర్ తెచ్చుకోగా.. మరికొన్ని అంశాల్లో న్యూరోసర్జన్లు ప్రతిభ కనబర్చారు. ఈ అధ్యయనాన్ని BMJ జర్నల్‌లో ప్రచురించారు.

"ఈ పరిశోధన ప్రకారం ప్రతి ఒక్కరికి అనేక నైపుణ్యాలు ఉంటాయి. కొంతమంది కొన్ని విషయాల్లో మెరుగ్గా ఉంటారు. మరికొందరు వేరే అంశాల్లో ముందుంటారు. అన్ని విషయాల్లోనూ మెరుగైన స్థితిలో ఉండటం ఎవరికైనా కష్టమైన పని" అధ్య‌యన రచయిత అశ్విన్ చారి అన్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వృత్తులవారు ప్రతి పనిలోనూ మెరుగ్గా ఉండలేరని, తమకు నచ్చిన వాటితో మాత్రమే అది సాధ్యపడుతుందని తెలిపారు. ఇది కేవలం రాకెట్ సైంటిస్టులు, ఏరోస్పేస్ ఇంజనీర్లకే కాకుండా ఇతర వృత్తుల వారికి కూడా వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Published by:Sharath Chandra
First published:

Tags: Brain, Britain, Doctors, Engineering, Scientist, Survey

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు