Home /News /explained /

SRILANKA EMERGENCY CHINA ONE BUT NOT THE ONLY REASON BEHIND SRI LANKAS ECONOMIC COLLAPSE GH SK

Sri Lanka Crisis: చైనా వల్లే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభమా? ఈ దారుణ పరిస్థితులకు అసలు కారణమేంటి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Srilanka Emergency: శ్రీలంక ఆర్థిక సంక్షోభం (SriLanka Economic Crisis) తీవ్రరూపం దాల్చింది. ప్రజల నుంచి పెద్ద స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితికి చైనా కారణమని ఆరోపణలు వినిసిస్తున్నాయి. అయితే చైనా(China) ఒక్కటే కారణం కాదని.. ఇతర ప్రధాన సమస్యలు చాలానే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...
(D P Satish , News18)

శ్రీలంక ఆర్థిక సంక్షోభం (SriLanka Economic Crisis) తీవ్రరూపం దాల్చింది. ప్రజల నుంచి పెద్ద స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితికి చైనా కారణమని ఆరోపణలు వినిసిస్తున్నాయి. అయితే చైనా(China) ఒక్కటే కారణం కాదని.. ఇతర ప్రధాన సమస్యలు చాలానే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కొలంబో కోటలోకి పర్యాటకులు అడుగుపెట్టిన తర్వాత హిందూ మహాసముద్రం నుంచి వేరుపడిన 750 ఎకరాల్లో విస్తీర్ణంలోని భారీ ఇసుక క్షేత్రం దర్శనమిస్తుంది. ఇది ఒకప్పుడు డచ్‌, బ్రిటీష్‌ పాలనలో ఉన్న సిలోన్.. ఇప్పటి శ్రీలంకలో ఉంది. ప్రపంచంలో కొత్త వలసవాద శక్తిగా అవతరించిన చైనా ఈ 750 ఎకరాల భారీ ఇసుక క్షేత్రాన్ని స్వాధీనం చేసుకొంది. ఇక్కడ అంతర్జాతీయ నౌకాశ్రయ నగరాన్ని నిర్మించాలని భావిస్తోంది. ప్రపంచ స్థాయి స్వేచ్ఛా వాణిజ్య మండలిగా తీర్చిదిద్దాలని యోచిస్తోంది. సింగపూర్, దుబాయ్‌లకు దీటుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తోంది.

ప్రస్తుత శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి చాలా మంది చైనాను కారణంగా చూపారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు సైతం చైనా నిర్ణయాలతోనే శ్రీలంకకు ఈ పరిస్థితి ఎదురైందని కొన్ని కథనాలు ప్రచురించాయి. వాస్తవానికి శ్రీలంకలో తలెత్తిన పెను ఆర్థిక సంక్షోభానికి చైనా ఒక కారణం మాత్రమే.. ఈ ఆర్థిక సంక్షోభానికి కారణమైన అనేక ఇతర పెద్ద సమస్యలు ఉన్నాయి. సిలోన్ 1948వ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి స్వాతంత్య్రం పొందింది. కొత్తగా స్వాతంత్య్రం పొందిన ఈ చిన్న దేశం 1972లో రిపబ్లిక్ దేశంగా మారేంత వరకు బ్రిటిష్ కామన్వెల్త్‌ నియంత్రణలోనే పాలన కొనసాగించింది. బ్రిటీష్ నుంచి సిలోన్‌ స్వాత్రంత్య్రం పొందిన తర్వాత.. ఇక్కడ చాలా వరకు వాణిజ్యం బ్రిటిష్, ఇతర యూరోపియన్ వ్యాపార సంస్థల నియంత్రణలోనే ఉంది. దాదాపు 40,000ల మంది కంటే ఎక్కువ మంది యూరోపియన్లు (కొన్ని వందల మంది అమెరికన్ల సహా) వ్యాపారం చేస్తూ ద్వీపంలోనే నివసించేవారు. వైట్ బ్యూరోక్రాట్లు, పోలీసు, సైనిక అధికారులు కూడా విధుల్లో కొనసాగారు. ఆ పరిస్థితుల్లో సిలోన్ రూపాయి బలంగా ఉంది, చాలా దేశాల్లోనూ ఆమోదం పొందింది.

Sri Lanka : హింసాత్మకంగా ఆందోళనలు..శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించిన అధ్యక్షుడు

అనంతరం ప్రధాన మంత్రి సిరిమావో బండారునాయకే తీసుకొచ్చిన సింహళ ఓన్లీ పాలసీతో(Simhala Only Policy) అన్ని ప్రైవేట్ సంస్థలు ఒక్కొక్కటిగా తరలిపోయాయి. సోషలిజం వైపు బండారునాయకే మొగ్గుచూపడంతో ప్రైవేటు సంస్థలు నిష్క్రమించాయి. 1970ల నాటి JVP తిరుగుబాటు కూడా కష్టాలకు తోడైంది. JR జయవర్ధనే నేతృత్వంలోని UNP ప్రభుత్వం 1977లో బండారునాయకే సోషలిజాన్ని వ్యతిరేకించింది. 1977లో ఓపెన్ మార్కెట్ ఎకానమీని స్వీకరించింది. దక్షిణాసియాలో ఆర్థిక సరళీకరణను స్వీకరించిన మొదటి దేశంగా శ్రీలంక అవతరించింది. కానీ 25 ఏళ్లుగా సాగిన తమిళ ఈలం అంతర్యుద్ధం విదేశీ పెట్టుబడిదారులను అడ్డుకుంది. తిరుగుబాటుదారులతో పోరాడడంలో నిమగ్నమై ఉన్న శ్రీలంక ప్రభుత్వం కూడా బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడంపై దృష్టి పెట్టలేదు.  శ్రీలంక టీ, దాల్చినచెక్క, సుగంధ ద్రవ్యాలు, రబ్బరు, కొబ్బరి, సముద్ర ఉత్పత్తులు, రత్నాలు, వస్త్రాలను ఎగుమతి చేస్తుంది. దాని ఆహార పదార్థాలలో ఎక్కువ భాగం దిగుమతి చేసుకొంటుంది. విదేశాల్లో పనిచేస్తున్న శ్రీలంక వాసులు ఏటా 3 నుంచి 4 బిలియన్ డాలర్లను స్వదేశానికి పంపుతున్నారు. పర్యాటకంపై ఆధారపడి 3 మిలియన్లకు పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. సంవత్సరానికి 4 నుంచి 5 బిలియన్ డాలర్ల ఆదాయం పర్యాటక రంగం నుంచి వస్తుంది.

Russia Ukraine War:  సీన్ రివర్స్.. తొలి సారి రష్యా భూభాగంలో ప్రవేశించిన ఉక్రెయిన్ దళాలు..

దేశంలో ఉత్పత్తి, సేవా రంగాన్ని అభివృద్ధి చేయడానికి వరుసగా వచ్చిన ప్రభుత్వాలు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. 2009 తర్వాత కొద్దికాలం శ్రీలంక భారీ ఆర్థిక వృద్ధిని సాధించింది. విదేశీ, దేశీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఆశలను పెంచింది. కానీ బిలియన్ల డాలర్ల విలువైన సావరిన్ బాండ్ల జారీలో నిర్లక్ష్యం, రుణాలు, వృథా ఖర్చులతో 10 సంవత్సరాలలోనే ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. చైనా నుంచి భారీ రుణాలు తీసుకోవడం కూడా పరిస్థితిని మరింత దిగజార్చింది. 2009- 12 సమయంలో శ్రీలంక IMF ఆర్థిక పరిస్థితిని నియంత్రించడంలో విఫలమైంది. 2019లో ఈస్టర్‌ రోజున బాంబు పేలుళ్లు, రెండు సంవత్సరాల కరోనా పరిస్థితులు శ్రీలంక ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీశాయి. దివాలా ముంగిట నిలిచిన దేశం, ప్రజల ఆకలి చావుల నేపథ్యంలో పాలనలోని రాజపక్స కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. ప్రస్తుత ప్రభుత్వం శ్రీలంకను ఈ కష్టాల నుంచి బయటపడేయలేదని, అంతర్జాతీయ సమాజం జోక్యం అవసరమని కొంతమంది స్థానిక ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

సోవియట్ కాలం నాటి ట్యాంకులను పునరుద్ధరించిన రష్యా..! ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి..?

శ్రీలంక మాజీ క్రికెట్ సంచలనం సనత్ జయసూర్య హెచ్చరించినట్లుగా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. చాలా మంది శ్రీలంక వాసులు భారత్ ఇప్పుడు తమను రక్షించగలదని ఆశిస్తున్నారు. మరుసటి రోజు అవసరాలను తీర్చడానికి చేసే అప్పులతో దేశానికి ఎటువంటి ప్రయోజనం లేదని, దేశాన్ని మరింతగా అప్పుల ఊబిలోకి ననెడుతుందని చెబుతున్నారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సేను తొలగించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో.. శ్రీలంక భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: International news, Sri Lanka

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు