SOCIAL MEDIA IN INDIA SINCE 2014 GROWTH ACROSS PLATFORMS USER PROFILE MK GH
Social Media Trends: ఫేస్ బుక్, వాట్సప్, యూట్యూబ్ లో ఏది నెంబర్ వన్..తెలిస్తే బిత్తరపోతారు...
(ప్రతీకాత్మక చిత్రం)
లోక్‌నీతి - సీఎస్డీఎస్ సర్వేలో భాగంగా ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వినియోగం గురించి ప్రశ్నలు వేశారు. వాటిలో మీరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఎంత సేపు వినియోగిస్తారనే ప్రశ్న వేశారు.
సోషల్ మీడియా - సార్వత్రిక ఎన్నికలు... ఈ రెండింటికీ మధ్య ఉన్న సంబంధం ఎంత గొప్పదో ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు నిర్వచించాయి. అయితే అంతకుముందే, అంటే 2019లో మన సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఈ విషయం బయటికొచ్చింది. దేశంలో కీలక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వినియోగంలో చాలా మార్పులు కనిపించాయి. ఈ క్రమంలో లోక్‌నీతి - సీఎస్డీఎస్ అనే సంస్థ ఓటింగ్ తీరుపై సోషల్ మీడియా ప్రభావం గురించి సర్వే నిర్వహించింది. ఈ క్రమంలో సోషల్ మీడియా విషయంలో వచ్చిన ప్రగతిని కూడా తెలియజేసింది. ప్రస్తుతం దేశంలో సోషల్ మీడియాపై కేంద్రం తీసుకొస్తున్న కొత్త ఐటీ రూల్స్ గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ సర్వే వివరాలు ఆసక్తికరంగా మారాయి. సర్వేలో ఏం చెప్పారంటే...
లోక్‌నీతి - సీఎస్డీఎస్ సర్వేలో భాగంగా ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వినియోగం గురించి ప్రశ్నలు వేశారు. వాటిలో మీరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఎంత సేపు వినియోగిస్తారనే ప్రశ్న వేశారు. అందులో వాట్సాప్‌ను 34 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో ఫేస్బుక్ (32 శాతం) ఉంది. ఇక 31 శాతంతో యూట్యూబ్ మూడో స్థానంలో ఉంది. ఇక నాలుగో స్థానంలో 15 శాతం యూజింగ్తో ఇన్స్టాగ్రామ్ ఉండగా, 12 శాతంతో ట్విటర్ ఐదో స్థానంలో, ఆఖర్లో నిలిచింది. దీంతోపాటు డైలీ యూజర్స్ విషయంలోనూ వివరాలు సర్వేలో వెల్లడయ్యాయి. వాట్సాప్‌కు 85 శాతం యూజర్లు ఉండగా, యూట్యూబ్‌కు 81 శాతం యూజర్లున్నారు. ఫేస్‌బుక్‌కు 72 శాతం డైలీ యూజర్లు ఉండగా, ఇన్‌స్టాగ్రామ్‌కు 60 శాతం యూజర్లు ఉన్నారు. ఇందులోనూ ఆఖరి స్థానంలో ట్విటర్ (42 శాతం) ఉంది.
సోషల్ మీడియాలో ముఖ్యంగా ఫేస్బుక్, ట్విటర్ వియంలో 2014 నుంచి 2018 మధ్య ఎదుగుదల కనిపించింది. 2014లో ఫేస్బుక్ యూసేజ్ 9 శాతం ఉండగా అది 2017 నాటికి 20 శాతం అయ్యింది. 2018 నాటికి 32 శాతానికి పెరిగింది. అదే ట్విటర్ విషయానికొస్తే 2014లో రెండు శాతంగా ఉండగా, 2017 నాటికి అది ఐదు శాతం అయ్యింది. 2018 మే లో చూస్తే 14 శాతానికి పెరిగింది. ఫేస్‌బుక్‌తో పోలిస్తే ట్విటర్ గ్రోత్ తక్కువే అని చెప్పాలి. 2019 మే నాటికి వస్తే ఫేస్బుక్ శాతంలో మార్పు లేదు. అదే 32 దగ్గర ఉంది. కానీ ట్విటర్ రెండు శాతం తగ్గి 12 శాతానికి పడిపోయింది. వాట్సాప్ విషయంలోనూ 2018కి, 2019కి పెద్దగా తేడా లేదు.
2019 నాటికి వచ్చేసరికి అన్ని సోషల్ మీడియాల్లో ఎదుగుదల కనిపించింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల (బిహార్, అసోం, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు) సమయంలోనూ సోషల్ మీడియా కీలక పాత్ర పోషించిందని సమాచారం. 2019, 2021 గణాంకాలు చూసుకుంటే వాట్సాప్ 31 శాతం నుంచి 41కి పెరిగింది. యూట్యూబ్ 28 శాతం నుంచి 38కి ఎదిగింది. ఫేస్బుక్ 31 నుంచి 37, ఇన్స్టాగ్రామ్ 13 నుంచి 21, ట్విటర్ 12 నుంచి 17కి పెరిగాయి. ఇదన్నమాట.. దేశంలో సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న విధానం. వచ్చే ఎన్నికల నాటికి ఈ లెక్కలు ఎలా మారుతాయో చూడాలి
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.