• HOME
  • »
  • NEWS
  • »
  • EXPLAINED
  • »
  • SHOULD THE PEOPLE WHO HAD COVID 19 STILL BE VACCINATED BA GH

ఈ టైంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం.. కరోనా వచ్చి తగ్గిన వాళ్లూ వ్యాక్సిన్ వేసుకోవాలా?

ఈ టైంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం.. కరోనా వచ్చి తగ్గిన వాళ్లూ వ్యాక్సిన్ వేసుకోవాలా?

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వైరస్.. ప్రపంచాన్ని మొత్తం గజగజలాడించిన మహమ్మారి వైరస్ ఇది. ఈ వైరస్  ప్రభావాన్ని తగ్గించేందుకు ఇప్పుడు టీకాలు అందుబాటులోకి వచ్చినా వాటిని తీసుకోవాలా? వద్దా? అన్న సందేహంలో చాలామంది ఉన్నారు.

  • Share this:
కరోనా వైరస్.. ప్రపంచాన్ని మొత్తం గజగజలాడించిన మహమ్మారి వైరస్ ఇది. ఈ వైరస్  ప్రభావాన్ని తగ్గించేందుకు ఇప్పుడు టీకాలు అందుబాటులోకి వచ్చినా వాటిని తీసుకోవాలా? వద్దా? అన్న సందేహంలో చాలామంది ఉన్నారు. వాటిని తీసుకోవడం వల్ల చెడు ప్రభావాలు ఏమైనా ఉంటాయేమో అన్న అనుమానం చాలామందిలో కనిపిస్తోంది. అయితే అలాంటి ప్రభావాలు ఏమీ ఉండవని వ్యాక్సీన్ ని తీసుకోవడం వల్ల కరోనా ముప్పు నుంచి తప్పించుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పటికే కరోనా వచ్చి దానికి చికిత్స తీసుకున్న వారు వ్యాక్సీన్ తీసుకోవాలా? వద్దా? అన్నది పెద్ద ప్రశ్న. దీనితో పాటు మన దేశంలో కొన్ని లక్షల మందికి కరోనా సోకినా వారి రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండడం వల్ల లక్షణాలేవీ లేకుండానే కరోనా తగ్గిపోయినట్లు ఎన్నో అధ్యయనాలు కూడా వెల్లడించాయి. ఇలాంటి వారు వ్యాక్సీన్ తీసుకుంటే వారిలో తిరిగి యాంటీ బాడీలు తయారవుతాయా? అన్నది మరో ప్రశ్న. వీటన్నింటికీ అవును. అనే సమాధానం ఇస్తున్నారు నిపుణులు.

కరోనా వైరస్ కోసం రెండు డోసుల్లో ఈ వ్యాక్సీన్ తీసుకోవడం వల్ల కేవలం కొవిడ్ 19 నుంచి మాత్రమే కాదు.. మరిన్ని ప్రాణాంతకమైన వైరస్ ల నుంచి కూడా మనకు రక్షణ కలుగుతుందని కాబట్టి దీన్ని తీసుకోవడానికి అస్సలు వెనుకాడవద్దని నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే మిగిలిన వారిలా వీరికి రెండు డోసుల వ్యాక్సీన్లు అవసరం లేకపోవచ్చు. ఒక డోసుతోనే వీరు కరోనా తో పాటు మిగిలిన ఆరోగ్య సమస్యలను తట్టుకునేందుకు రోగ నిరోధక శక్తిని సంపాదించుకుంటారని వివిధ పరిశోధనల్లో తేలింది.

ఎందుకంటే ఓ వ్యక్తికి నిజంగా వైరస్ సోకి వారికి కరోనా వచ్చినప్పుడు వారి రోగ నిరోధక శక్తి వ్యవహరించే తీరు వ్యాక్సీన్ వేసినప్పుడు వారి శరీరం వ్యవహరించే తీరు విభిన్నంగా ఉంటాయట. వారికి కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటే వారిలో ఎక్కువ యాంటీ బాడీలు తయారయ్యి అవి కొన్ని నెలల వరకూ యాక్టివ్ గా ఉంటాయి. కానీ ఒకవేళ వారికి లక్షణాలు చాలా స్వల్పంగా లేదా అసలు లేకపోవడం వల్ల యాంటీ బాడీలు కూడా చాలా తక్కువగా విడుదలవుతాయి. ఇవి కొన్ని వారాల సమయంలోనే తగ్గిపోతాయి. అదే వ్యాక్సీన్ ఇవ్వడం వల్ల శరీరంలో యాంటీ బాడీలు చాలా ఎక్కువ మోతాదులో తయారవుతాయి. కానీ శరీరంలో వైరస్ యాక్టివ్ గా లేకపోవడం వల్ల అవి అలాగే ఉండిపోతాయి. ఇది కరోనా సోకకుండా కాపాడుతుంది. ఒకవేళ కరోనా వైరస్ శరీరంలోకి అడుగుపెడితే వెంటనే ఈ యాంటీ బాడీలు దాన్ని నాశనం చేసేస్తాయి.

తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో కరోనా వైరస్ సోకిన వారి రక్త నమూనాలను గమనించారు. అందులో భాగంగా వారి రోగ నిరోధక వ్యవస్థ దక్షిణాఫ్రికాలో కనుగొన్న కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ B1351 ని నిరోధించలేకపోతోందట. దీంతో అంతకుముందు కరోనా వచ్చి తగ్గినవారిలోనూ తిరిగి మరో రకం స్ట్రెయిన్ కరోనా వైరస్ ద్వారా వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. కానీ ఫైజర్ లేదా మొడెర్నా వ్యాక్సీన్ తీసుకున్న వారిలో పరిస్థితి వేరుగా ఉంది. వీరిలో అన్ని స్ట్రెయిన్ల కరోనా వైరస్ కి నిరోధకాలు ఏర్పడ్డాయి. కరోనా వచ్చి తగ్గిన వారితో పోల్చుకుంటే ఈ రోగ నిరోధక శక్తి వెయ్యి రెట్లు ఉండడం విశేషం. కేవలం ఈ స్ట్రెయిన్ మాత్రమే కాదు.. అక్యూట్ రెస్పిరేటరీ డిసీజ్ గా పేరు పొందిన సార్స్ వైరస్ నుంచి కూడా ఇది రక్షణ కల్పిస్తుందట. కరోనా బారిన పడకుండా వ్యాక్సీన్ రెండు డోసులు తీసుకున్న వారితో పోల్చితే కరోనా బారిన పడి వ్యాక్సీన్ తీసుకున్న వారిలో ఈ యాంటీ బాడీలు ఇంకా ప్రభావవంతంగా పని చేస్తున్నాయని తేలిందట.

సియాటిల్ లో కొవిడ్ కొహొర్ట్ స్టడీలో భాగంగా పది మంది వాలంటీర్ల రక్త నమూనాలను సేకరించారు. ఈ పది మంది కొన్ని నెలల క్రితం వ్యాక్సీన్ తీసుకున్నవారే. ఇందులో ఏడుగురు ఫైజర్ టీకా తీసుకుంటే మరో ముగ్గురు మొడెర్నా వ్యాక్సీన్ తీసుకున్నారు. వ్యాక్సీనేషన్ కి ముందు తీసిన బ్లడ్ శాంపిల్ తో పోల్చితే వ్యాక్సీన్ తీసుకున్న రెండు నుంచి మూడు వారాల తర్వాత ఇచ్చిన బ్లడ్ శాంపిల్ లో కరోనాకి వ్యతిరేకంగా పోరాడే యాంటీ బాడీలు చాలా రెట్లు పెరిగాయని తేలింది. ఈ యాండీబాడీలు ఎంత కాలం పాటు అలాగే ఎక్కువ మోతాదులో ఉంటాయో తెలీదు కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఎక్కువ రోజులే నిలిచి ఉంటాయని వెల్లడిస్తున్నారు. యాంటీజెన్స్ ని గుర్తు పెట్టుకొని అవి శరీరంలోకి అడుగుపెట్టగానే వాటిని గుర్తించి వాటిపై దాడి చేసే ఇమ్యూన్ సెల్స్ సంఖ్యలోనూ పెరుగుదల కనిపించింది. వారికి ఇంతకుముందున్న రోగ నిరోధక శక్తి ఈ వ్యాక్సీన్ల మరింత పెరుగుతుందని చెప్పేందుకు ఇదే నిదర్శనం అంటూ ఈ అధ్యయనం నిర్వహించిన డాక్టర్ మెక్ గైర్ వెల్లడించారు.

అయితే న్యూయార్క్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో కరోనా వ్యాధి వచ్చి తగ్గిన వారిలో వ్యాక్సీన్ రెండో డోస్ సరిగ్గా పనిచేయడం లేదని తేలిందట. అయితే గతంలోనూ చాలా వైరస్ ల విషయంలోనూ ఇలాగే జరిగినట్లు వారు వెల్లడిస్తున్నారు. ఒక డోస్ తోనే వారు చాలా ఎక్కువ రోగ నిరోధక శక్తిని సంపాదించుకుంటున్నారని ఈ అధ్యయనం లో తేలిందట. అయితే రెండో డోస్ వేసిన తర్వాత యాంటీ బాడీల స్థాయుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదని వీరు పేర్కొన్నారు. ప్రపంచ జనాభాతో పోల్చితే కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య చాలా తక్కువ శాతంలోనే ఉంది. కానీ వారందరూ వ్యాక్సీన్ వేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి అని న్యూయార్క్ యూనివర్సిటీ లాంగాన్ వ్యాక్సీన్ సెంటర్ డైరెక్టర్ ఈ అధ్యయనం నిర్వహించి లీడ్ డాక్టర్ మార్క్ జె. ముల్లిగన్ వెల్లడించారు.

అయితే ల్యాబ్ లో పరిశీలించినప్పుడు కనిపించిన విధంగా యాంటీ బాడీలు వెయ్యి రెట్లు నిజంగా ప్రతి ఒక్కరిలోనూ పెరుగుతాయా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ జరిగిన అన్ని పరిశోధనల ఆధారంగా కరోనా వచ్చి తగ్గిన వారికి ఒక డోస్ వ్యాక్సీన్ సరిపోతుందని.. దీనివల్ల వారిలో చాలా ఎక్కువ మొత్తంలో యాంటీ బాడీలు విడుదలవుతాయని తేలింది. అయితే అమెరికాలోనే జరిగిన మరో సర్వే కరోనా వచ్చిన తగ్గినా వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వారిలో మిగిలిన వారితో పోల్చుకుంటే చాలా ఎక్కువ యాంటీ బాడీలు విడుదలవుతున్నాయని తేలిందట. దీంతో పరిశోధకులు అందరూ కనీసం ఒక్క డోస్ వ్యాక్సీన్ అయినా తప్పనిసరిగా వేయించుకోవాలని కోరుతున్నారు. అయితే ఒకటే డోస్ వ్యాక్సీన్ తీసుకున్నవారిలో కొన్ని వారాలు లేదా నెలల సమయం తర్వాత యాంటీ బాడీల స్థాయులు సరాసరి పడిపోతున్నాయని ఇలా జరగకుండా ఉండేందుకు రెండో డోస్ కూడా వేయించుకోవడం మంచిదని వారు వెల్లడిస్తున్నారు.

యాంటీ బాడీల సంఖ్య బాగా పెరగడానికి కారణంగా ఈ వ్యాక్సీన్లు చాలా రకాల వైరస్ లపై పోరాడేందుకు వీలుగా రూపొందించినవి కాబట్టి వాటన్నింటికీ వ్యతిరేకంగా యాంటీ బాడీలు సిద్ధమవడంతో సంఖ్య చాలా ఎక్కువవుతుందని వీరు వెల్లడిస్తున్నారు. ఈ వ్యాక్సీన్లు హెచ్ ఐవీపై పని చేస్తాయా? అని కూడా వారు పరీక్షించారు. అయితే హెచ్ ఐ వీ చాలా తొందరగా రూపాంతరం చెందుతుంది కాబట్టి ఈ యాంటీ బాడీల ప్రభావం దానిపై ఎక్కువగా ఉండదు అని వారు చెబుతున్నారు. కరోనా వైరస్ మాత్రం చాలా నెమ్మదిగా రూపాంతరం చెందుతుంది కాబట్టి కరోనా అన్ని రకాల స్ట్రెయిన్లకు చెందిన వైరస్ లపైనా ఈ వ్యాక్సీన్లు ప్రభావ వంతంగా ఉంటాయని వెల్లడిస్తున్నారు. అన్ని వైరస్ లపై పని చేసే వ్యాక్సీన్ తయారీ దిశగా కరోనా వ్యాక్సీన్ మొదటి అడుగు అని భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని పరిశోధనలు చేస్తామని వారు వెల్లడిస్తున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:

అగ్ర కథనాలు