సాధారణంగా వ్యోమగాములు అంతరిక్ష యాత్రకు (Space Mission) వెళ్ళినప్పుడు నెలల పాటు స్పేస్ లోనే విధులు నిర్వర్తిస్తుంటారు. అయితే వారు కూడా మనుషులే కాబట్టి వారిలో కూడా శృంగార కోరికలు కలుగుతాయనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మనుషులు తమ సెక్స్ కోరికలను (Sexual Desires) నెలల పాటు నియంత్రించుకోవడం కష్టమే. ముఖ్యంగా ఒత్తిడిని ఎదుర్కోవడానికి శృంగారం ఒక మందులా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. భిన్న వాతావరణ పరిస్థితుల్లో ఉండే వ్యోమగాములు (Astronoutes) తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇలాంటి పరిస్థితులలో వారికి శారీరక సుఖం పొందాలని ఉంటుంది. కానీ అంతరిక్షంలో సెక్స్ (Sex in Space possible?) చేయడం సాధ్యమేనా? సైన్స్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. అంతరిక్షంలో సెక్స్‌లో పాల్గొనడానికి వీలుగా ఎందుకు పరిష్కారాలు కనిపెట్టడం లేదు? వంటి ప్రశ్నలకు శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
గత కొంతకాలంగా అంతరిక్ష అన్వేషణలు, 'మార్స్ మిషన్లు' (Mars Missions) అంటూ ఎన్నో వార్తలు మనకు వినిపిస్తున్నాయి. సామాన్యులను సైతం అంతరిక్ష యాత్రలకు తీసుకెళ్లేందుకు పలు స్పేస్ ఏజెన్సీలు ముందడుగులు వేస్తున్నాయి. కానీ ఇప్పటికీ ఏ స్పేస్ సంస్థలూ అంతరిక్షంలో సెక్స్ కి సంబంధించి సైంటిఫిక్ ప్రయోగాలను ముందుకు తీసుకు వెళ్లడం లేదు. అంతరిక్షంలో లైంగిక కార్యకలాపాలు జరగలేదని నాసా, ఇతర అంతరిక్ష సంస్థలు చాలాకాలంగా తేల్చి చెబుతున్నాయి. మైక్రోగ్రావిటీలో సెక్స్‌లో పాల్గొనడం వల్ల చాలా సమస్యలు వస్తాయని స్పేస్ సైంటిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు. అందుకే వ్యోమగాములు తమ కోరికలను చంపుకుంటున్నారు.
అంతరిక్షంలో శృంగారానికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి?
అంతరిక్షంలో సెక్స్‌లో పాల్గొంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త జాన్ మిల్లిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "స్కైడైవింగ్" చేసేటప్పుడు శృంగారం చేయడం ఎంత కష్టమో.. అంతరిక్షంలో శృంగారం చేయడమనేది కూడా అంతే కష్టం అని మిల్లిస్ చెప్పుకొచ్చారు. కష్టమే అయినప్పటికీ అక్కడ లైంగిక కార్యకలాపాలు అసాధ్యం కాదని తెలిపారు.
"అంతరిక్షంలో శృంగారంలో పాల్గొంటే మైక్రో-గ్రావిటీ, వ్యోమగాములు అనుభవించే వాతావరణం, ఫ్రీఫాల్(బరువులేనితనం) వంటి సమస్యలు ఎదురవుతాయి. స్కైడైవింగ్ చేసేటప్పుడు శృంగార చర్య చేస్తే.. ప్రతి పుష్ ఇరువురు శృంగార భాగస్వాములను వ్యతిరేక దిశలో నెట్టివేస్తుంది" అని జాన్ మిల్లిస్ వివరించారు.
అసలు సమస్యలు ఏంటి?
తక్కువ గురుత్వాకర్షణ కారణంగా శరీరంలో రక్త ప్రవాహం, ఒత్తిడి మానవుల శృంగార కోరికలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్పారు. ఈ పరిస్థితులలో రక్తం లైంగికావయవాలకు ప్రసరించకుండా తలవైపు ప్రసరిస్తుందని.. తద్వారా మానవులకు శృంగార కోరికలు నశించిపోతాయని నిపుణులు వివరించారు.
దానికి తోడు నడుం కంటే కింద భాగంలో నిరంతరం ఏర్పడే ‘లో-ప్రెజర్’ వల్ల పురుషాంగ కణజాలం కుంచించుకుపోతుంది. ఇలాంటి వాతావరణంలో అంగస్తంభన జరగడం అసాధ్యం కానుక మగవారు శృంగారానికి దూరంగా ఉండొచ్చు. లో-గ్రావిటీ వాతావరణంలో టెస్టోస్టిరాన్ స్థాయిలు కూడా అకస్మాత్తుగా పడిపోతాయి. దీనివల్ల లైంగిక కోరికలు పూర్తిగా చచ్చిపోతాయి.
తక్కువ గురుత్వాకర్షణ శక్తిలో శృంగారం సాధ్యమేనా?
ఒక సాధారణ వ్యోమనౌక బోయింగ్ 737 సైజులో ఉంటుంది. కానీ ఇందులో ఒక్క ప్రైవసీ గది కూడా ఉండదు. సిబ్బంది క్యాబిన్, మిడ్డెక్, బాత్రూమ్, రెస్ట్రూమ్ ఉంటాయి. అయితే ఇవన్నీ బయటికి కనిపించే ప్రదేశాలే. ఇలాంటి వ్యోమనౌకలో తక్కువ గురుత్వాకర్షణలో సెక్స్ లో పాల్గొనడం సాధ్యమైనా.. ఎవరూ ధైర్యం చేయరు. ఎందుకంటే లైంగిక చర్య వల్ల విడుదలయ్యే చెమట, ఇతర స్రావాలు అంతరిక్ష నౌకలో గాలిలో తేలియాడుతూ ఉంటాయి.
వారాంతంలో లైంగిక సుఖం సాధ్యమేనా?
ఈ దృశ్యాలు చూడ్డానికి చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. ఇక అంతరిక్షంలో పనిచేసే వారికి చాలా తక్కువసేపు విరామం దొరుకుతుంది. అయితే కొందరికి వారాంతపు సెలవులు ఉంటాయని చెబుతుంటారు. ఆ సమయంలో వారు లైంగిక సుఖం పొందుతారా? అని అడిగితే ఎవరి దగ్గర సరైన సమాధానం లేదు.స్పేస్ రంగంలో సెక్స్ గురించి తాము అధ్యయనాలు చేయమని.. ఇప్పటికీ ఆ తరహా అధ్యయనాలు కొనసాగడం లేదని నాసా ప్రతినిధి చెప్పారు. దాని గురించి డిస్కస్ చేయడానికి ఏమీ లేదన్నారు.
పెళ్లయిన జంటలకు కూడా అంతరిక్షయానం
1991 కాలానికి ముందు నాసా పెళ్లయిన జంటలను అంతరిక్ష యాత్రలకు పంపించేది కాదు. కానీ ఆ తర్వాత ఈ నిబంధనను ఎత్తివేశారు. ఒక రష్యన్ వ్యోమగామి.. మహిళా వ్యోమగామితో శృంగారంలో పాల్గొనాలని ప్రయత్నించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ సదరు ఆస్ట్రోనాట్ ఈ వార్తలను ఖండించారు.
సెక్స్ టాయ్స్ ఉపయోగించొచ్చంటున్న నిపుణులు
అయితే ఇలాంటి శృంగార కోరికలు కలిగినప్పుడు సెక్స్ టాయ్స్ ఉపయోగించవచ్చని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ రచయిత వన్నా బోంటా అంతరిక్షంలో మానవులు శృంగార కోరికలు తీర్చుకునేందుకు వీలుగా '2 సూట్' అనే ఓ అవుట్ ఫిట్ తయారు చేశారు. కానీ అది ఇప్పటికీ అమలులోకి రాలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా వ్యోమనౌకల్లో కూడా శృంగారం చేయడం సాధ్యపడేలా కొత్త విధానాలను తీసుకువచ్చేందుకు చర్చలు జరపాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Space, Trending news, VIRAL NEWS