Sensex crash: సెన్సెక్స్ 1440 పాయింట్లు ఎందుకు నష్టపోయింది...మార్కెట్ల క్షీణతకు కారణాలేంటి...?

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కేసులు గణనీయంగా పెరగడం వల్ల ఆర్థిక కార్యకలపాలపై ప్రభావం ఆందోళనకరంగా మారింది. ఆదివారం నాడు కోవిడ్ కేసులు అత్యధికంగా నమోదు కావడంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందనే భయం కారణంగా ఈ ప్రభావం పడింది.

  • Share this:
భారత్ లో కోవిడ్ కేసులు తీవ్రంగా ఉన్నాయి. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ పై పడింది. సోమవారం నాడు ప్రారంభంలోనే సెన్సెక్స్ 1440 పాయింట్లు క్షీణించి 2.9 శాతం దిగజారింది. అంతేకాకుండా భారత్ లో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ ఏడు నెలల కనిష్ఠానికి చేరింది. ఆసియా ప్రధాన సూచీలు బలంగా ట్రేడ్ అవుతూ 0.5 నుంచి 2 శాతం మధ్య ఉన్నప్పటికీ భారత మార్కెట్లో పతనం మొదలైంది.

మార్కెట్లు ఎందుకు క్షీణించాయి?
కరోనా కేసులు గణనీయంగా పెరగడం వల్ల ఆర్థిక కార్యకలపాలపై ప్రభావం ఆందోళనకరంగా మారింది. ఆదివారం నాడు కోవిడ్ కేసులు అత్యధికంగా నమోదు కావడంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందనే భయం కారణంగా ఈ ప్రభావం పడింది. మహారాష్ట్ర లాంటి పెద్ద పారిశ్రామిక రాష్ట్రం ప్రారంభ చర్యగా వారాంతాల్లో లాక్డౌన్ ప్రకటించడంతో పాటు మరింత కఠినమైన చర్యలు కొనసాగించే అవకాశం ఉందని సూచించడంతో మార్కెట్లో జోరు తగ్గింది.

గత నెలలోనూ కరోనా కేసులు పెరగడంతో పారిశ్రామిక రంగంపై ప్రభావం పడింది. మార్చిలో భారత మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పాదక రంగం కార్యకలాపాలు బాగా బలహీనపడ్డాయి. ఫిబ్రవరిలో ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్ఛేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) 57.5 నుంచి మార్చి నాటికి 55.4 పాయింట్లతో ఏడు నెలల కనిష్ఠానికి పడిపోయింది. కోవిడ్ కేసుల్లో తాజా పెరుగుదల కారణంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో మందగమనానికి ఇది సూచనగా ఉంది. ఏప్రిల్ నెలలో పరిస్థితి మరింత సవాలుగా మారుతుంది. ఇది మార్కెట్ సెంటిమెంట్ పై కూడా పెద్ద ప్రభావాన్ని చూపనుంది. గత సంవత్సరం ఏప్రిల్, మే మాసాల్లో ప్రభుత్వం కఠినమైన లాక్డౌన్ విధించనట్లయితే ఉత్పాదక కార్యకలాపాలు అంత ప్రభావం అయ్యేవి కావు. వినియోగదారుల సెంటిమెంట్, డిమాండ్ వల్ల వృద్ధిలో ఆందోళన పెరుగుతోంది. ఉదాహరణకు గత కొద్ది నెలలుగా ఆటో అమ్మకాల సంఖ్య బలంగా ఉన్నప్పటికీ, అంతర్గతంగా దీని భవిష్యత్తుపై చాలామంది అంత నమ్మకంగా లేరు.

పర్సనల్ మొబలిటీకి ప్రాధాన్యత ఉన్నందున డిమాండ్ పెరుగుతున్నప్పటికీ దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా భవిష్యత్తును ఊహించలేమని టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ సీనియర్ వీపి నవీన్ సోనీ తెలిపారు. వాతావరణం చాలా అనూహ్యంగా మారుతుందని, ప్రతి ఒక్కరూ డిమాండ్ ను అంచనా వేయడానికి, భవిష్యత్తును ఊహించడానికి ప్రయత్నిస్తున్నారని స్పష్టం చేశారు. పెరుగుతున్న కోవిడ్ కేసుల ప్రభావం మహారాష్ట్రతో ఇతర రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తుందని, డిమాండ్ సరళంగా ఉందని తెలిపారు.

మార్కెట్లు ఒత్తిడికి లోనవుతాయా?
2020లో ఉన్నంతగా అంత తీవ్రంగా లాక్డౌన్ ఇప్పుడు లేదు. కాబట్టి గత సంవత్సరంలో మాదిరిగా మార్కెట్ సర్దుబాట్లు ఉండకపోవచ్చని మదుపుదారులు భావిస్తున్నారు. కోవిడ్ కొత్తగా తెలియంది కాదని, వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుండటంతో మార్కెట్లో కొంత సౌలభ్యం ఉందని అనుకుంటున్నారు. "ఏదేమైనప్పటికీ సమీప కాలంలో కేసుల పెరుగుదల కారణంగా మార్కెట్ ఆందోళన పరిస్థితులు ఉండనున్నాయి.

ఆర్థిక వ్యవస్థ తిరిగి ట్రాక్ లోకి రావడం ప్రారంభించనప్పటికీ, కేసుల పెరుగుదల ఆర్థిక పునరుద్ధరణ ప్రక్రియను మందగింపజేస్తుంది. ఇది మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీస్తుంది" అని లీడింగ్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఒకరు చెప్పారు.
First published: