SCSS withdrawal: సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో డబ్బు విత్‌డ్రా చేయాలనుకుంటున్నారా..

ప్రతీకాత్మకచిత్రం

సీనియర్ సిటిజన్లు నష్టభయం లేని పెట్టుబడులను ఎంచుకోవడం ద్వారా మంచి రాబడి పొందవచ్చు. వీరికోసమే ప్రత్యేకంగా కొన్ని సేవింగ్స్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న పథకాల్లో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌కు మంచి ఆదరణ ఉంది. దీని ద్వారా 7.4 శాతం వడ్డీని పొందవచ్చు.

  • Share this:
సీనియర్ సిటిజన్లు నష్టభయం లేని పెట్టుబడులను ఎంచుకోవడం ద్వారా మంచి రాబడి పొందవచ్చు. వీరికోసమే ప్రత్యేకంగా కొన్ని సేవింగ్స్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న పథకాల్లో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌కు మంచి ఆదరణ ఉంది. దీని ద్వారా 7.4 శాతం వడ్డీని పొందవచ్చు. ఐదేళ్ల మెచ్యూరిటీ ఉండే SCSS ద్వారా రిటైర్మెంట్ సమయంలో స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ఈ పథకంలో చేరేవారికి కనీసం 60 సంవత్సరాలు ఉండాలి. 55-60 సంవత్సరాల వయసు ఉండి, VRS తీసుకున్నవారు కూడా SCSS అకౌంట్ తీసుకోవచ్చు. దీంట్లో రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. పోస్టాఫీసులో సులభంగా ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ పథకంలో డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి.

- సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ తీసుకున్న ఒక సంవత్సరం తరువాత.. అకౌంట్‌ను మూసివేయవచ్చు. కానీ ప్రీ మెచూర్ విత్‌డ్రా చేసుకున్నప్పుడు డిపాజిట్లపై వడ్డీని మినహాయించి, మిగిలిన మొత్తాన్ని అకౌంట్ హోల్డర్‌కు చెల్లిస్తారు.

- ఒకవేళ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేసిన ఒకటి, రెండు సంవత్సరాల లోపు క్లోజ్ చేస్తే.. డిపాజిట్ మొత్తంలో 1.5 శాతాన్ని విత్ హెల్డ్ చేస్తారు. మిగిలిన మొత్తాన్ని ఖాతాదారులకు క్రెడిట్ చేస్తారు.

- అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత రెండు నుంచి ఐదేళ్లలో అకౌంట్ మూసివేస్తే.. అసలు డిపాజిట్లో ఒక శాతం మొత్తాన్ని విత్ హెల్డ్ చేస్తారు. మిగిలిన డబ్బును ఖాతాదారులకు క్రెడిట్ చేస్తారు.

- సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం అకౌంట్‌ను మూడేళ్ల బ్లాక్ పీరియడ్‌తో పొడిగించుకోవచ్చు. ఒకవేళ ఖాతాదారులు అకౌంట్‌ను ఒకసారి పొడిగించుకుంటే.. పొడిగించిన తేదీ నుంచి ఒక సంవత్సరం లోపు ఎలాంటి జరిమానా లేకుండా అకౌంట్‌ను మూసివేయవచ్చు.

- మెచూరిటీ లోపు డిపాజిటర్ చనిపోతే SCSS అకౌంట్‌ను రద్దు చేస్తారు. చనిపోయే తేదీ నాటికి సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటుతో డిపాజిట్ మొత్తాన్ని ఖాతాదారుల నామినీకి చెల్లిస్తారు. ప్రస్తుతం ఈ వడ్డీ రేటు నాలుగు శాతంగా ఉంది.

- ఒకవేళ జీవిత భాగస్వామితో జాయింట్ అకౌంట్ తీసుకున్నSCSS ఖాతాదారుడు చనిపోతే.. నామినీగా ఉన్న భాగస్వామి అకౌంట్‌ను కొనసాగించవచ్చు. కానీ ఇందుకు నామినీకి కూడా SCSS అకౌంట్ ఆపరేట్ చేసేందుకు అర్హత ఉండాలి.

- ఒక ఖాతాదారుడికి వ్యక్తిగతంగా ఒక SCSS అకౌంట్, భాగస్వామితో జాయింట్ SCSS అకౌంట్ ఉన్న సందర్భంలో.. ప్రైమరీ ఖాతాదారుడు చనిపోయినప్పుడు వారి వ్యక్తిగత SCSS అకౌంట్‌ను రద్దు చేస్తారు. ఉమ్మడి అకౌంట్‌కు నామినీగా ఉన్న భాగస్వామి.. ఆ అకౌంట్‌ను కొనసాగించవచ్చు.

- మెచూరిటీ తరువాత ఖాతాను మూసివేయకపోయినా, పొడిగించకపోయినా.. అకౌంట్ మెచూరిటీ అయినట్లుగానే భావిస్తారు. అప్పటికి అమల్లో ఉన్న వడ్డీ రేటుతో ఖాతాదారుడికి చెల్లించాల్సిన మొత్తాన్ని లెక్కిస్తారు.

- వీటితో పాటు పథకంలో ఉండే మరిన్ని నియమ నిబంధనలు తెలుసుకున్న తరువాతే SCSS అకౌంట్ తీసుకోవాలి. అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి.
Published by:Krishna Adithya
First published: