Explained: ఆల్ఫా, బీటా వంటి అన్ని వేరియంట్లను నిరోధించగలిగే సింగిల్​ కోవిడ్ వ్యాక్సిన్​పై శాస్త్రవేత్తల ప్రయోగాలు

ప్రతీకాత్మక చిత్రం

చాలా దేశాలు బూస్టర్ డోసు (booster dose)లను ప్రజలకు అందిస్తున్నాయి. ఇప్పటి వరకు కొత్తగా అప్‌డేట్ చేస్తున్న వ్యాక్సిన్లు, అదనపు వ్యాక్సిన్ డోసులే.. దీర్ఘకాలంలో కరోనా (corona)ను ఎదుర్కొనే మార్గాలుగా ఉన్నాయి. అయితే ఇదంతా అదనపు ఖర్చు, సమయంతో కూడుకున్న ప్రక్రియ. ఈ క్రమంలో వివిధ రకాల వేరియంట్ల (variants)ను ఎదుర్కొనే సమర్థవంతమైన సింగిల్ డోస్ (single dose) వ్యాక్సిన్‌పై పరిశోధకులు ప్రయోగాలు చేస్తున్నారు.

  • Share this:
    కొత్తగా ఉద్భవిస్తున్న కోవిడ్ వేరియంట్లు (Covid variants).. వ్యాక్సిన్లు (vaccines) అందించే యాంటీబాడీలు లేదా సహజ ఇన్‌ఫెక్షన్‌ ద్వారా వృద్ధి చెందే యాంటీబాడీలకు లొంగట్లేదని అధ్యయనాలు తేల్చాయి. దీనికి తోడు మానవ శరీరంలో వృద్ధి చెందే యాంటీబాడీలు కొంత కాలమే ప్రభావవంతంగా ఉంటాయి. అందువల్ల చాలా దేశాలు బూస్టర్ డోసు (booster dose)లను ప్రజలకు అందిస్తున్నాయి. ఇప్పటి వరకు కొత్తగా అప్‌డేట్ చేస్తున్న వ్యాక్సిన్లు, అదనపు వ్యాక్సిన్ డోసులే.. దీర్ఘకాలంలో కరోనా (corona)ను ఎదుర్కొనే మార్గాలుగా ఉన్నాయి. అయితే ఇదంతా అదనపు ఖర్చు, సమయంతో కూడుకున్న ప్రక్రియ. ఈ క్రమంలో వివిధ రకాల వేరియంట్ల (variants)ను ఎదుర్కొనే సమర్థవంతమైన సింగిల్ డోస్ (single dose) వ్యాక్సిన్‌పై పరిశోధకులు ప్రయోగాలు చేస్తున్నారు.

    సింగిల్ డోస్ వ్యాక్సిన్‌తో..

    కరోనావైరస్ వివిధ దేశాల్లో వివిధ వేరియంట్లు (Multivariant vaccine)గా రూపాంతరం చెందుతూ దశల వారీగా విజృంభిస్తోంది. అందువల్ల కాలానుగుణంగా మారే వివిధ రకాల వేరియంట్లను లక్ష్యంగా చేసుకొనే సింగిల్ డోస్ వ్యాక్సిన్‌తో కరోనా వైరస్‌కు శాశ్వత పరిష్కారాన్ని చూపించే ప్రయత్నాల్లో ఉన్నారు పరిశోధకులు. బ్రిటన్  (britan)లో దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి.

    * మల్టీ వేరియంట్ వ్యాక్సిన్ అంటే ఏంటి?

    అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులను ప్రజలకు అందిస్తున్నాయి. అయితే కొత్త రకం కరోనా వేరియంట్లను ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్లు సమర్థంగా ఎదుర్కొనే విషయంపై శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మా సంస్థలు ఈ కొత్త రకం కోవిడ్ వేరియంట్లను నిరోధించడానికి తమ డోసులను అప్‌డేట్ చేయాలని చూస్తున్నాయి. ప్రస్తుతం వినియోగిస్తున్న వ్యాక్సిన్‌లను మహమ్మారి ప్రారంభమైన రోజుల్లో అభివృద్ధి చేశారు. దీంతో ఇవి ప్రస్తుతం బలంగా మారిన వేరియంట్లపై, భవిష్యత్తులో పుట్టుకొచ్చే వేరియంట్లపై ప్రబలంగా పని చేసే అంశంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

    ప్రస్తుతం వినియోగిస్తున్న వ్యాక్సిన్లు తీవ్రమైన కోవిడ్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తున్నాయని నిపుణులు (experts) చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రజల్లో కోవిడ్ యాంటీబాడీలు, రోగనిరోధకత (Immunity system) తగ్గిపోతాయనే ఆలోచనతో వివిధ దేశాలు బూస్టర్ డోసులు వేస్తున్నాయి. అయితే బూస్టర్ డోసులు (booster dose) సైతం ముందు వేసిన సాధారణ వ్యాక్సిన్ డోసుల మాదిరిగానే ఉంటాయి. దీనికి తోడు మల్టిపుల్ డోసుల వల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఎదురయ్యే ప్రమాదం సైతం ఉంది.

    అందువల్ల ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వివిధ రకాల కోవిడ్ వేరియంట్లు (Multivariant vaccine), భవిష్యత్తులో ప్రమాదకరంగా రూపాంతరం (changeable) చెందే వేరియంట్లను లక్ష్యంగా చేసుకొని కొత్త రకం వ్యాక్సిన్లను రూపొందించడంపై కొందరు పరిశోధకులు దృష్టి సారించారు. ఇలాంటి వాటిని ‘మల్టీ వేరియంట్ వ్యాక్సిన్ (Multivariant vaccine)’గా పిలుస్తున్నారు. ఇప్పటికే ఉన్న టీకాలు వైరస్‌ను ఎలా లక్ష్యంగా చేసుకుంటాయనే ప్రక్రియను మరింత విస్తరించడం, విశ్లేషించడం ద్వారా మల్టీ వేరియంట్ వ్యాక్సిన్ల (Multivariant vaccine)ను రూపొందిస్తున్నారు.

    * మల్టీ వేరియంట్ వ్యాక్సిన్ ఎలా పని చేస్తుంది?

    ఇప్పటికే ఉన్న చాలా వ్యాక్సిన్లను కరోనావైరస్ స్పైక్ ప్రోటీన్‌ (spike protein)ను లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి చేశారు. కొమ్ముల మాదిరిగా ఉండే ఈ స్పైక్ ప్రోటీన్ (spike protein).. మనుషుల శరీర కణాలకు అతుక్కొని వృద్ధి చెందగలదు. అందుకే దీన్ని నిర్వీర్యం చేసేలా వ్యాక్సిన్లను తయారు చేశారు. అయితే కొత్తగా రూపాంతరం చెందుతున్న కరోనా వైరస్ వేరియంట్లు (corona virus variant) .. స్పైక్ ప్రోటీన్‌ను సైతం మార్చుకుంటున్నాయి. దీంతో టీకాల ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యకు కొత్త రకం టీకాలు చెక్ పెట్టనున్నాయి.

    గ్రిట్‌స్టోన్ అనే అమెరికా సంస్థ ఇప్పటికే మల్టీ వేరియంట్ టీకా (Multivariant vaccine)లపై ప్రయోగాలు ప్రారంభించింది. GRT-R910 అనే పేరుతో దీన్ని అభివృద్ధి (develop) చేస్తోంది. ఈ వ్యాక్సిన్.. స్పైక్, నాన్-స్పైక్ ప్రోటీన్‌లను లక్ష్యంగా చేసుకుంటుందని గ్రిట్ స్టోన్ (Gritstone) సంస్థ చెబుతోంది.

    అన్ని రకాల Sars-CoV-2 వేరియంట్‌లకు వ్యతిరేకంగా, విస్తృతమైన చికిత్స సామర్థ్యాన్ని కలిగి ఉండేలా GRT-R910 వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు గ్రిట్‌స్టోన్ ( Gritstone) CEO ఆండ్రూ అలెన్. వైరస్‌లో జన్యు వైవిధ్యానికి తక్కువ అవకాశం ఉండే స్పైక్ ప్రోటీన్ల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. గ్రిట్‌స్టోన్ లాంటి టీకాలను రెండవ తరం (second generation) టీకాలుగా అభివర్ణిస్తున్నారు పరిశోధకులు. ఇవి మొదటి తరం కోవిడ్ వ్యాక్సిన్‌ల రోగనిరోధక శక్తిని పెంచడానికి, విస్తరించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్లు అని విశ్లేషిస్తున్నారు.

    ప్రస్తుతం UKలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న 20 మంది వ్యక్తుల బృందంపై ట్రయల్స్‌ జరుగుతున్నాయి. మొదటి తరం టీకా (FIRST GENERATION VACCINE) అయిన ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా (భారత్‌లో కోవిషీల్డ్) వ్యాక్సిన్ (covishield vaccine) అందించిన రోగనిరోధక శక్తిని GRT-R910 ఎలా పెంచుతుందని అన్వేషిస్తారు. కోవిషీల్డ్ వైరల్ వెక్టర్ టీకా అయితే.. GRT-R910ను సెల్ఫ్- యాంప్లిఫయింగ్ RNA (SARNA) ప్లాట్‌ఫాంపై అభివృద్ధి చేశారు.

    * saRNA ప్లాట్‌ఫాం అంటే ఏంటి?
    ఇది కూడా mRNA ప్లాట్‌ఫాం వంటిదే. ఫైజర్, బయోఎంటెక్, మోడర్నా వ్యాక్సిన్‌లను mRNA ఆధారంగానే రూపొందించారు. సార్స్- కోవ్-2 స్పైక్ ప్రోటీన్‌ను గుర్తించి, కరోనా వైరస్‌పై దాడి చేసేలా వీటిని అభివృద్ధి చేశారు. సాంప్రదాయ వ్యాక్సిన్‌ల మాదిరిగా వీటిలో కరోనా వైరస్‌కు చెందిన భాగాలు (actual pieces) ఉండవు. అందువల్ల ఇవి సురక్షితమైనవి. వీటి తయారీ కూడా సులభంగానే ఉంటుంది. saRNA వ్యాక్సిన్ కూడా mRNA మాదిరిగానే పనిచేస్తుంది. 'm' అంటే 'మెసెంజర్' అని అర్థం. రోగనిరోధక వ్యవస్థ స్పైక్ ప్రోటీన్‌ను సిద్ధం చేయాలనే సూచనను కలిగి ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఇవి తక్కువ డోసుతో ఎక్కువ ప్రభావవంతంగా పనిచేయగలవు.

    * ట్రయల్స్ ఎవరు చేపట్టారు? టీకా ఎప్పుడు సిద్ధమవుతుంది?
    ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌ను గ్రిట్‌స్టోన్ సంస్థ, UK లోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయం, మాంచెస్టర్ యూనివర్సిటీ NHS ఫౌండేషన్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 60 ఏళ్లు పైబడిన 20 మంది వాలంటీర్లపై ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఫలితాలు 2022 మొదటి త్రైమాసికంలో విడుదల కానున్నాయి. వీటిని పూర్తి స్థాయిలో విశ్లేషించిన తరువాతే ఈ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే అంశంపై స్పష్టత రానుంది.
    Published by:Prabhakar Vaddi
    First published: