Home /News /explained /

RUSSIA USES X 22 MISSILES TO BOMB KYIV FIRST TIME IN WEEKS MOSCOW CLAIMS STRIKES ON T 72 TANKS ARMOURED VEHICLES WHAT IS X22 MISSILE KNOW HERE GH VB

Ukraine-Russia War: బాంబు దాడిలో మొదటిసారి X-22 మిసైల్స్‌ ఉపయోగించిన రష్యా.. X-22 మిసైల్స్‌ అంటే ఏమిటి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జూన్ 5న కాస్పియన్ సముద్రం నుంచి కీవ్‌ వైపు ఐదు X-22 క్రూయిజ్ మిసైల్స్‌ను రష్యా ప్రయోగించినట్లు ఉక్రెయిన్ తెలిపింది. Kh-22గా పిలిచే X-22 మిసైల్‌ సోవియట్ కాలంలో లాంగ్‌ రేంజ్‌ యాంటీ షిప్‌ మిసైల్‌ను అభివృద్ధి చేశారు.

జూన్ 5న కాస్పియన్ సముద్రం(Caspian Sea) నుంచి కీవ్‌(Kiev) వైపు ఐదు X-22 క్రూయిజ్ మిసైల్స్‌ను(Cruise Missile) రష్యా(Russia) ప్రయోగించినట్లు ఉక్రెయిన్(Ukraine) తెలిపింది. Kh-22గా పిలిచే X-22 మిసైల్‌ సోవియట్(Soviet) కాలంలో లాంగ్‌ రేంజ్‌(Long Range) యాంటీ షిప్‌ మిసైల్‌ను(Missile) అభివృద్ధి చేశారు. కన్వెన్షనల్‌ లేదా న్యూక్లియర్‌ వార్‌ హెడ్‌లతో(Nuclear War Head) యూఎస్‌ నేవీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లు(Aircraft Carrier), క్యారియర్ యుద్ధ సమూహాలను ఎదుర్కొనేందుకు తయారు చేయడం జరిగింది. X-22 మిసైల్‌ అనేది TG-02తో ఇంధనంగా రెడ్ ఫ్యూమింగ్ నైట్రిక్ యాసిడ్‌, టుమాన్స్కీ లిక్విడ్‌ ఫ్యూయల్‌(Fuel) రాకెట్‌ ఇంజిన్(Engine) ఉపయోగించుకుంటుంది. X-22 మిసైల్‌ రేడియో ఆల్టిమీటర్‌తో కలిసి గైరోస్కోప్-స్టెబిలైజ్డ్ ఆటోపైలట్ ద్వారా మార్గనిర్దేశం చేస్తుంది. ఏకకాలంలో ఎత్తులో వేగంగా ప్రయాణించేలా సెల్ఫ్‌ ఇగ్నిషన్(Self Ignition) కోసం ఇంధనం ఉపయోగించే X-22 మిసైల్‌.. పేర్కొన్న వేగాన్ని చేరుకున్న తర్వాత రాకెట్ ఇంజిన్ మార్చింగ్ మోడ్‌కు మారే సదుపాయం ఉంది.

ALSO READ: EU bans Russia oil imports: రష్యాకి ఈయూ బిగ్ షాక్..ఆయిల్ దిగుమతిపై బ్యాన్

X-22 మిసైల్‌ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఎయిర్‌ టూ సర్ఫేస్‌, ఎయిర్‌ టూ సీ మిసైల్‌గా ఉంటుంది. గరిష్ట వేగం MACH 4.6గా.. గరిష్ట పరిధి 600 కి.మీ ఉంటుంది. గరిష్ట ఎత్తు 89,000 ఫీట్‌. 1962లో సోవియట్ యూనియన్ సేవల్లోకి X-22 మిసైల్స్‌ చేరింది. వాటిని మొదటిసారి ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా ఉపయోగించినట్లు సమాచారం. రష్యా వైమానిక దళం Tu-22M3 స్ట్రాటెజిక్‌ బాంబర్ మే 11న రెండు X-22 మిసైల్స్‌ను ప్రయోగించినట్లు నివేదికలు వెలువడుతున్నాయి.పశ్చిమ దేశాలు అందజేసిన సైనిక సాయం లక్ష్యమన్న రష్యా..
జూన్ 5న కీవ్‌లోని పశ్చిమ దేశాలు విరాళంగా ఇచ్చిన ట్యాంకులు, ఇతర సైనిక సామగ్రిని లక్ష్యంగా చేసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 28 నుంచి మొదటిసారిగా కీవ్‌ శివార్లలో తూర్పు యూరోపియన్ దేశాలు సరఫరా చేసిన T-72 ట్యాంకులను రష్యా నాశనం చేసింది. ట్రైన్‌ కార్‌ రిపేర్‌ వ్యాపార భవనాల్లో ఉన్న ఇతర సాయుధ వాహనాలను కూడా నాశనం చేసినట్లు రష్యా తెలిపింది. అయితే అక్కడ ఎలాంటి సైనిక సామగ్రిని నిల్వ చేయలేదని ఉక్రెయిన్ రైల్వే అథారిటీ పేర్కొంది. రష్యా వాదనను ఖండించిన ఉక్రెయిన్ ప్రభుత్వం, ఎయిర్‌ డిఫెన్స్‌ క్రూయిజ్ మిసైల్‌లో ఒకదాన్ని కూల్చివేసినట్లు ప్రకటింది.

Explained: ప్రభుత్వానికి RBI ట్రాన్స్‌ఫర్ చేసే డివిడెండ్‌లో భారీ తగ్గుదల.. ఈ డివిడెండ్ ఎందుకు తగ్గుతోంది..?


మరో నాలుగు మిసైల్స్‌ మౌలిక సదుపాయాలను తాకాయని, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఉక్రెయిన్ తెలిపింది. సైనిక మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ఓ జాతీయ టీవీలో ఛానెల్‌లో ఉక్రెయిన్‌ ప్రభుత్వ సలహాదారు చెప్పారు. టార్గెటెడ్‌ వేర్‌హౌస్‌ ఫోటోలను తీయకుండా ఉక్రెయిన్ సైన్యం నిషేధించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. సమీపంలోని ఒక పెద్ద రైల్వే యార్డ్ వైపు మార్గాన్ని ఉక్రెయిన్‌ సైనికులు బ్లాక్‌ చేశారు.

లాంగ్‌ రేంజ్‌ వెపన్స్‌తో పశ్చిమానికి పుతిన్ హెచ్చరిక..
ఉక్రెయిన్‌కు పాశ్చాత్య ఆయుధాల పంపిణీపై మండిపడ్డ పుతిన్, యుద్ధాన్ని పొడిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌కు పాశ్చాత్య సైనిక డెలివరీలను రష్యా దళాలు నాశనం చేస్తాయని పుతిన్ హెచ్చిరించారు. ఉక్రెయిన్‌కు యూఎస్‌ లాంగ్‌ రేంజ్‌ మిసైల్స్‌ను అందిస్తే ఇంకా తాకని లక్ష్యాలపై దాడులు చేస్తామని పుతిన్‌ అన్నారు. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు లాంగ్‌ రేంజ్‌ మిసైల్స్‌ అందిస్తే యుద్ధం ఉధృతమవుతుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ హెచ్చరించారు.

సరఫరా చేసే వెపన్స్‌ రేంజ్‌ ఎంత ఎక్కువ ఉంటే నయా-నాజీలపై రష్యా వైఖరి అంత తీవ్రమవుతుందని సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు 80 కి.మీ దూరంలోని లక్ష్యాలపై దాడి చేయగల మల్టిపుల్‌ రాకెట్-లాంచర్ సిస్టమ్‌లను(MLRS) ఇస్తామని హామీ ఇచ్చిన యూఎస్‌, యూకే. ఉక్రెయిన్ రాజధానిపై రష్యా దాడులు, కీవ్‌ను స్వాధీనం చేసుకోవడంపై పుతిన్ వెనక్కి తగ్గలేదని నిపుణులు అంటున్నారు. డోన్‌బాస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంపై రష్యా పూర్తిగా దృష్టి సారించిన నేపథ్యంలో కీవ్‌పై కూడా దాడులు పెరిగాయి.

Ukraine-Russia: ఉక్రెయిన్‌ యుద్ధంలో పుతిన్ తన లక్ష్యాలను సాధిస్తున్నారా..?యుద్ధం ముగినట్లేనా..?


ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల మిలిటరీ మద్దతుపై పుతిన్ అప్రమత్తం..
ఉక్రెయిన్‌లోని తూర్పు పారిశ్రామిక డోన్‌బాస్ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు రష్యా ప్రయత్నిస్తుందని నిపుణులు అంటున్నారు. డాన్‌బాస్ ప్రాంతంలో ఉక్రెయిన్ నుంచి ప్రతి అంగుళం భూమిని స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు, వేర్పాటువాదులు ప్రయత్నిస్తున్నారని విశ్లేషణలు వస్తున్నాయి.
ఉక్రెయిన్ దాని మిత్రదేశాల నుంచి లాంగ్-రేంజ్ రాకెట్‌లతో సహా మరిన్ని ప్రాణాంతక ఆయుధాలను పొందకముందే డాన్‌బాస్‌ను స్వాధీనం చేసుకోవాలని పుతిన్ అనుకుంటున్నారు.

యూఎస్‌ ఆయుధాలను యుద్ధరంగంలోకి తీసుకురావడానికి కనీసం మూడు వారాలు పడుతుందని గత వారం పెంటగాన్ తెలిపింది. ఇటీవల సెవెరోడోనెట్స్క్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడంపై రష్యా దళాలు దృష్టి సారించాయి. డాన్‌బాస్‌లోని నగరాలు, గ్రామాలపై మిసైల్స్‌, వైమానిక దాడులతో తమ జోరును రష్యా దళాలు కొనసాగిస్తున్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: Explained, Russia, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు