ఉక్రెయిన్‌తో(Ukraine) యుద్ధం జరుగుతున్న తరుణంలో రష్యా సరికొత్త గస్తీ నౌకను ఆవిష్కరించింది. ఆ దేశానికి చెందిన మెరైన్ ఇంజినీరింగ్ (Engineering) డిజైన్ బ్యూరో రుబిన్ (Rubin) తయారు చేసిన బార్డర్ అండ్ ఆఫ్‌షోర్ సబ్మెర్సిబిల్ సెంట్రీ (Border And Offshore Submersible Sentry-BOSS) కొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. గస్తీ, సైనికులకు శిక్షణ, సబ్మెరైన్గా కూడా పనిచేసే BOSSలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వాస్తవానికి రక్షణశాఖకు ఎక్కువగా నిధులు వెచ్చించలేని దేశాలను లక్ష్యంగా చేసుకొని BOSSను తయారు చేశారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం కొనసాగుతున్న తరుణంలో యూరోపియన్, యూఎస్(US) ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యా(Russia) ఆయుధాల ఎగుమతి, తయారీపై ఇవి ప్రభావం చూపుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. అదే విధంగా యూఎస్‌ను పట్టించుకోని దేశాలకు రష్యా ఆయుధాలను విక్రయించడం కొనసాగిస్తుందని చెబుతున్నారు.
బార్డర్ అండ్ ఆఫ్‌షోర్ సబ్మెర్సిబిల్ సెంట్రీ(BOSS) గస్తీ నౌక లేటస్ట్ వెర్షన్‌ను రష్యా లాంచ్ చేసింది. రష్యాకు చెందిన మెరైన్ ఇంజినీరింగ్ డిజైన్ బ్యూరో రుబిన్ గస్తీ నౌకను తయారు చేసింది. ఇతర దేశాలకు విక్రయించే ఉద్దేశంతోనే BOSS కొత్త వెర్షన్‌ను సిద్ధం చేసింది. సబ్‌మెరైన్, తీరగస్తీ నౌకగా సేవలు అందించడం BOSS ప్రత్యేకత. ఇతర దేశాలను ఆకట్టుకొన్న సోవియట్ విస్కీ సబ్‌మెరైన్స్ తరహా లుక్‌తో కొత్త వెర్షన్ తయారు చేశారు.
BOSS ప్రత్యేకతలు ఇవే..
ఈ గస్తీ నౌక పొడవు 72 మీటర్లు, బరువు 1,300 టన్నుల వరకు ఉంటుంది. వీటిలో 42 మంది ప్రయాణించగలిగే సదుపాయం ఉంది. దీంట్లో రెండు ప్రెషర్ ప్రూఫ్ మల్టి ఫంక్షనల్ హాంగర్స్ అందుబాటులో ఉన్నాయి. హై పవర్ ప్రొపల్షన్ సిస్టమ్, గంటకు 37 కిలోమీటర్ల వేగం, వేవ్ పియర్సింగ్ బో అండ్ ట్రంబుల్హోమ్ హల్ రెడ్యూస్ రోల్, రేడార్ సిగ్నల్స్ పరిధిని నియంత్రించే శక్తి.. వంటివి BOSS ప్రత్యేకతలు.
ఉపరితల నౌకలు, ఎయిర్‌క్రాఫ్ట్స్ తయారీలో వినియోగించే ఎక్విప్మెంట్స్తో దీన్ని రష్యా తయారు చేసింది. శత్రువులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా నీటిలోపల ప్రయాణించే కెపాసిటీ దీనికి ఉంది. కొత్త వెర్షన్లో ఆటోకెనాన్, టూ గైడెడ్ మిసైల్ లాంచర్స్, నాలుగు 324 ఎంఎం టోర్పెడో టూబ్స్తో పెద్ద నౌకలకు సైతం ధీటుగా BOSS లేటస్ట్ వెర్షన్ ఉందని రుబిన్ నుంచి ప్రకటన వచ్చింది.
BOSS తరహా నౌకల ఉపయోగాలు
అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయడం, అక్రమ చొరబాట్ల నియంత్రణ, న్యాయపరమైన అతిక్రమణలను ఎదుర్కోవడం, గస్తీ నౌకగానూ సేవలు అందించడం, రెస్క్యూ షిప్‌గానూ ఉపయోగించడం వంటివి దీని ఉపయోగాలు. వీటిని పరిశోధనలకు సైతం ఉపయోగించుకోవచ్చు. సబ్‌మెరైన్, గస్తీ సేవలు అందించగల సబ్మెర్షిబిల్ షిప్ ఇది. ఇందులో సబ్మెరైన్లలో పనిచేసే సైనికులకు సముద్రంలో శిక్షణ ఇచ్చే సదుపాయం ఉంటుంది.
BOSSను కొనేందుకు ఆసక్తి చూపే దేశాలివే..
సైనిక రంగానికి పెద్దగా నిధులు కేటాయించలేని దేశాలకు BOSS వరం లాంటిది. తక్కువ బడ్జెట్లో అత్యాధునిక సదుపాయాలతో అందుతున్న ఈ గస్తీ నౌకతో రష్యా నావల్ ఎగుమతుల్లో తనదైన ముద్ర వేయనుంది. BOSSపై ఆసక్తి చూపే దేశాల్లో ఫిలిప్పైన్స్, థాయ్‌ల్యాండ్, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలు ఉన్నాయి. రష్యా నుంచి ఆయుధాలు దిగుమతులు చేసుకొంటున్న చైనా,ఇండియా కూడా వీటిని కొనే అవకాశం ఉంది.
Russia-Ukraine War: "అంతర్జాతీయ దళం".. అప్పుడు హిట్లర్.. ఇప్పుడు పుతిన్‌ను ఓడిద్దాం: ఉక్రెయిన్
ఉక్రెయిన్‌పై యుద్ధ ప్రకటన BOSS బిజినెస్‌ను దెబ్బకొడుతుందా?
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తుండటంతో రష్యాపై యూరోపిన్ కంట్రీస్ ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలతో రష్యా డిఫెన్స్ ఇండస్ట్రీ దెబ్బతినే అవకాశం ఉంది. రష్యా కంపెనీలకు మైక్రోఎలక్ట్రానిక్స్, చిప్స్ కొరత ఎదురుకానుంది. COTS మైక్రోచిప్స్‌ను ఆయుధ సంస్థ రోస్టెక్ ఇండస్ట్రియల్ పరంగా వినియోగించలేదు. అయితే ప్రపంచంలోనే ఎక్కువగా సెమికండక్టర్లను తయారు చేస్తున్న తైవాన్ కూడా రష్యాకు ఎగుమతులు ఆపేస్తామని ఇటీవల ప్రకటించింది. ఆయుధాలకు రష్యాపై ఆధారపడి దేశాలు కూడా పక్కకు జరిగే వీలుంది. యూఎస్‌ను పట్టించుకోని దేశాలు ఇరాన్, చైనా, నార్త్ కొరియాకు మాత్రమే రష్యా ఎగుమతులు కొనసాగే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Explained, Russia, Russia-Ukraine War