Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /Explained /

Russia Ukraine War: పుతిన్‌ అంతిమ లక్ష్యం అదేనా..? ఉక్రెయిన్‌తో వార్‌కు ముగింపు దాంతోనే పలుకుతారా..?

Russia Ukraine War: పుతిన్‌ అంతిమ లక్ష్యం అదేనా..? ఉక్రెయిన్‌తో వార్‌కు ముగింపు దాంతోనే పలుకుతారా..?

రష్యా అధ్యక్షుడు పుతిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఒక వారంలోపు ఇరు దేశాలకు చెందిన వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏం సాధించాలనే ఉద్దేశంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం(Russia Ukraine War) కొనసాగుతోంది. ఒక వారంలోపు ఇరు దేశాలకు చెందిన వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏం సాధించాలనే ఉద్దేశంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనేదానిపై చర్చలు మొదలయ్యాయి. ఈ విషయంపై అల్‌జజీరా న్యూస్ ఏజెన్సీతో(Agency) మాట్లాడారు లండన్‌(London) లౌబరో యూనివర్సిటీలో(University) డిప్లమసీ అండ్ ఇంటర్నేషనల్ గవర్నెన్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న క్రిస్టియన్ నిటోయు. యుద్ధానికి ముగింపు ఎలా ఉంటుందనేది ఆయన విశ్లేషించారు. రష్యా ఉద్దేశాలను తప్పుగా అర్థం చేసుకోకూడదని చెబుతున్నారు నిటోయు. ‘పుతిన్ రష్యా పాలసీలను ముందుకు తీసుకెళ్తున్నారు, ప్రపంచంలో గొప్ప శక్తిగా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రపంచ దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తరువాత రష్యా కేంద్రంగా ఉన్న సోవియట్‌ యూనియన్ విచ్చిన్నం ప్రారంభమైంది.

Crude Oil Price: భారీగా పెరిగిన ముడి చమురు ధరలు.. ఇక నుంచి పెట్రోల్ రేట్ల మోత..!

అప్పటి నుంచి తిరిగి సోవియట్‌ యూనియన్‌ను సాధించడమే లక్ష్యంగా రష్యా పని చేస్తోంది. పశ్చిమ దేశాలకు సమానంగా నిలవడం, ఉక్రెయిన్ వంటి చిన్న పొరుగు దేశాలలో రాజకీయ పరిణామాలను ప్రభావితం చేసే స్థాయికి రావాలని భావిస్తోంది.’ అని వివరించారు. ఏదేమైనా పశ్చిమ దేశాలతో కలవాలని ఉక్రెయిన్‌ చేసిన ప్రయత్నాలు రష్యాకు విరుద్ధంగా మారాయని నిటోయు అన్నారు. క్రెమ్లిన్‌ సైనిక చర్యలు కూడా కీవ్‌లో రష్యాకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమేనని చెప్పారు.

రష్యా ప్రయత్నాలు సాధ్యమేనా?

సిడ్నీ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ, అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్ ఎమెరిటస్ గ్రేమ్ గిల్ మాట్లాడుతూ.. ‘కీవ్‌ను స్వాధీనం చేసుకుంటే, రష్యా కనీసం తాత్కాలిక పరిపాలనను ఏర్పాటు చేయగలదు. కానీ ఉక్రెయిన్‌ ప్రజల్లో ఎక్కువ మంది వ్యతిరేకించే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రభుత్వంలో కొంతమంది సభ్యులను తొలగించినప్పటికీ, అధ్యక్షుడు వ్లొదిమిర్‌ జెలెన్స్కీ నేతృత్వంలో కొనసాగితే, పుతిన్ మరింత విజయం సాధించగలడు. డొనెట్స్క్, లుహాన్స్క్‌కు స్వయంప్రతిపత్తిని ఇవ్వడంపై ఒప్పటికే ఒప్పందాలు ఉన్నా.. ఉక్రెయిన్‌ చట్టబద్ధంగా గుర్తించాలని పుతిన్‌ కోరవచ్చు. రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు జరిగినా.. అమలు కష్టసాధ్యం. ఒత్తిడితో జరిగే ఒప్పందాలతో ఫలితం ఉంటుందని భావించలేం.

రష్యన్ ఆయుధాల బలంతో ఏర్పాటు అయ్యే తాత్కాలిక ప్రభుత్వానికి ఇది కచ్చితంగా సవాలే. ఉక్రెయిన్-బెలారస్ సరిహద్దులో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య ప్రస్తుత చర్చలు జరుగుతున్నాయి. మాస్కో ఇంకా పురోగతి సాధించలేదు. ఉక్రెయిన్‌ ప్రతిఘటన తీవ్రంగానే ఉంది.’ అని చెప్పారు. యూఎస్‌ ఆర్మీ వార్ కాలేజీ స్ట్రాటజిక్ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయింట్, ఇంటరె ఏజెన్సీ, ఇంటర్‌గవర్నమెంటల్ అండ్ మల్టీనేషనల్ (JIIM) సెక్యూరిటీ స్టడీస్ రీసెర్చ్ ప్రొఫెసర్ జాన్ ఆర్‌.డెని మాట్లాడుతూ.. ‘రష్యా ఇప్పటికీ తన అన్ని వ్యూహాలను బయటపెట్టలేదు.

Ukraine-Russia War: అయ్యో పాపం.. ఉక్రెయిన్‌లో యుద్ధ బీభత్సాన్ని కళ్లకు గట్టే దృశ్యాలు

ఉక్రెయిన్‌ కంటే సైనిక బలం పరంగా రష్యా చాలా పెద్దది. అయితే ఇప్పటికీ రష్యా 50 నుంచి 70 శాతం వరకు సైనికులనే వినియోగించిందని, అవసరమైతే ఇంకా చాలా మంది సైనికులు పాల్గొనే అవకాశం ఉందని అమెరికా నివేదిక చెబుతోంది. రష్యా అనుకొన్నది ఇప్పటి వరకు ఏదీ జరగకపోవడంతో రష్యా సైనిక వ్యూహాలపై నిపుణులు విశ్లేషణలు మొదలు పెట్టారని’ వివరించారు. ఉక్రెయిన్‌ గగనతలంపై రష్యా ఆధిపత్యం చెలాయించలేకపోవడం, కీవ్‌ వెలుపల అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్వాధీనం చచేసుకోకపోవడం అర్థం కావడం లేదని డెని అన్నారు. కీవ్‌ ఇప్పుడో అప్పుడో లొంగకపోదనే విశ్లేషణలు వవినిపిస్తున్నాయని, అయితే ఉక్రెయిన్‌ లాంటి దేశంలో పుతిన్‌ ఏం చేస్తాడనేది మిస్టరీగా ఉండిపోయిందని, విభజించాలని చూసినా సమస్యలు తప్పవని అభిప్రాయపడ్డారు.

US President On War: పుతిన్‌పై విరుచుకుపడిన బైడెన్.. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించిన యూఎస్..!


ఒత్తిడిలో అమలు చేసే ఒప్పందాలు, ఎక్కువ కాలం నిలిచే అవకాశం లేదన్నారు. ఖార్కివ్‌లో రష్యాను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్‌ పౌరులు స్వచ్ఛందంగా ముందుకు రావడాన్ని గుర్తించాలని అన్నారు. పుతిన్‌ అవకాశాలు తగ్గుతున్నాయని, ఈ పరిస్థితిని చైనా, భారత్‌, ఇరాన్‌ వంటి దేశాలు గమనిస్తున్నాయని డెనీ విశ్లేషించారు. అతి పెద్ద సైనిక శక్తి అనే రష్యా ఇమేజ్‌కు భంగం వాటిల్లబోతోందని చెప్పారు. ఐరోపాలో జర్మనీ, ఫిన్లాండ్ వంటి నియంత్రిత సైనిక వ్యూహాన్ని ప్రకటించే దేశాలు ఇప్పుడు రష్యాను శత్రువుగా చూడాలనే ఆలోచనను స్వీకరించాయని, జర్మనీ సైనిక బడ్జెట్‌ను పెంచే యోచనలో ఉందని చెప్పారు. ఎలాంటి సయోధ్య కుదురుతుందనే దానిపై ఉక్రెయిన్‌ భవిష్యత్తు ఆధారపడి ఉందని, స్వతంత్రంగా రష్యా ఉండనిస్తుందని భావిస్తున్నట్లు వివరించారు.

First published:

Tags: Explained, Russia, Russia-Ukraine War, Vladimir Putin

ఉత్తమ కథలు