Home /News /explained /

అంతరిక్షంలో శాటిలైట్‌ను కూల్చేసిన రష్యా.. మండిపడుతున్న అమెరికా.. ఇంతకీ అంతరిక్ష శకలాలు కలిగించే ముప్పేంటి ?

అంతరిక్షంలో శాటిలైట్‌ను కూల్చేసిన రష్యా.. మండిపడుతున్న అమెరికా.. ఇంతకీ అంతరిక్ష శకలాలు కలిగించే ముప్పేంటి ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అంతరిక్ష శకలాలు అత్యంత వేగంగా ఒక్కోసారి సెకనుకు 8 కి.మీ వేగంతో తిరుగుతూ ఉంటాయని నాసా పేర్కొంటోంది. ప్రతి అంతరిక్ష శకలం సగటున గంటకు 22,370 మైళ్లు (ప్రతి గంటకు 36 వేల కి.మీ) తిరుగుతూ ఉంటాయి కాబట్టి అత్యంత చిన్న శకలం కూడా తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తుంది.

ఇంకా చదవండి ...
ఇటీవల రష్యా ఒక ప్రత్యేకమైన ప్రయోజం చేపట్టి వార్తల్లో నిలిచింది. ఏకంగా అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న తమ సొంత శాటిలైట్‌ను పేల్చివేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ యాంటీ శాటిలైట్‌ (satellite) మిస్సైల్‌ పరీక్ష ద్వారా వేలాది శకలాలు అంతరిక్షంలోకి విడుదలయ్యాయి. పేలుడు తరువాత ఉపగ్రహం శకలాలు సైతం అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నాయి. ఈ కారణంగా అంతరిక్షంలోని ISS లో ఉన్న సిబ్బంది బలవంతంగా సురక్షితమైన ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చింది.

రష్యా(russia)  చేపట్టిన చర్యను అమెరికా (america)  తప్పుబడుతోంది. ప్రమాదకరమైన, బాధ్యతారహిత్యంతో కూడిన మిస్సైల్‌ టెస్ట్ కారణంగా ఉపగ్రహాలు, ఇతర అంతరిక్ష వస్తువులకు రానున్న దశాబ్దాల్లో ప్రమాదం వాటిల్లుతుందని అమెరికా గగ్గోలు పెడుతోంది. శాటిలైట్‌ను కూల్చివేయడంతో ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ (ISS)లో ఉన్న వ్యోమగాములు భయపడ్డారని అగ్రరాజ్యం చెబుతోంది. కూల్చివేతకు గురైన శకలాలు ISS వైపు రావడంతో అందులోని వాళ్లంతా సురక్షిత ప్రాంతం చూసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో ఎన్ని శకలాలు తిరుగుతున్నాయి? వాటి కారణంగా తలెత్తే ముప్పు ఏంటి? వంటి వివరాలు తెలుసుకుందాం.

ఒక వస్తువుపై ఒక అసమతుల్య శక్తి ప్రసరించనంత వరకు ఆ వస్తువు స్థిరమైన వేగంతో సరళమైన రేఖలో కదులుతూనే ఉంటుందని న్యూటన్‌ మొదటి గతి సూత్రం చెబుతోంది. అదే అంతరిక్షంలో అయితే గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వస్తువు ఎక్కడైతే ఉంటుందో అక్కడే అది పరిభ్రమిస్తూ ఉంటుంది.

భూమి చుట్టు తిరిగే అనేక ఉపగ్రహలు, ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ ఉండే లో ఎర్త్‌ ఆర్బిట్‌ (LEO) అంటే భూమికి తక్కువ ఎత్తులో ఉండే కక్ష్యలో తిరుగుతాయి. గురుత్వాకర్షణ శక్తితో వెలాసిటీ మెయింటెయిన్‌ చేస్తూ భూమిపై పడకుండా ఉంటాయి. దీంతో ఆవి నిర్దేశించుకున్న మార్గంలో సుదీర్ఘకాలం పాటు తిరుగుతూనే ఉంటాయి.

కానీ గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా ఉన్నప్పటికీ, వాతావరణం పల్చగా ఉన్నప్పటికీ కొన్ని ఏళ్ల తర్వాత అవి భూమి వైపు రావడం మొదలవుతుంది. దానికి దశాబ్దాలు కూడా పట్టవచ్చు. నాసా అంచనాల ప్రకారం భూమికి 600 కి.మీ ఎత్తు కక్ష్యలో ఉండే శకలాలు కొన్ని ఏళ్లకు భూమిపై పడవచ్చు. అదే 1,000 కి.మీ కంటే పై కక్ష్యలో ఉండేవి పడిపోయేందుకు శతాబ్ద కాలం కంటే ఎక్కువ పడుతుంది.

* చిన్న అంతరిక్ష శకలం ముక్క అయినా ప్రమాదకరమేనా?
అతి వేగంతో తిరుగుతూ ఉంటాయి కాబట్టి అతి చిన్న అంతరిక్ష శకలమైనా ప్రమాదకరంగా ఉంటుంది. అంతరిక్ష శకలాలు అత్యంత వేగంగా ఒక్కోసారి సెకనుకు 8 కి.మీ వేగంతో తిరుగుతూ ఉంటాయని నాసా పేర్కొంటోంది. ప్రతి అంతరిక్ష శకలం సగటున గంటకు 22,370 మైళ్లు (ప్రతి గంటకు 36 వేల కి.మీ) తిరుగుతూ ఉంటాయి కాబట్టి అత్యంత చిన్న శకలం కూడా తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తుంది. ఉదాహరణకు బుల్లెట్‌ గంటకు 3వేల కి.మీ వేగంతో కదులుతుంది. అంటే 4 కేజీల అంతరిక్ష శకలం, గంటకు100 కి.మీ వేగంతో ప్రయాణించే కారు కలిగించే ప్రభావాన్ని కలిగిస్తుందని నాసా వివరిస్తోంది.

* ఎన్ని అంతరిక్ష శకలాలు పైన తిరుగుతున్నాయి?
అంతరిక్షంలోకి వెళ్లి భూగ్రహ గురుత్వాకర్షణ పరిధి అధిగమించి తిరిగి భూమిపైకి రాలేకపోయినవన్నీ అంతరిక్షంలో ఏదో ఒక కక్ష్యలో తిరుగుతూ ఉంటాయి. ఇందులో ఉపగ్రహాల శకలాలు, ఐఎస్‌ఎస్‌, వేలాది అంతరిక్ష చెత్త ఉంటుంది. 1957లో స్ఫుత్నిక్‌- 1 ఉపగ్రహంతో అప్పటి సోవియట్‌ యూనియన్‌ అంతరిక్ష ప్రయోగాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు వేలాది వస్తువులు అంతరిక్షంలోకి వెళ్లాయి. వీటిలో చాలా వాటి వ్యవధి ముగిసిపోయింది. ఇవి విడిపోయి ఉంటాయి లేదా రష్యా చేపట్టిన మిస్సైల్‌ టెస్ట్‌ ద్వారా విచ్ఛిన్నమై పోయి ఉంటాయి. ఇలాంటి పరీక్షలను అమెరికా, చైనా, భారత్‌ కూడా నిర్వహించాయి.

అంతరిక్ష శకలాలు పరిమాణం పెయింట్‌ పెచ్చుల వంటి అతి చిన్న సైజు నుంచి పనిచేయలేని భారీ ఉపగ్రహాల వరకు ఉంటాయి. ఒక సెంటీ మీటరు కంటే పెద్దగా ఉండే అంతరిక్ష శకలాల్లో చాలా వరకు రాకెట్‌ తదుపరి దశల్లో ఉంటే ఇంధనం లేదా అధిక పీడనంతో కూడిన ద్రవాలు కలిగి ఉంటాయి.

క్రికెట్‌ బంతి కంటే పెద్దవైన 23 వేల అంతరిక్ష శకలాలు భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాయని నాసా భావిస్తోంది. అలాగే చిన్న గోళికాయ పరిమాణంలోని శకలాలు 5 లక్షలకు పైగా ఉంటాయని అంచనా వేసింది. ఇవే కాదు 1మి.మీ లేదా అంత కంటే ఎక్కువ పరిమాణంలోని శకలాలు అంత కంటే తక్కువ అంటే మైక్రో మీటర్‌ పరిమాణంలో 10 కోట్ల శకలాల ముక్కుల ఉండవచ్చని లెక్కించింది. రష్యా చేపట్టిన మిస్సైల్‌ టెస్ట్‌తో ఉపగ్రహం వేల ముక్కలుగా విచ్ఛిన్నమైంది. ఇందులో 1,500 కంటే ఎక్కువ ముక్కలను తాము గుర్తించామని అమెరికా తెలిపింది.

* అంతరిక్ష శకలాల బారిన పడకుండా అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌ ఎలా ఉండగలిగింది?
అంతరిక్ష శిథిలాలు వేగంగా కదులుతాయి కాబట్టి అత్యంత చిన్న ముక్క కూడా అతి పెద్ద ముప్పుగా పరిణమిస్తుంది. భూగ్రహం చుట్టు తిరిగే వాటిని నాసా ట్రాక్‌ చేస్తూ ఉంటుంది. అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ డిఫెన్స్‌ గ్లోబ్‌ స్పేస్‌ సర్వైలెన్స్‌ నెట్‌వర్క్‌ (SSN) సెన్సర్లు 27,000 కక్ష్య శిధిలాల ముక్కలను కనిపెడుతున్నాయని నాసా తెలిపింది. వీటిలో చాలా వరకు అతి చిన్నగా ఉంటాయి కాబట్టి ట్రాక్‌ చేసేందుకు కుదరదు, కానీ అవి మానవ అంతరిక్ష యాత్ర, రోబోటిక్‌ మిషన్లకు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి.

ISSకు ముప్పు తలెత్తుందని భావించే వాటి విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై సుదీర్ఘకాలంగా మార్గదర్శకాలు ఉన్నాయని నాసా చెబుతోంది. అందులోని సిబ్బంది భద్రత కోసం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, లేదా తప్పించుకునే చర్యల వంటివన్నీ అందులో ఉన్నాయని తెలిపింది.

Revanth Reddy: హైకమాండ్ ముఖ్యనేత ప్రశ్న.. రేవంత్ రెడ్డి నిర్ణయాలు మారనున్నాయా ?

K Chandrashekar Rao: వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి.. కేసీఆర్ లెక్కేంటి ?

ఘర్షణ ముప్పు అన్నది అంతరిక్ష శకలాల పరిమాణాన్ని బట్టి ఉంటుంది. ఆ శకలం ISS వైపు వస్తుందా అనే విషయం ముందుగానే తెలుస్తుంది కాబట్టి ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అది కొద్దిగా కదులుతుంది. 1999 నుంచి ఇలాంటి శకలాల ప్రమాద నివారణలను 29సార్లు ఐఎస్‌ఎస్‌ నిర్వహించింది. ఇందులో 2020లోనే మూడు ఉన్నాయి.

కానీ, ఒకవేళ డేటా కచ్చితంగా లేకపోయినా లేదా ఘర్షణను అంచనా వేయడంలో జాప్యం జరిగినట్టు అయితే సిబ్బందిని కాపాడేందుకు రష్యా సూయిజ్‌లోకి లేదా మానవులను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లే అమెరికాకు చెందిన వాణిజ్య విమానంలోకి తరలిస్తారు. ఇప్పుడు రష్యా ఉపగ్రహ పేలుడు కారణంగా తలెత్తే శకలాల నుంచి బయటపడేందుకు ISS సిబ్బంది చేయాల్సి రావచ్చు. ఘర్షణ కారణంగా కీలకమైన భాగాలకు నష్టం వాటిల్లినా లేదా లైఫ్‌ సపోర్టింగ్‌ మాడ్యూల్‌లో పీడనం తగ్గిపోతే సిబ్బంది స్టేషన్‌ వదిలి రావాల్సి ఉంటుంది. అత్యవసర సమయంలో సిబ్బంది కోసం స్పేస్‌ క్రాఫ్ట్‌ లైఫ్‌బోట్‌లాగా పనిచేస్తుంది.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: America, Russia, Space

తదుపరి వార్తలు