Home /News /explained /

RUSSIA FAILED TO DOMINATE UKRAINE SKIES WHATS THE REASON KNOW DETAILS HERE GH VB

Russia Vs Ukraine: ఉక్రెయిన్ గగనతలంపై ఆధిపత్యం చెలాయించడంలో రష్యా ఎందుకు విఫలమైంది..?కారణాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యుద్ధం మొదలై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఉక్రెయిన్ గగనతలంపై నియంత్రణ కోసం పుతిన్ వైమానిక దళం పోరాడుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై పైచేయి సాధించకపోవడానికి రష్యా వైమానిక దళం అసమర్థత కారణమని నిపుణులు చెబుతున్నారు.

యుద్ధం మొదలై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఉక్రెయిన్(Ukraine) గగనతలంపై నియంత్రణ కోసం పుతిన్(Putin) వైమానిక దళం పోరాడుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై పైచేయి సాధించకపోవడానికి రష్యా(Russia) వైమానిక దళం అసమర్థత కారణమని నిపుణులు చెబుతున్నారు. సిరియా, జార్జియా, చెచ్ న్యాలలో పోరాట అనుభవం, 4,000 యుద్ధ విమానాలు ఉన్న రష్యాపై అంచనాలకు మించి ఉక్రెయిన్‌ దళాలు పోరాడారు. ఏ దేశం గగనతలంపై పట్టు సాధించినా యుద్ధ గమనం ప్రాథమికంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. యుద్ధాలలో వైమానిక దళం(Air Force) ఎందుకు కీలకం అంటే.. ఏ యుద్ధంలో నైనా వైమానిక శక్తి నిర్ణయాత్మకంగా ఉంటుంది. కానీ సమర్థవంతంగా ఉపయోగించడం కష్టం. ఎయిర్‌ బోర్న్‌ మిలిటరీ ఎకో సిస్టమ్‌ త్వరగా ఏర్పాటు చేయడానికి.. శిక్షణ పొందిన సిబ్బంది వైమానిక దళాలు టెక్నాలజీపై ఆధారపడతాయి.

Explained: టీవీ స్క్రీన్లలో QLED, UHD, OLED డిస్‌ప్లేల మధ్య తేడా ఏంటి..? వీటిలో ఏది బెస్ట్..?


ప్రభావవంతమైన ఎయిర్‌బోర్న్ మిలిటరీ ఎకో సిస్టమ్‌ను ఏది తయారు చేస్తుంది..?
కమాండ్, కంట్రోల్ అందించడానికి ఎయిర్‌బోర్న్ రాడార్ స్టేషన్లు, గగనతలాన్ని రక్షించడానికి ఫైటర్స్, ఇంధనం నింపే విమానం, ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించే శ్రేణి, శత్రువుల దాడులను అణచివేయడానికి ఎలక్ట్రానిక్-యుద్ధ విమానాలు, శత్రు దళాలను గుర్తించి నాశనం చేయడానికి అటాక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, ఈ కంబైన్డ్ ఆపరేషన్‌లలో సింక్రనైజ్డ్‌ సిస్టమ్‌లో పని చేసే వందలకొద్దీ విమానాలు, వేలాది మంది సైనికులు, ఇవన్నీ సక్రమంగా నిర్వహించినప్పుడు.. గగనతలంలో ఆధిపత్యంతోపాటు గ్రౌండ్‌ ఫోర్సెస్‌, నావికాదళాలకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది.

ఉక్రెయిన్‌లో రష్యన్లు ఎందుకు విఫలమయ్యారు..?
అడ్వాన్స్డ్‌ కంబైన్డ్ ఆపరేషన్లను నిర్వహించే రష్యా వైమానిక దళ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఇటీవల ప్రయత్నాలు పెద్దగా చేయలేదని నిపుణులు చెబుతున్నారు. రష్యా రక్షణ పరిశ్రమ కూడా అవినీతి, అసమర్థతతో దెబ్బతిందని ఆరోపణలు వస్తున్నాయి. రెగ్యులర్‌, రియలిస్టిక్‌ ట్రైనింగ్‌ లేకపోవడం, లాజిస్టిక్‌ సమస్యలతో రష్యన్ వైమానిక దళం ఇబ్బంది పడుతోందని విశ్లేషణలు వస్తున్నాయి. NATO వైమానిక దళాలు ఆధారపడిన ఊహాజనిత, అనువైన నిర్ణయాలకు రష్యన్ క్లెప్టోక్రసీ సుముఖంగా ఉండదని నిపుణులు చెబుతున్నారు.

ప్రణాళికల పరంగా పనిచేయడంలో రష్యా వైమానిక దళం విఫలం అయిందని అంటున్నారు. ఎక్కువగా గ్రౌండ్‌ ఫోర్స్‌కు మద్దతు ఇవ్వడం, ఉక్రేనియన్ నగరాలపై బాంబు దాడులకు దిగడానికే రష్యా వైమానిక దళం పరిమితమైంది. గ్రౌండ్‌ ఫోర్స్‌కు మద్దతుకు మించి వైమానిక శక్తిని ఉపయోగించడానికి రష్యా ఎప్పుడూ ఆలోచించలేదని యూఎస్‌ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ లెఫ్టినెంట్ జనరల్ డేవిడ్ ఎ డెప్టులా తెలిపారు. రష్యా దాని అన్ని యుద్ధాలలో ఎప్పుడూ వ్యూహాత్మక వైమానిక ప్రణాళికను రూపొందించలేదు, అమలు చేయలేదని పేర్కొన్నారు. సంయుక్త విమాన కార్యకలాపాల నుంచి పరస్పర మద్దతు లేకుండా, ఎక్కువగా ఒకే విమానాన్ని నేరుగా మిషన్లలో రష్యన్లు ఉపయోగిస్తున్నారు.

Explained : PPF అకౌంట్ అంటే ఏంటి..? PPF అకౌంట్‌ను ఎందుకు ఓపెన్ చేయాలి..? దీని ప్రయోజనాలు ఏవి..?


రష్యన్ వైమానిక దళాన్ని ఉక్రెయిన్ ఎలా ఎదుర్కొంది..?
పెద్ద రష్యన్ వైమానిక దళాన్ని ఎదుర్కొనేందుకు ఎయిర్‌, యాంటి ఎయిర్‌ సామర్థ్యాలను ఉక్రెయిన్‌ ఏకం చేసింది. రష్యా వైమానిక శక్తిని కొన్ని తూర్పు, దక్షిణ ప్రాంతాలకు ఉక్రెయిన్‌ దళాలు పరిమితం చేయగలిగింది. స్లోవేకియా అందించిన S-300 క్షిపణి వ్యవస్థలతో ఉక్రెయిన్‌ రష్యాను నిలువరించింది. కమాండ్-అండ్-కంట్రోల్ సపోర్ట్ లేకపోవడం, ఇంధనం నింపుకోవడం, ఎలక్ట్రానిక్-వార్‌ఫేర్ వంటివాటితో తక్కువ ఎత్తుకే రష్యన్ విమానాలు పరిమితమయ్యాయి. దీంతో సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిసైల్స్‌తో ముప్పు తప్పేలా లేదు. ఎక్కడా లక్ష్యంగా మారకుండా, తమ ప్రభావాన్ని తగ్గించుకుంటూ, రక్షణాత్మకంగా రష్యా ఎయిర్‌ ఫోర్స్‌ పనిచేసింది. ఎయిర్‌పవర్ వనరులను సృజనాత్మకంగా ఉపయోగించుకోవడంలో రష్యన్‌ల కంటే ఉక్రెయిన్‌ గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శించింది.

Explained : PPF అకౌంట్ అంటే ఏంటి..? PPF అకౌంట్‌ను ఎందుకు ఓపెన్ చేయాలి..? దీని ప్రయోజనాలు ఏవి..?


ఉక్రెయిన్‌లో రష్యా వ్యూహాలను మారుస్తుందా..?
ఇటీవలి వారాల్లో తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా వైమానిక దాడులు పెరగడం పుతిన్ దళాలు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తుండటం దీనికి సంకేతంగా నిలుస్తున్నాయి. అధిక కచ్చితత్వ క్షిపణుల నిల్వలు క్షీణించడంతో రష్యా వైమానిక దాడులపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. నైపుణ్యమున్న సైనికుల కొరత, నిర్ణయాత్మక విజయం కోసం ఒత్తిడి వంటి కారణాలతో రష్యన్ పైలట్‌లు రిస్క్‌ తీసుకొని దాడులకు దిగే అవకాశం ఉంది. దూకుడు వ్యూహాలకు రష్యన్ పైలట్‌లు ఉక్రెయిన్‌ యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ డిఫెన్స్ సిస్టమ్‌లను చేరువగా రావాల్సి ఉంటుందని విశ్లేషణలు తెలుపుతున్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: Explained, Russia, Russia-Ukraine War

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు