Golden Biryani: బంగారు బిర్యానీ తినాలని ఉందా...అయితే ఈ రెస్టారెంట్ వెళ్లాల్సిందే...

గోల్డ్ బిర్యానీ

దుబాయ్ ఫుడ్ ఫెస్టివల్‌లో భాగంగా సోషల్ బై హీంజ్ బెక్ అనే రెస్టారెంట్​ 5 కోర్స్ మీల్ భోజనాన్ని ప్రారంభించింది. ఈ మెనూలో గోల్డ్, కేవియర్​తో తయారుచేసిన వంటకాలు ఉంటాయి. మీరు ఈ వంటలను రుచి చూసే సమయంలో రాయల్టీని అనుభవించవచ్చు.

  • Share this:
దుబాయ్​ని, బంగారాన్ని వేరు చేసి చూడలేం. బంగారు నిక్షేపాలకు దుబాయ్​ ప్రసిద్ధి. ఆ దేశ ప్రధాన ఆదాయ వనరుల్లో బంగారం పాత్ర చాలా కీలకమైంది. ఇక్కడి బంగారం భారత్​తో సహా ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. అయితే, బంగారం విరివిగా లభిస్తుంది కనుక.. అక్కడి ప్రజలు బంగారాన్ని విపరీతంగా వినియోగిస్తుంటారు.. ఎంతలా అంటే.. తినే ఆహారంలో కూడా బంగారం ఉండేంతలా!.. ఆశ్చర్యపోతున్నారు కదా. అవును మీరు విన్నది నిజయే.. దుబాయ్​​లో సోషల్ హీన్జ్ బెక్ అనే రెస్టారెంట్​ దుబాయ్​ ఫుడ్​ ఫెస్టివల్​లో భాగంగా 5- కోర్సుల గోల్డ్ & కేవియర్ థీమ్ భోజనాన్ని వడ్డించనుంది. అయితే, ఈ భోజనం ఖరీదు కూడా బంగారం స్థాయిలోనే ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

దుబాయ్​ ఫుడ్​ ఫెస్టివల్​లో మాత్రమే..
దుబాయ్ ఫుడ్ ఫెస్టివల్‌లో భాగంగా సోషల్ బై హీంజ్ బెక్ అనే రెస్టారెంట్​ 5 కోర్స్ మీల్ భోజనాన్ని ప్రారంభించింది. ఈ మెనూలో గోల్డ్, కేవియర్​తో తయారుచేసిన వంటకాలు ఉంటాయి. మీరు ఈ వంటలను రుచి చూసే సమయంలో రాయల్టీని అనుభవించవచ్చు. కాగా, 5 కోర్స్ గోల్డ్​, కేవియర్​ భోజనం కోసం AED 600 (భారత కరెన్సీలో సుమారు రూ.12,200) చెల్లించాల్సి ఉంటుంది. ఈ మెనూలో- కాలీఫ్లవర్ గోల్డ్, హక్కైడో స్కాలోప్స్, పొటాటో క్రీమ్‌, చివ్స్ గోల్డ్, లెమన్​ స్పఘెట్టి, టర్బోట్ స్పైసీ క్రస్ట్‌, బాదం గోల్డ్, జాబయోన్ గోల్డ్, గోల్డ్ సూక్, గోల్డ్ టీ లేదా గోల్డ్ ఐస్ క్రీం- వంటి ఆహారాలు లభిస్తాయి. ఈ వంటకాలని ఫ్రాన్సిస్కో అనే చెఫ్ సారధ్యంలో​ సిద్ధం చేస్తున్నారు. దుబాయ్​ ఫుడ్​​ ఫెస్ట్​లో పార్టిసిపేట్​ చేసేవారు.. ఈ గోల్డ్​ వంటకాలను రుచి చూడటమే కాకుండా, ఇంటరాక్టివ్ చెఫ్ టేబుల్ అనుభవాన్ని కూడా ఆస్వాదించవచ్చు. కాబట్టి, మీరు కూడా ఈ అద్భుతమైన గోల్డ్​ ఫెస్ట్​లో పార్టిపేట్​ చేసి గోల్డ్​ ఫుడ్​ను తినాలనుకుంటే ముందుగా సదరు రెస్టారెంట్​ సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో స్లాట్​ బుక్ చేసుకోండి. ఈ మెనూ కేవలం దుబాయ్ ఫుడ్ ఫెస్టివల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని, తర్వాత ఇవి లభించవని రెస్టారెంట్ యాజమాన్యం పేర్కొంది.



ఖరీదైన రాయల్​ గోల్డ్​ బిర్యానీ..
ఇదిలా ఉంటే, దుబాయ్​లోని బాంబే అనే భారతీయ రెస్టారెంట్​ ‘రాయల్​ గోల్డ్​ బిర్యానీ’ పేరుతో బిర్యానీని విక్రయిస్తోంది. దీని ప్లేట్​ ధర 1000 దిర్హామ్​లు. అంటే భారత కరెన్సీలో ఇది సుమారు రూ.19,700 రుపాయలు. ఎంతో రుచికరమైన ఈ బిర్యానీని 23 కేరెట్ల గోల్డ్​ ప్లేట్​లో వడ్డిస్తారు. ఈ బిర్యానీకి చాలా ప్రత్యేకతలున్నాయి. సాధారణంగా బిర్యానీలో ఒకే రకమైన రైస్ ఉంటుంది. కానీ, రాయల్​ గెల్డ్​ బిర్యానీలో మాత్రం బిర్యానీ రైస్​, కీమా రైస్​, వైట్​ రైస్​, సాఫ్రాన్​ (కుంకుమ పువ్వు) రైస్​... ఇలా టేస్ట్​కు తగ్గట్లు సర్వ్​ చేస్తారు.
Published by:Krishna Adithya
First published: