Home /News /explained /

ROBOTS AND OLYMPICS A POTENT PHOTO COMBINATION AT BEIJING 2022 WINTER GAMES GH VB

Explained: వింటర్ ఒలింపిక్స్‌లో రోబోల సాయంతో ఫొటోలు.. ఆ అద్భుత పనితీరుకు కారణం ఏంటి.. అవి ఎలా పనిచేశాయి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చైనాలోని బీజీంగ్‌లో ఇటీవలే శీతాకాల ఒలింపిక్స్ గేమ్స్ ముగిశాయి. ఈ ఈవెంట్‌లో రోబోల సహాయంతో హైక్వాలిటీ కలిగిన ఇమెజెస్‌ను క్యాప్చర్ చేయగలిగారు నిర్వాహకులు. 

చైనాలోని (China) బీజీంగ్‌లో ఇటీవలే శీతాకాల ఒలింపిక్స్ గేమ్స్ ముగిశాయి. ఈ వింటర్ గేమ్స్‌ను(Winter Olympics) అత్యద్భుతంగా నిర్వహించారు. ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ఆతిథ్యాన్ని అందించారు. అయితే ఈ శీతాకాలపు ప్రపంచ కీడలు జరుగుతున్నప్పుడు ఆటగాళ్ల ఫొటోలను గమనించారా? ఎంతో వాస్తవికంగా, పెయింటింగ్ వేసినట్లు అబ్బురపరిచే రీతిలో ఉన్న ఫోటోలు చూసుంటారు. గేమ్స్ జరుగుతున్నప్పుడు క్రీడాకారుల భావోద్వేగాలను(Emotions) సైతం క్యాప్చర్ చేయడం ఎలా సాధ్యమైందని మీకు అనుమానం రావచ్చు. అయితే ఈ ఫోటోల వెనుక ఓ ప్రత్యేక అతిథి ఉన్నాడు. అతను ఎవరో కాదు.. రోబో(Robot). అవును మీరు విన్నది నిజమే. రోబోల సహాయంతో అత్యద్భుతమైన ఫోటోలను నిర్వాహకులు తీయగలిగారు.

ఒలింపిక్ ఫొటో పూల్‌లో అబ్బురపరిచే ఫొటోలు తీసేందుకు ఐదు అంతర్జాతీయ సంస్థలైన రాయిటర్స్, గెట్టీ ఇమెజెస్, ఏజెన్స్ ఫ్రాన్స్-ప్రెసే, జిన్హూవా, ద అసోసియేటెడ్ ప్రెస్ కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. రోబోల సహాయంతో హైక్వాలిటీ కలిగిన ఇమెజెస్‌ను క్యాప్చర్ చేయగలిగాయి.

Explained: మణిపూర్‌ రాష్ట్రానికి వేర్పాటువాదులతో ముప్పు ఎంత..? కేంద్ర ప్రభుత్వ చర్యలు ఏ మేరకు ఫలిస్తాయి..?


ఈ విధానం ఎలా ప్రారంభమైంది..
ఈ ప్రక్రియ సరిగ్గా దశాబ్దం క్రితం ప్రారంభమైంది. 2012 సమ్మర్ ఒలింపిక్స్ వరకూ రోబోలను ఈ ప్రక్రియ కోసం ఉపయోగించలేదు. లండన్ వేదికల వద్ద క్యాట్ వాక్‌ల ఉండవు. ఈ కారణంతో మైక్రోఫోన్ కేబుల్ తో వేరు చేసిన భారీ రిగ్స్ ను అక్కడ ఉంచారు. ఆ అనుభవంతో నెట్వర్క్ కనెక్షన్‌లో మార్పు చేసి ఆపరేషన్ ఎలా చేయాలో గుర్తించారు. ఈ ప్రక్రియ వెనకున్న ప్రధాన వ్యక్తి డేవిడ్ జే ఫిలిప్. హ్యూస్టన్‌కు చెందిన ఆయన లండన్ ఒలింపిక్స్ కంటే ముందు నీటి అడుగున కెమెరా వ్యవస్థను రూపొందించే బాధ్యతను నిర్వర్తించేవారు. స్కూబా డైవింగ్ అంటే ఇష్టపడే ఆయనకు ఈ పని ఎంతో ఆసక్తిని కలిగించింది. పెరుగుతున్న పోటీని గుర్తుపెట్టుకుని వ్యవస్థను మెరుగుపరచాలని భావించారు. అందులో భాగంగానే రోబోల వినియోగానికి శ్రీకారం చూట్టాడు. కాలక్రమేణా అధ్యక్షుల ప్రసంగాలకు, వరల్డ్ సిరీస్, సూపర్ బౌల్ లాంటి ఈవెంట్లలో ఫొటోలను తీయడం కోసం రోబోలను వినియోగించారు.

అయితే ఒలింపిక్స్ గేమ్స్‌లో రోబోల సహాయం తీసుకోవడాన్ని రెండేళ్ల క్రితమే ప్రారంభించారు. ఇందుకోసం 18 నెలలు ముందుగానే సైట్ విజిట్ చేయడమే కాకుండా, పలు రకలా సదరు ప్రదేశంపై అధ్యయనం చేశారు. 10 కార్గోల సహాయంతో భారీ రిగ్స్ ను షిఫ్ట్ చేశారు. ఈ విధంగా హ్యూస్టన్ నుంచి ఆసియా.. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేవారు.

ఇది కూడా చదవండి: ఊపిరిపీల్చుకోండి.. ఈ నియమాలు అనుసరిస్తే మీ ఊపిరితిత్తులకు ఏ హానీ కలగదు..!


టెక్నాలజీ వాడకం..
టాలెంటెడ్ ఫొటోగ్రాఫర్లు మాత్రమే టెక్నాలజీని ఉపయోగించడంలో శిక్షణ తీసుకుంటారు. అందులో క్రిస్ కార్లసన్, జెఫ్ రాబర్సన్ లాంటి ఫొటోగ్రాఫర్లు హ్యూస్టన్‌లో ఫిలిప్‌తో కలిసి చేతులు కలిపి తమ ఎక్విప్మెంట్ ను షిఫ్ట్ చేయగలిగారు. అయితే బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ కెమెరా సప్లయిర్లందరూ బయోబబుల్‌లో ఉండిపోయారు. ఆ క్లోజ్డ్ లూప్‌లో తగిన హార్డ్ వేర్ స్టోర్లు లేవు. నకిలీ ఎక్విప్మెంట్ వాడదమాంటే అవి నాణ్యత లేమి వల్ల పనికిరావని వారికి అర్థమైంది. ఇక్కడే వారికి సవాల్ ఎదురైంది.

అప్పుడే టెలిమెట్రిక్ రిగ్స్ ను ఆశ్రయించారు. ఇవి 12 కేజీల బరువుడి స్టాండార్డ్ ఏ1 సోనీ మిర్రలెస్ కెమెరాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా వీటి ఇన్‌స్టాలేషన్ మనుషులతోనే అత్యంత శ్రమపడి చేశారు. ప్రతి ప్రాంతాన్ని చక్కగా క్యాప్చుర్ చేసేలా వాటిని ఇన్ స్టాల్ చేశారు. ప్రారంభోత్సవానికి, ముగింపు కార్యక్రానికి రిమోట్ ఆపరేటెడ్ కెమెరాలను ఉపయోగించారు.

కెమెరాల నియంత్రణ..
ఒక ఫోటోగ్రాఫర్ సాధారణంగా క్యాపిటల్ ఇండోర్ స్టేడియంలో ఆపరేషన్‌ను పైలట్ చేయడానికి అంకితమవ్వగా, హాకీ ఫోటోగ్రాఫర్‌లు రిమోట్-ఆపరేటెడ్ కెమెరాలను అదే సమయంలో షూట్ చేసేవారు. బీజింగ్ లో సమ్మర్ ఒలింపిక్స్ కంటే తక్కువ రిమోట్ సెటప్‌ను AP ఫొటోగ్రాఫర్స్ తీసుకొచ్చారు. కాబట్టి సిబ్బంది టెక్నాలజీని ఆశ్రయించి అధిక మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. కనీస లక్ష డాలర్ల విలువైన ఎక్విప్మెంట్ ను ఉపయోగించినట్లు ఫిలిప్ చెప్పారు. అయితే అంతకంటే 10 రెట్లు ఎక్కువ విలువైన రివార్డునే పొందగలిగామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Explained: ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ చరిత్ర, ప్రాముఖ్యత ఏంటి..? 12వ ఎడిషన్ ఫ్లీట్ నుంచి ఏమేం ఆశించవచ్చు..?


మళ్లీ ఫొటోగ్రఫీ నేర్చుకున్నట్లు అనిపించింది: జెఫ్ రాబర్సన్
రోబోటిక్స్ ఉపయోగించి తీసిన ఫోటోల్లో 4/5 వంతు ఫొటోలు నిరుపయోగమయ్యాయని జెఫ్ రాబర్సన్ స్పష్టం చేశారు. అథ్లెట్లు చాలా వేగంగా కదలడం వల్ల ఒకేసారి అన్ని కీ ప్యాడ్ బటన్లను నొక్కాల్సి ఉంటుందని, అలాంటప్పుడు ఎక్కువ ఫోటోలు తీయాల్సి వస్తుందని చెప్పారు. ఇక్కడ పెద్దగా ఒత్తిడి లేనప్పటికీ ఆస్వాదించానని చెప్పారు. ఇక్కడ పనిచేయడం ప్రారంభించినప్పుడు మళ్లీ ఫొటోగ్రఫీ నేర్చుకున్నట్లు అనిపించిందని అన్నారు. అయితే రోబోలతో కలిసి పనిచేసేటప్పుడు కొన్ని సమస్యలు కూడా తలెత్తాయని, ముఖ్యంగా స్పైడర్ క్యామ్‌తో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చిందని ఫిలిప్ స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రతి కదలికను అనుసరిస్తూ ఉండే ఈ కెమెరా వైర్ల అవరోధానికి దారితీసేదని చెప్పారు.
Published by:Veera Babu
First published:

Tags: China, Cute photos, Olympics, Robotics, WINTER

తదుపరి వార్తలు