Reliance Solar: REC సోలార్ ఎనర్జీ కంపెనీని కొనుగోలు చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. కొత్త తరం HJT టెక్నాలజీని సంస్థ ఎలా ఉపయోగించుకోనుంది?

REC: రిలయన్స్ ఇండస్ట్రీస్ కొత్త తరం HJT టెక్నాలజీని సంస్థ ఎలా ఉపయోగించుకోనుంది?

RIL Investments in Solar energy | నార్వే ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీ ‘REC సోలార్‌’ను 771 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ ఒప్పందం ద్వారా గ్లోబల్, ఆపరేటింగ్, టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను నిర్మిస్తున్నట్లు పేర్కొంది.

  • Share this:
నార్వే ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీ ‘REC సోలార్‌’ను (REC Solar) 771 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries). ఈ ఒప్పందం ద్వారా గ్లోబల్, ఆపరేటింగ్, టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను నిర్మిస్తున్నట్లు పేర్కొంది. దీంతోపాటు 'HJT' సెల్ టెక్నాలజీతో సోలార్ సెల్స్ (Solar Cells) తయారీలో అగ్రగామిగా నిలిచేందుకు రిలయన్స్ ప్రణాళికలు వేస్తోంది. ఈ నేపథ్యంలో HJTని తరువాతి తరం సోలార్ సెల్స్ అని ఎందుకు అంటారో తెలుసుకుందాం.

* HJT అంటే ఏంటి?
హెటెరోజంక్షన్ టెక్నాలజీని క్లుప్తంగా HJT అంటారు. ఇది సోలార్ సెల్స్‌ను తయారు చేసే కొత్త పద్ధతి. 1980లలో జపాన్ కంపెనీ సాన్యో (Sanyo) ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్ని 2010లో పానసోనిక్ సంస్థ కొనుగోలు చేసింది. HJT అనేది ప్రముఖ PERC సోలార్ సెల్‌కు తరువాతి తరం టెక్నాలజీగా అందుబాటులోకి వచ్చింది. ఇతర సాంకేతిక పరిజ్ఞానాలకంటే ఇది మెరుగైనది. ఇందులో సెల్ ప్రాసెసింగ్ దశలు, సెల్ ప్రాసెసింగ్ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి.

"హాఫ్ కట్ పాసివేటెడ్ ఎమిటర్ అండ్ రియర్ సెల్ (PERC) టెక్నాలజీని ప్రవేశపెట్టిన మొదటి సంస్థ REC. ప్రస్తుతం ఈ టెక్నాలజీని అన్ని ప్రముఖ తయారీ సంస్థలు అనుసరిస్తున్నాయి. అయితే REC తరువాతి తరం HJT టెక్నాలజీకి మారింది. PERC టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడిన ప్రస్తుత సోలార్ సెల్స్ తయారీ మార్గాలను ఈ సరికొత్త సాంకేతికత సులభతరం చేసే అవకాశం ఉంది" అని RIL ప్రకటించింది.

Reliance Industries Ltd: బిజినెస్​లో రిలయన్స్​ ఇండస్ట్రీస్‌ హవా.. ఒకే రోజు రెండు పెద్ద ఒప్పందాలు​ కుదుర్చుకుని రికార్డు




* ఈ టెక్నాలజీ ఎలా పని చేస్తుంది?
HJT రెండు విభిన్న సాంకేతికతలను ఒక సెల్‌గా మిళితం చేస్తుంది. రెండు సన్నని-ఫిల్మ్ సిలికాన్ పొరల మధ్య స్ఫటికాకార సిలికాన్ సెల్ ఉంటుంది. దీని సామర్థ్యంతో ఎక్కువ లాభం ఉంటుంది. ఈ టెక్నాలజీ మరింత ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి దోహదం చేస్తుంది. HJT అనేది సోలార్ PV (ఫోటోవోల్టాయిక్ సెల్)ల భవిష్యత్తు అని చెబుతోంది REC. ఎందుకంటే ఇది ఇప్పటికే పరీక్షించిన రెండు టెక్నాలజీలైన సన్నని ఫిల్మ్స్, N- రకం మోనోలను కలిపే మాడ్యూల్- లెవల్ ఆవిష్కరణ అని సంస్థ పేర్కొంది. సోలార్ PV సెల్స్‌ను సన్నని పదార్థంతో తయారు చేస్తారు. ఇది సూర్యకాంతిని గ్రహిస్తుంది. కానీ ఈ ప్యానెళ్లు పూర్తిగా అపారదర్శకంగా ఉండవు. తమ గుండా కొంత సూర్యకాంతిని వెళ్లేలా చేస్తాయి. అయితే కొంత కాంతి ఉపరితలం నుంచి ప్రతిబింబిస్తుంది.

RIL Partnership: గ్రీన్ హైడ్రోజన్ వైపు రిలయన్స్ అడుగులు... డెన్మార్క్ కంపెనీతో RNESL ఒప్పందం



కానీ మూడు పొరల HJT సెల్‌లో N- టైప్ మోనో సిలికాన్ మధ్య పొరగా ఉంటుంది. సూర్యకాంతిని విద్యుత్తుగా మార్చే పనిలో ఎక్కువ భాగాన్ని ఇదే పూర్తి చేస్తుంది. HJT సెల్స్ ఇతర సోలార్ సెల్స్ టెక్నాలజీల కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇతర టెక్నాలజీల సామర్థ్యం దాదాపు 22 శాతంగా ఉంటే.. హెచ్‌ఏటీ సామర్థ్యం 25 శాతానికి దగ్గరగా ఉంది. సోలార్ ప్యానెల్ సామర్థ్యం అనేది.. అది ఎంత కాంతిని విద్యుత్తుగా మార్చగలదో సూచిస్తుంది. అధిక సామర్థ్యం ఉంటే.. నిర్ధిష్ట సూర్యకాంతితో ప్యానెల్‌ నుంచి ​​ఎక్కువ విద్యుత్తును పొందవచ్చు.

Reliance Jewels: రిలయన్స్ జువలరీస్ నుంచి ధన్‌తేరాస్ కోసం Kaasyam Collection..సంబరాలు..



రిలయన్స్ సంస్థ క్లీన్ ఎనర్జీ ప్లాన్స్ ఏవి?
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నాలుగు పునరుత్పాదక ఇంధన గిగాఫాక్టరీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు వచ్చే మూడు సంవత్సరాలలో రూ .75,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. జామ్‌నగర్ కాంప్లెక్స్‌ను పునరుత్పాదక శక్తిలోని ఇంటిగ్రేటెడ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ ఫ్యాక్టరీగా మార్చాలని సంస్థ భావిస్తోంది. ఈ కాంప్లెక్స్‌లో అధునాతన ఎనర్జీ స్టోరేజ్ బ్యాటరీ ఫ్యాక్టరీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఎలక్ట్రోలైజర్ ఫ్యాక్టరీ, ఫ్యూయెల్-సెల్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు ఉన్నట్లు రిలయన్స్ ప్రతినిధులు వెల్లడించారు.

Reliance Industries Ltd: బిజినెస్​లో రిలయన్స్​ ఇండస్ట్రీస్‌ హవా.. ఒకే రోజు రెండు పెద్ద ఒప్పందాలు​ కుదుర్చుకుని రికార్డు



REC కొనుగోలు గురించి అంబానీ మాట్లాడారు. ఈ దశాబ్దం ముగిసేలోపు 100GW క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని నమోదు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని చెప్పారు. 2030 నాటికి 450GW పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు రిలయన్స్ తోడ్పాటును అందించనుంది. RIL మిషన్ ద్వారా ఒకే కంపెనీ పెద్ద మొత్తంలో భారత్‌ లక్ష్యాలకు మద్దతు ఇవ్వనుంది.

‘REC ని స్వాధీనం చేసుకోవడం మంచి విషయం. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. సూర్యదేవుని అపరిమిత శక్తిని, ఏడాది పొడవునా లభించే సహజ శక్తిని మానవ అవసరాలకు అనుగుణంగా మార్చడానికి రిలయన్స్‌కు ఆర్‌ఈసీ సహాయపడుతుంది. పునరుత్పాదక ఎనర్జీలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడానికి మా వంతు కృషి చేస్తాం’ అని ముఖేష్ అంబానీ తెలిపారు. వాతావరణ సంక్షోభాన్ని అధిగమించడానికి గ్రీన్ ఎనర్జీపై భారత్ దృష్టి పెట్టిన నేపథ్యంలో.. ఈ విషయంలో మన దేశం ప్రపంచంలోకెల్లా అగ్రగామిగా అవతరించనుందని చెప్పారు.
Published by:John Naveen Kora
First published: