• HOME
  • »
  • NEWS
  • »
  • EXPLAINED
  • »
  • RESEARCHERS FROM NASA JET PROPULSION LABORATORY AND THE UNIVERSITY OF HYDERABAD HAVE IDENTIFIED NOVEL BACTERIAL STRAINS THAT MAY HELP IN SPACE FARMING SSR GH

NASA Research: అంతరిక్షంలో మొక్కల పెరుగుదలకు తోడ్పడే బ్యాక్టీరియా.. నాసా, హెచ్‌సీయూ సంయుక్త పరిశోధనలో వెల్లడి

NASA Research: అంతరిక్షంలో మొక్కల పెరుగుదలకు తోడ్పడే బ్యాక్టీరియా.. నాసా, హెచ్‌సీయూ సంయుక్త పరిశోధనలో వెల్లడి

ప్రతీకాత్మక చిత్రం

అంతరిక్షంలో మొక్కల పెరుగుదలకు తోడ్పడే బ్యాక్టీరియా ఉందని తాజా పరిశోధన వెల్లడించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి. నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ (JPL) ఇందులో...

  • Share this:
అంతరిక్షంలో మొక్కల పెరుగుదలకు తోడ్పడే బ్యాక్టీరియా ఉందని తాజా పరిశోధన వెల్లడించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి. నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ (JPL) ఇందులో కీలక పాత్ర పోషించింది. ఈ కొత్త రకం బ్యాక్టీరియా ద్వారా భవిష్యత్తులో అంతరిక్షంలో వ్యవసాయం చేయడం సాధ్యమవుతుందని పరిశోధకులు వెల్లడించారు. వివిధ దేశాల వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో నెలల తరబడి ఉండాల్సి వస్తోంది. వారికి అవసరమైన పదార్థాలను ప్రస్తుతం వ్యోమనౌకల్లోనే తీసుకెళ్తున్నారు. వాటిని పొదుపుగా వాడుకుంటున్నారు. కానీ అక్కడ కొన్ని రకాల మొక్కలను పెంచడం ద్వారా వారి ఆహార అవసరాలు తీరుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వచ్చిన రెండు విమానాల్లో మిథైలో బాక్టీరియేసి కుటుంబానికి చెందిన బాక్టీరియా జాతులను శాస్త్రవేత్తలు గుర్తించారు. మొత్తం నాలుగు బ్యాక్టీరియా వేరియంట్లను గుర్తించారు. వీటిల్లో ఒకదాన్ని మిథైలో రుబ్రమ్ రోడేసియానమ్‌ స్ట్రెయిన్‌గా గుర్తించారు. మిగిలిన మూడూ కొత్త రకం బ్యాక్టీరియా అని తేల్చారు. వీటి జన్యు క్రమాలను పరిశోధకులు విశ్లేషించారు. వీటికి మిథైలో బ్యాక్టీరియం ఇండీకం జాతికి చెందిన బ్యాక్టీరియాకు పోలికలు ఉన్నాయని గుర్తించారు. కొత్త జాతి బ్యాక్టీరియాకు మిథైలో బ్యాక్టీరియం అజ్మాలీ అని నామకరణం చేశారు. ప్రముఖ భారత జీవ వైవిధ్య శాస్త్రవేత్త డాక్టర్ అజ్మల్ ఖాన్ గౌరవార్థం ఈ పేరు పెట్టారు.

మొక్కల పెరుగుదలకు తోడ్పడే జన్యువులు
మిథైలో బ్యాక్టీరియం అజ్మాలీ స్ట్రెయిన్స్ జన్యు విశ్లేషణలో మొక్కల ఎదుగుదలను ప్రోత్సహించే జన్యువులు ఉన్నట్లు తేలింది. ఈ స్ట్రెయిన్స్ ద్వారా స్పేస్ స్టేషన్లలో మొక్కల పెంపకం సాధ్యమవుతుందని పరిశోధకులు తెలిపారు. స్పేస్ ఫార్మింగ్ ద్వారా వ్యోమగాములు తమ ఆహారాన్ని సొంతంగా పొందవచ్చని పేర్కొన్నారు. వనరులు లేని తీవ్రమైన ప్రాంతాల్లో మొక్కలను పెంచడానికి ఈ బయోటెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్పారు. స్పేస్ ఫార్మింగ్ కోసం ఈ సాంకేతికను వాడేందుకు మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది.

కీలకంగా వ్యవహరించిన భారత పరిశోధకులు
ఈ పరిశోధనలో భారత ప్రొఫెసర్లు ముఖ్యమైన పాత్ర పోషించారు. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీకి చెందిన డాక్టర్ కస్తూరి వెంకటేశ్వరన్, వరల్డ్ క్వాంట్ ఇనిషియేటివ్‌ ఫర్ క్వాంటిటేటివ్ ప్రిడిక్షన్‌కు చెందిన సి.సి.వాంగ్, హెచ్‌సీయూ ప్రొఫెసర్, వైస్ ఛాన్స్‌లర్ పొదిలె అప్పారావు, CSIR పూల్ శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్ నేతృత్వంలోని అధ్యయన బృందాలు సంయుక్తంగా ఈ పరిశోధన చేశాయి. ఈ రిసెర్చ్‌ ఫలితాలను 'ఫ్రాంటియర్స్ ఆఫ్ మైక్రోబయాలజీ' జర్నల్‌లో ప్రచురించారు.
First published:

అగ్ర కథనాలు