Explained: గ్రీన్ ఎనర్జీపై భారీ పెట్టుబడి పెడుతున్న రిలయన్స్​.. కార్భన్​ న్యూట్రల్​ కంపెనీగా అవతరించడమే లక్ష్యంగా పెట్టుబడులు

(ప్రతీకాత్మక చిత్రం)

ఈ ఏడాది జూలైలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) ద్వారా గ్రీన్ ఎనర్జీపై పెట్టే రూ.75 వేల కోట్ల పెట్టుబడుల ప్రణాళికను ఆవిష్కరించారు. రాబోయే 15 ఏళ్లలో కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి చేయని (కార్బన్ న్యూట్రల్‌) కంపెనీగా రిలయన్స్‌ని మార్చాలని ముఖేష్ అంబానీ లక్ష్యంగా పెట్టుకున్నారు.

  • Share this:
Reliance: ఈ ఏడాది జూలైలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ(Mukesh Ambani) తన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(Reliance Industries) ద్వారా గ్రీన్ ఎనర్జీ (Green energy)పై పెట్టే రూ.75 వేల కోట్ల పెట్టుబడుల ప్రణాళికను ఆవిష్కరించారు. రాబోయే 15 ఏళ్లలో కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి చేయని (కార్బన్ న్యూట్రల్‌) కంపెనీగా రిలయన్స్‌ని మార్చాలని ముఖేష్ అంబానీ లక్ష్యంగా పెట్టుకున్నారు. పర్యావరణానికి హాని తలపెట్టని గ్రీన్ ఎనర్జీ (Green energy) సెక్టార్ లో లక్ష్యాలను చేరుకునేందుకు కొత్త ఎనర్జీ ఎకో సిస్టమ్ కు సంబంధించి అన్ని క్లిష్టమైన భాగాలను తయారు చేయాలని రిలయన్స్ (Reliance) నిర్ణయించుకుంది. అందుకే నాలుగు గిగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని ప్లాన్ రచించింది. ఇప్పుడా దిశగా సంస్థ ముందు అడుగులు వేస్తూ పునరుత్పాదక రంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలతో వ్యూహాత్మక కొనుగోళ్లు చేస్తూ భాగస్వామ్యాలను కుదుర్చుకుంటోంది. పునరుత్పాదక శక్తి నూతన శకానికి నాంది పలికేందుకు ఇటీవల కాలంలో రిలయన్స్ సంస్థ ఎలాంటి చర్యలు చేపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Reliance Industries Ltd: బిజినెస్​లో రిలయన్స్​ ఇండస్ట్రీస్‌ హవా.. ఒకే రోజు రెండు పెద్ద ఒప్పందాలు​ కుదుర్చుకుని రికార్డు


ఆర్ఐఎల్ గ్రీన్ వ్యాపారాల వెనుక ఉన్న అంతర్యం ఏమిటి?

రిలయన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ సంస్థ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ అతి పెద్ద కర్మాగారాన్ని నడిపిస్తున్న రిలయన్స్.. 2035 నాటికి దాని కార్బన్ ప్రొడక్షన్ ని సమూలంగా తగ్గించడానికి గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తుందని నొక్కివక్కాణించారు. పర్యావరణ హితమైన పునరుత్పాదక శక్తి శకానికి సత్వరంగా మారేందుకు ఆర్ఐఎల్ తన కొత్త ఎనర్జీ వ్యాపారాన్ని గ్లోబల్ బిజినెస్ గా మారుస్తుందని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా తమ వ్యాపారం విస్తరిస్తుందని వివరించారు. దాదాపు మూడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధికి శక్తినిచ్చిన శిలాజ ఇంధనాల యుగం ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని అభిప్రాయపడ్డారు. పర్యావరణానికి ఇవి హాని తల పెట్టొచ్చని చెప్పుకొచ్చారు. ప్రపంచంలోని అతిపెద్ద ఇంధన మార్కెట్లలో ఒకటిగా ఉన్నందున ప్రపంచాన్ని గ్రీన్ ఎనర్జీ వినియోగదారుగా మార్చడంలో భారతదేశం ముఖ్యపాత్ర కలిగి ఉందన్నారు.

ఆర్ఐఎల్ ఆమోదించిన గ్రీన్ గోల్స్ ఏమిటి?

వార్షిక సమావేశంలో మాట్లాడిన అంబానీ.. జామ్‌నగర్ రోజుకు మొత్తం 1.24 మిలియన్ బారెల్స్ (bpd) సామర్ధ్యం కలిగి ఉంటుందని.. తమ ఓల్డ్ ఎనర్జీ బిజినెస్‌కు పునాదిగా ఉన్న జామ్‌నగర్ న్యూ ఎనర్జీ బిజినెస్‌కు కూడా సపోర్ట్ గా ఉంటుందన్నారు. జామ్‌నగర్‌లో 5,000 ఎకరాల్లో ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ని స్థాపించే పనిని ఇప్పటికే ప్రారంభించినట్లు అంబానీ ప్రకటించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ఉత్పాదక వసతుల్లో ఒకటిగా కాబోతుందని పేర్కొన్నారు. రిలయన్స్ సంస్థ నాలుగు గిగా కర్మాగారాలకు కలిపి రాబోయే మూడు ఏళ్లలో రూ.60,000 కోట్లకు పైగా సంచిత పెట్టుబడులను ఏర్పాటు చేసుకుంది. ఈ ఫ్యాక్టరీలలో సోలార్ ప్యానల్స్, ఎనర్జీ స్టోరేజ్ బ్యాటరీ ఫ్యాక్టరీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఎలక్ట్రోలైజర్ ఫ్యాక్టరీ, ఇంధన సెల్ ఫ్యాక్టరీల తయారీకి ఒక ఇంటిగ్రేటెడ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ ఫ్యాక్టరీ ఉంటుంది. 2030 నాటికి 450GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి కనీసం 100GW సౌరశక్తిని అందించే వ్యాపారాన్ని స్థాపించి ప్రారంభించాలని అంబానీ భావిస్తున్నారు.

Reliance: భారత్‌లో బెస్ట్ ఎంప్లాయర్‌గా నిలిచిన రిలయన్స్ గ్రూప్.. ఫోర్బ్స్ రేటింగ్‌లో సత్తా చాటిన సంస్థ


ఆర్ఐఎల్ దాని లక్ష్యాలను సాధించడానికి కొత్త కొనుగోళ్లు ఎలా సహాయపడతాయి?

ఆర్ఐఎల్.. నార్వే ఆధారిత సోలార్ ప్యానెల్ తయారీ సంస్థ ఆర్ఈసీ (REC) గ్రూప్ లో 771 మిలియన్ డాలర్ల విలువైన వాటాను కొనుగోలు చేసింది. ఆర్ఈసీ సాయంతో ఆర్ఐఎల్ కొత్త ఉత్పత్తులతో పాటు పాత్-బ్రేకింగ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌లను మరింత వేగవంతం చేయాలని భావిస్తోంది. ఆర్.డబ్ల్యు ఎస్.డబ్ల్యుఎస్ఎల్ (RW SWSL) తో భాగస్వామ్యం వల్ల ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు, డిజిటల్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, ప్రాజెక్ట్ అమలులో స్కిల్స్ పెంచుకోవచ్చని రిలయన్స్ భావిస్తోంది. ఈ రెండు ఒప్పందాలు గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ తో పాటు లేటెస్ట్ సాంకేతికత పరిజ్ఞానాన్ని రిలయన్స్‌కు అందిస్తాయని అంబానీ విశ్వసిస్తున్నారు.

ఆర్ఐఎల్ గ్రీన్ డ్రైవ్‌లో భాగంగా ఇతర పెట్టుబడులు పెట్టిందా?

ఈ ఏడాది ఆగస్టులో రిలయన్స్.. న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (ఆర్ఎన్ఈఎస్ఎల్) ద్వారా బ్యాటరీ స్టోరేజీ టెక్నాలజీ కంపెనీ అంబ్రి ఇంక్ లో 50 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు ప్రకటించింది. ఇక సోలార్ ప్యానెల్‌ల కోసం సిలికాన్ వేఫర్‌లను తయారు చేసే జర్మన్ నెక్స్‌వేఫ్ జీఎంబీహెచ్ (NexWafe GmbH), డెన్మార్క్ స్టైస్‌డాల్ A/S లతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది.
Published by:Krishna Adithya
First published: