భారతదేశంలోని బ్యాంకులు (Banks), పోస్టాఫీసులు (Post Offices), ఇతర ఆర్థిక సంస్థలు రికరింగ్ డిపాజిట్లను (Recurring Deposit) అందిస్తున్నాయి. ప్రతి సంస్థ ఈ డిపాజిట్లకు సంబంధించిన అన్ని అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా పెట్టుబడిదారులకు ఆర్‌డీలపై ఉండే అనుమానాలు, ప్రశ్నలు.. వాటికి సమాధానాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్లుప్తంగా అందిస్తున్నాయి. రికరింగ్ డిపాజిట్లకు సంబంధించి పెట్టుబడిదారులు తరచుగా అడిగే ప్రశ్నలు, వాటికి సమాధానాలు చూద్దాం.
ప్రశ్న: మెచూరిటీ తేదీ తరువాత RD అమౌంట్ నేరుగా పెట్టుబడిదారుల బ్యాంక్ అకౌంట్‌కు జమ అవుతుందా?
సమాధానం: మెచ్యూరిటీ అనంతరం రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ప్రొసీడింగ్స్ కస్టమర్ల బ్యాంక్ అకౌంట్‌కు ఆటోమేటిక్‌గా క్రెడిట్ అవుతాయి. ఒకవేళ ఆ మొత్తాన్ని ఇంకా బ్యాంక్ ఖాతాలో జమ చేయకపోతే.. కస్టమర్లు బ్యాంక్ కస్టమర్ కేర్ సర్వీస్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
ప్రశ్న: రికరింగ్ డిపాజిట్‌పై TDS వర్తిస్తుందా?
సమాధానం: 2015 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఫైనాన్స్ బిల్లు-2015 ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో రికరింగ్ డిపాజిట్‌పై సంపాదించిన వడ్డీ రేటుపై TDS వర్తిస్తుంది.
ప్రశ్న: ఆర్‌డీల్లో 'నామినేషన్' సదుపాయం అంటే ఏంటి?
సమాధానం: రికరింగ్ డిపాజిట్ అకౌంట్ తీసుకున్న వారికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే.. మెచూరిటీ తేదీల్లో రికరింగ్ డిపాజిట్ల ప్రొసీడింగ్స్ స్వీకరించే నామినీ లేదా లబ్ధిదారుని పేరును పెట్టుబడిదారులు అందించాల్సి ఉంటుంది.
ప్రశ్న: RDల్లో నామినేషన్/బెనిఫీషియరీ పేరును మార్చుకోవచ్చా?
సమాధానం: ఏదైనా కారణంతో డిపాజిటర్ మరణించిన సందర్భంలో.. వారి రికరింగ్ డిపాజిట్ మొత్తాన్ని చెల్లించాల్సిన వ్యక్తిని డిపాజిటర్ ముందుగానే నామినేట్ చేయవచ్చు. నామినీ లేదా లబ్ధిదారులను మార్చుకునే అవకాశం కూడా ఉంది.
ప్రశ్న: సీనియర్ సిటిజన్లకు రికరింగ్ డిపాజిట్లపై ఏవైనా అదనపు ప్రయోజనాలు ఉంటాయా?
సమాధానం: భారతదేశంలోని సీనియర్ సిటిజన్లకు డిపాజిట్లపై 0.5 శాతం ఎక్కువ వడ్డీని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందిస్తున్నాయి. నాన్-సీనియర్ సిటిజన్లతో పోలిస్తే వారు ఈ మేరకు లబ్ధి పొందవచ్చు.
ప్రశ్న: రికరింగ్ డిపాజిట్ అకౌంట్ తెరవడానికి అవసరమైన కనీస డిపాజిట్ మొత్తం ఎంత?
సమాధానం: రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌లో కనీస పెట్టుబడి బ్యాంకులను బట్టి మారుతుంది. కొన్ని సంస్థలు రూ.10, రూ.100 నుంచి కూడా ఆర్‌డీ అకౌంట్లను అందుబాటులో ఉంచాయి. ప్రధాన బ్యాంకుల్లో కనీస డిపాజిట్ మొత్తం రూ.500 నుంచి ప్రారంభమవుతోంది.
ప్రశ్న: అన్ని ఆర్‌డీలకు ఒకే వడ్డీ రేటు వర్తిస్తుందా?
సమాధానం: అన్ని రికరింగ్ డిపాజిట్లకు వడ్డీ ఒకేలా ఉండదు. ఇది బ్యాంకులు, గడువును బట్టి మారుతుంది. విభిన్న ఆర్‌డీ స్కీమ్స్‌కు వేర్వేరు వడ్డీరేట్లను కస్టమర్లు పొందవచ్చు.
ప్రశ్న: రికరింగ్ డిపాజిట్ అకౌంట్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
సమాధానం: రికరింగ్ డిపాజిట్ పొందాలనుకుంటున్న బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను పెట్టుబడిదారులు సందర్శించవచ్చు. ప్రధాన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండే ‘అప్లై నౌ’ ఆప్షన్ ద్వారా ఆర్‌డీ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఇప్పటికే ఏదైనా బ్యాంక్‌లో అకౌంట్ ఉంటే, నెట్ బ్యాంకింగ్ ద్వారా సులభంగా రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు.
ప్రశ్న: ఈ డిపాజిట్లపై వడ్డీని లెక్కించడానికి RD కాలిక్యులేటర్ ఉపయోగించవచ్చా?
సమాధానం: వివిధ బ్యాంకులు తమ అధికారిక వెబ్‌సైట్‌లో RD కాలిక్యులేటర్‌లను అందిస్తాయి. వీటి సాయంతో వడ్డీ మొత్తాన్ని, రీ పేమెంట్ గడువును సులభంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దీంతోపాటు మెచూరిటీ నాటికి పొందే మొత్తాన్ని లెక్కించవచ్చు.
ప్రశ్న: RD అకౌంట్ తెరవడానికి ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం?
సమాధానం: మీరు ఇప్పటికే ఒక బ్యాంకులో కస్టమర్ అయితే.. ఆ బ్యాంకులో RD అకౌంట్ తీసుకోవడం సులభం. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలతో RD కోసం ఆన్‌లైన్‌లో అభ్యర్థించవచ్చు. లేదంటే మొదటి చెక్కును సేకరించేందుకు బ్యాంక్ ప్రతినిధిని పంపవచ్చు. ఇలా 24 గంటలలోపు కస్టమర్ల రిక్వెస్ట్‌ను బ్యాంకులు ప్రాసెస్ చేస్తాయి. ఆ తరువాత ప్రతి నెల నిర్ణీత గడువు తేదీలో అకౌంట్ నుంచి డిపాజిట్ మొత్తం ఆటోమెటిక్‌గా డెబిట్ అవుతుంది.
ప్రశ్న: ఒక డిపాజిటర్ ఎన్ని రికరింగ్ డిపాజిట్లను కలిగి ఉండవచ్చు? వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ వర్తిస్తుందా?
సమాధానం: సాధారణంగా బ్యాంకులు కస్టమర్లకు అందించే RD అకౌంట్లపై పరిమితులు విధించవు. అయితే RDలపై రూ.10,000 కంటే ఎక్కువగా అందే వడ్డీపై ట్యాక్స్ వర్తిస్తుంది. డిపాజిటర్లకు పాన్ కార్డ్ లేకపోతే 20 శాతం TDS వర్తిస్తుంది.
ప్రశ్న: మెచూరిటీ తేదీకి ముందే RD మొత్తాన్ని విత్‌డ్రా చేయవచ్చా?
సమాధానం: కొంత మొత్తంలో రుసుము చెల్లించి RD అకౌంట్‌ను గడువుకు ముందే రిడీమ్ చేసుకోవచ్చు. అయితే అత్యవసరమైతేనే ఇలా మెచూరిటీకి ముందే ఆర్‌డీ అకౌంట్‌లో నిధులు తీసుకోవాలి. లేదంటే పెట్టుబడి ప్రయోజనాలు డిపాజిటర్లకు అందవు.
ప్రశ్న: ఉత్తమ రికరింగ్ డిపాజిట్ పథకాలు ఏవి?
సమాధానం: వివిధ రకాల బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందించే రికరింగ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పోల్చడం ద్వారా ఉత్తమ పథకాన్ని పెట్టుబడిదారులు ఎంచుకోవచ్చు.
ప్రశ్న: ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్లలో ఏది మంచిది?
సమాధానం: FD, RDలు వేటికవే ప్రత్యేకం. డిపాజిటర్ల పెట్టుబడి ప్రొఫైల్, ఆర్థిక లక్ష్యాల ఆధారంగా ఈ రెండింట్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. మిగులు నిధులు ఉన్నప్పుడు ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. క్రమరహితంగా ఆదాయం పొందేవారు ఆర్‌డీల్లో పెట్టుబడి పెట్టవచ్చు.
ప్రశ్న: ఆర్‌డీ మెచూరిటీ నిధులను ఏ అకౌంట్‌కైనా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చా?
సమాధానం: లేదు.. మెచూరిటీ తరువాత అందే నిధులను ఆర్‌డీ అకౌంట్‌కు ఫండింగ్ చేసిన డెబిట్ అకౌంట్‌కు మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేస్తారు.
ప్రశ్న: రికరింగ్ డిపాజిట్‌ను ఒక్క మైనర్ పేరుతోనే తీసుకోవచ్చా?
సమాధానం: రికరింగ్ డిపాజిట్‌ను మైనర్ పేరుతో తీసుకోవచ్చు. అయితే వారికి సహజ లేదా చట్టపరమైన సంరక్షకులు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. రికరింగ్ డిపాజిట్ కోసం దరఖాస్తు ఫారంలో మైనర్ తరఫున సహజ/లీగల్ గార్డియన్ సంతకం చేస్తారు. డిపాజిట్‌కు సంబంధించిన అన్ని కమ్యూనికేషన్‌లను సంరక్షకుడికి తెలియజేస్తారు.
ప్రశ్న: ట్రస్ట్, కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, అన్- కార్పొరేటెడ్ అసోసియేషన్‌లు RDల్లో పెట్టుబడి పెట్టవచ్చా?
సమాధానం: సాధారణంగా ఇలాంటి సంస్థలకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆర్‌డీలను మంజూరు చేయవు. వ్యక్తులు, హిందూ అన్-డివైడెడ్ ఫ్యామిలీలకు మాత్రమే ఆర్‌డీలు అందుబాటులో ఉంటాయి.
ప్రశ్న: ఆర్‌డీలను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చా?
సమాధానం: RDలను ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఆప్షన్ ఉండదు. మెచూరిటీ వరకు అకౌంట్లు డిపాజిటర్ పేరుతోనే ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Interest rates, Recurring Deposits