Home /News /explained /

FD vs RD: ఫిక్స్‌డ్ డిపాజిట్లకు, రికరింగ్ డిపాజిట్లకు మధ్య తేడాలేంటీ?

FD vs RD: ఫిక్స్‌డ్ డిపాజిట్లకు, రికరింగ్ డిపాజిట్లకు మధ్య తేడాలేంటీ?

FD vs RD: ఫిక్స్‌డ్ డిపాజిట్లకు, రికరింగ్ డిపాజిట్లకు మధ్య తేడాలేంటీ?
(ప్రతీకాత్మక చిత్రం)

FD vs RD: ఫిక్స్‌డ్ డిపాజిట్లకు, రికరింగ్ డిపాజిట్లకు మధ్య తేడాలేంటీ? (ప్రతీకాత్మక చిత్రం)

FD vs RD | మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌లో (Fixed Deposit Account) డబ్బులు దాచుకోవాలని అనుకుంటున్నారా? రికరింగ్ డిపాజిట్ (Recurring Deposit Account) అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? ఈ రెండు అకౌంట్ల మధ్య తేడాలేంటో తెలుసుకోండి.

    సాధారణంగా భారతీయులు రిస్క్ లేని పెట్టుబడులకే ఎక్కువగా మెగ్గు చూపుతారు. నిధులను పొదుపు చేయడంతో పాటు కొంత మొత్తాన్ని నష్టభయం లేని ఇన్వెస్ట్‌మెంట్‌కు కేటాయిస్తారు. ఈ క్రమంలో చాలామందికి పెట్టుబడులు అనగానే ప్రధానంగా కనిపించేవి ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD), రికరింగ్ డిపాజిట్ (RD). దేశంలోని చాలా మంది రిస్క్ తీసుకోని పెట్టుబడిదారులకు ఈ రెండు బెస్ట్ ఆప్షన్లుగా మారాయి. వీటిలో దేంట్లోనైనా పెట్టుబడి పెట్టాలని చూస్తుంటే.. రికరింగ్, ఫిక్స్‌డ్ డిపాజిట్ల మధ్య తేడాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. మొదటిసారి ఇన్వెస్ట్ చేసేవారు.. RD, FDలలో దేన్ని ఎంచుకోవాలో తెలియక గందరగోళానికి గురవుతారు. ఎఫ్‌డీ, ఆర్డీ రెండింట్లోనూ ప్రయోజనాలు, లోపాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పెట్టుబడి ఆప్షన్ల మధ్య తేడాలేంటి? పెట్టుబడులకు ఏది ఉత్తమమైన ఎంపిక? వంటి వివరాలు తెలుసుకుందాం.

    ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) అంటే ఏంటి?


    ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది మార్కెట్ రిస్క్‌తో ఏమాత్రం సంబంధం లేని, ఎలాంటి నష్టభయం లేని పెట్టుబడి ఆప్షన్. ఇందులో పెట్టుబడి వ్యవధి, వడ్డీ రేటును ఆర్థిక సంస్థలు ముందుగానే నిర్ణయిస్తాయి. సాధారణంగా 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచూరిటీ ఉండే ఎఫ్‌డీలలో ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు. మెచూరిటీ ముగిసిన తరువాత డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఒకేసారి అందుకుంటారు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీని నిర్దిష్ట వ్యవధిలో పొందే ఆప్షన్‌ ఉంటుంది. లేదా మెచూరిటీ సమయంలోనే డిపాజిట్ సొమ్ముతో పాటు వడ్డీ పొందే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

    SBI Savings Scheme: ఎస్‌బీఐలో రోజూ రూ.33 పొదుపు చేస్తే చాలు... రూ.1,60,000 మీవే

    difference between FD and RD, FD vs RD which is better, Fixed Deposits, Recurring Deposit or Fixed Deposit, Recurring Deposit vs Fixed Deposit, Recurring Deposits, ఎఫ్‌డీ వర్సెస్ ఆర్‌డీ, పర్సనల్ ఫైనాన్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే ఏంటీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటీ, రికరింగ్ డిపాజిట్లు
    ప్రతీకాత్మక చిత్రం

    రికరింగ్ డిపాజిట్ (RD) అంటే ఏంటి?


    రికరింగ్ డిపాజిట్ల విషయంలో.. బ్యాంకు లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడిగా జమ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా 6 నెలల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండే కాలవ్యవధికి వడ్డీ రేటును సంస్థలు నిర్ణయిస్తాయి. మెచూరిటీ నాటికి డిపాజిట్ చేసిన ప్రధాన మొత్తాన్ని కస్టమర్లు అందుకుంటారు. రికరింగ్ డిపాజిట్‌పై వడ్డీని నిర్ణీత వ్యవధిలో (regular intervals) తీసుకోవచ్చు. లేదా మెచూరిటీ సమయంలోనే మొత్తం వడ్డీని స్వీకరించచే ఆప్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు.

    ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ మధ్య ప్రధాన తేడాలు...


    పెట్టుబడి పెట్టే విధానం

    FD: సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఏక మొత్తంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని నిర్ణీత కాల వ్యవధికి ముందుగానే డిపాజిట్ చేయాలి.

    RD: ఇందులో కూడా నిర్ణీత కాలానికి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కానీ డిపాజిటర్లు ఒకేసారి డబ్బు మొత్తాన్ని కాకుండా ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ మొత్తంపై డిపాజిటర్లకు వడ్డీ లభిస్తుంది.

    మెచూరిటీ లేదా డిపాజిట్ గడువు

    FD: వివిధ గడువుల్లో డిపాజిట్ చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటాయి. కనిష్టంగా 7 రోజులు గరిష్టంగా 10 సంవత్సరాలకు ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టవచ్చు.

    RD: రికరింగ్ డిపాజిట్లకు కనిష్టంగా 6 నెలలు గరిష్టంగా 10 సంవత్సరాలు మెచూరిటీ ఉంటుంది.

    Credit Cards: క్రెడిట్ కార్డ్ తీసుకోవాలా? యాన్యువల్ ఫీజు లేని బెస్ట్ కార్డులు ఇవే

    difference between FD and RD, FD vs RD which is better, Fixed Deposits, Recurring Deposit or Fixed Deposit, Recurring Deposit vs Fixed Deposit, Recurring Deposits, ఎఫ్‌డీ వర్సెస్ ఆర్‌డీ, పర్సనల్ ఫైనాన్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే ఏంటీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటీ, రికరింగ్ డిపాజిట్లు
    ప్రతీకాత్మక చిత్రం


    కనీస పెట్టుబడి మొత్తం

    FD: ఫిక్స్‌డ్ డిపాజిట్లలో డిపాజిట్ చేసే కనీస మొత్తం బ్యాంకులను బట్టి మారుతుంది. కొన్ని బ్యాంకులు రూ.100 నుంచి ఎఫ్‌డీ ఇన్వెస్ట్‌మెంట్‌కు అవకాశం కల్పిస్తున్నాయి.

    RD: రికరింగ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసే కనీస మొత్తం కూడా బ్యాంకులు ఆర్థిక సంస్థలను బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని బ్యాంకులు రూ.10 నుంచి కూడా ఆర్డీల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పిస్తున్నాయి.

    వడ్డీ చెల్లింపు

    FD: వీటిపై అందే వడ్డీ రికరింగ్ డిపాజిట్ వడ్డీ కంటే ఎక్కువగా ఉంటుంది.

    RD: ఎఫ్‌డీలతో పోలిస్తే ఆర్‌డీ వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి.

    లోన్ సదుపాయం

    FD: ఒక వ్యక్తి తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై లోన్ పొందవచ్చు. అయితే ఈ లోన్ మొత్తం బ్యాంకులను బట్టి భిన్నంగా ఉండవచ్చు. లోన్ గరిష్ట పరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్ విలువలో 90 శాతం వరకు ఉండవచ్చు.

    RD: రికరింగ్ డిపాజిట్లపై కూడా లోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. గరిష్ట పరిమితి డిపాజిట్ మొత్తం విలువలో 90 శాతం వరకు ఉంటుంది.

    స్వీయ-పునరుద్ధరణ (Auto-renewal) ఆప్షన్

    FD: ఎఫ్‌డీల విషయంలో ఆటోమెటిక్ రెన్యువల్ ఆప్షన్ అందుబాటులో ఉంది. అయితే మెచూరిటీ ముగిసిన తరువాత డిపాజిటర్లు ప్రిన్సిపల్‌ మొత్తాన్ని మాత్రమే.. లేదా అసలుతో వడ్డీ మొత్తాన్ని కలిపి ఎఫ్‌డీగా రెన్యువల్ చేసుకోవచ్చు.

    RD: రికరింగ్ డిపాజిట్ల విషయంలో ఆటోమెటిక్ రెన్యువల్ ఆప్షన్ అందుబాటులో లేదు. నిర్ణీత కాలవ్యవధి తరువాత ఆర్డీలను మళ్లీ రెన్యువల్ చేసుకోలేరు. అవసరమైతే కొత్త ఆర్డీ అకౌంట్‌ను కస్టమర్లు తీసుకోవాల్సి ఉంటుంది.

    Post Office Scheme: రోజూ రూ.50 దాచుకుంటే... రూ.35 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు

    difference between FD and RD, FD vs RD which is better, Fixed Deposits, Recurring Deposit or Fixed Deposit, Recurring Deposit vs Fixed Deposit, Recurring Deposits, ఎఫ్‌డీ వర్సెస్ ఆర్‌డీ, పర్సనల్ ఫైనాన్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే ఏంటీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటీ, రికరింగ్ డిపాజిట్లు
    ప్రతీకాత్మక చిత్రం


    ఇన్‌స్టాల్‌మెంట్ వాయిదా వేయవచ్చా?

    FD: ఫిక్స్‌డ్ డిపాజిట్లలో అసలు మొత్తాన్ని ముందుగానే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీని విషయంలో ఇన్‌స్టాల్‌మెంట్ ఆప్షన్ వర్తించదు.

    RD: ఆర్‌డీ ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లింపు ఒక నెలకు మించి ఆలస్యమైతే.. కస్టమర్లు బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటుపై కొంతమేర పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల డిపాజిటర్లు క్రమం తప్పకుండా ఆర్‌డీ ఇన్‌స్టాల్మెంట్ చెల్లించడం మంచిది.

    ప్రేరేపించే అంశం (Motivating factor)

    FD: ఒక వ్యక్తి దగ్గర మిగులు నిధులు ఉన్నప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. వీటిపై అందే వడ్డీతో రాబడిని ఆశించవచ్చు.

    RD: రికరింగ్ డిపాజిట్లో ఒక వ్యక్తి నిర్ణీత మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడానికి వీలుంటుంది. ఇది ఒక వ్యక్తికి పొదుపును అలవాటు చేస్తుంది.

    డిఫాల్ట్ నిబంధన

    FD: ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఒక వ్యక్తి ముందుగానే మొత్తం డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు. అందువల్ల ఎఫ్‌డీ చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అయ్యే అవకాశం లేదు.

    RD: ఒక వ్యక్తి వరుసగా ఆరు నెలల పాటు ఆర్‌డీ వాయిదాల చెల్లింపులు చేయడంలో విఫలమైతే.. అలాంటి రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌ను మూసివేసే హక్కు బ్యాంకులకు ఉంటుంది.

    మూలం వద్ద పన్ను మినహాయింపు (TDS)

    FD: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రూ.40,000 కంటే ఎక్కువ వడ్డీ ఆదాయం వచ్చినప్పుడు, సీనియర్ సిటిజన్ డిపాజిటర్లకు రూ.50,000 కంటే ఎక్కువ వడ్డీ ఆదాయం వచ్చినప్పుడు.. 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. పాన్ కార్డు వివరాలు సమర్పించకపోతే ఇది 20 శాతానికి పెరుగుతుంది.

    RD: సాధారణ పౌరులకు రూ.40,000 కంటే ఎక్కువ వడ్డీ ఆదాయంపై, సీనియర్ సిటిజన్ డిపాజిటర్లకు రూ.50,000 కంటే ఎక్కువ వడ్డీ ఆదాయంపై 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. పాన్ కార్డు వివరాలు సమర్పించకపోతే ఈ మొత్తం 20 శాతానికి పెరుగుతుంది.

    పన్ను ఆదా (Tax Saving)

    FD: 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో అందుబాటులో ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై పన్ను ఆదా చేసుకునే అవకాశం ఉంది. వీటిని ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలు అంటారు.

    RD: ట్యాక్స్ సేవింగ్ రికరింగ్ డిపాజిట్లు అందుబాటులో లేవు.

    డిపాజిట్ ఇన్సూరెన్స్

    FD: ఫిక్స్‌డ్ డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.

    RD: రికరింగ్ డిపాజిట్లకు కూడా డిపాజిట్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Investment Plans, Personal Finance, Recurring Deposits, Save Money

    తదుపరి వార్తలు