హోమ్ /వార్తలు /Explained /

EPF Interest: ఈపీఎఫ్ అకౌంట్‌కు వడ్డీ జమ చేయడంలో ఆలస్యం.. అసలు కారణం ఇదే..

EPF Interest: ఈపీఎఫ్ అకౌంట్‌కు వడ్డీ జమ చేయడంలో ఆలస్యం.. అసలు కారణం ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

EPF Interest: ఏటా దీపావళికే వడ్డీ జమ ప్రకటన వస్తుంది. కానీ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి మాత్రం ఆలస్యం అవుతోంది. దీనిపై అనేక ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి.

దీపావళి సందర్భంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO ) ఏటా ఉద్యోగుల ఖాతాల్లో వడ్డీ జమచేస్తుంది. ఆరు కోట్ల మంది ఖాతాదారులకు సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ట్రస్టీస్.. 8.5 శాతం వడ్డీ చెల్లించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదించింది. ఏటా దీపావళికే వడ్డీ జమ ప్రకటన వస్తుంది. కానీ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి మాత్రం ఆలస్యం అవుతోంది. దీనిపై అనేక ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి. దేశంలో అధునాతన డిజిటల్ చెల్లింపుల విధానాలు అమల్లోకి వచ్చినా గత ఏడాది కంటే ఈ ఏడాది వడ్డీ జమ ఆలస్యం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

* సమన్వయం లేకనే ఆలస్యం

ప్రతి సంవత్సరం మార్చిలో సమావేశమయ్యే సెంట్రల్ బోర్డ్ ఆప్ ట్రస్టీస్ ఖాతాదారులకు ఎంత వడ్డీ రేటు ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. ఈ నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపుతారు. కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించగానే, దాన్ని కేంద్ర కార్మిక శాఖ ఆమోదం కోసం పంపిస్తారు. ఆ శాఖ ఆమోదం తెలిపిన తరువాతే వడ్డీ జమ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కార్మిక శాఖ సరైన పత్రాలు పంపకపోవడం వల్లే ఆర్థిక శాఖ ఆమోదించడంలో ఆలస్యం అయిందని ఆ శాఖకు చెందిన ఓ అధికారి చెప్పుకొచ్చారు.

ఇండియా పోస్ట్ చిన్న పొదుపు ఖాతాలకు వడ్డీ క్రెడిట్, సీనియర్ సిటిజన్స్ స్కీములు, సుకన్య సమృద్ధి ఖాతాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేకం ఉన్నా కూడా సకాలంలో జమ చేస్తున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి మూడు నెలలకు వడ్డీ రేట్లను ఆమోదించి, ఎటువంటి ఆలస్యం లేకుండా ఖాతాలకు జమ చేస్తుంది. కానీ ఈపీఎఫ్ వడ్డీ జమ విషయంలో మాత్రం జాప్యం తప్పడం లేదు. ఈ ఆలస్యానికి అనేక కారణాలు చెబుతున్నా, సరైన కారణం మాత్రం తెలియడం లేదు. ఇతర పథకాల్లో వడ్డీ రేట్ల కంటే ఈపీఎఫ్ వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయి. అందువల్ల ఈపీఎఫ్ వడ్డీ చెల్లింపులకు చివరి ప్రాధాన్యం ఇవ్వడం కారణం కావచ్చని మెర్సర్ ఇండియా రిటైర్మెంట్, హెల్త్ అండ్ బెనిఫిట్స్ బిజినెస్ లీడర్ ప్రీతి చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.

త్వరలోనే తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. బీజేపీ ఎమ్మెల్యే జోస్యం

టీఆర్ఎస్‌కు మాత్రమే కాదు.. ఆ నేతకు కూడా ‘హుజూరాబాద్’ పెద్ద దెబ్బ.. ఇమేజ్‌కు డ్యామేజ్ ?

* సమగ్ర విధానం అవసరం

పారదర్శకత, ఆటో ట్రాన్స్‌ఫర్ ద్వారా ఉద్యోగుల ఇబ్బందులను తగ్గించవచ్చు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్రామాణిక వడ్డీ రేటు ప్రకటించాలి. ప్రతి త్రైమాసికం చివర్లో ఈపీఎఫ్ వో ఖాతాలకు వడ్డీని క్రెడిట్ చేయాలి. ఆటోమేటెడ్ విధానంలో వడ్డీ క్రెడిట్ చేయడం ద్వారా మరింత పారదర్శకత పెరుగుతుంది. డిజిటలైజేషన్ లో భాగంగా ఇప్పటికే ఆధార్ సీడింగ్, పాన్ లింకేజీ పూర్తయిందని బ్యాంకు ఖాతాల మాదిరిగానే ఆటో క్రెడిట్ చేయడం ద్వారా ఆలస్యం తగ్గించవచ్చని ప్లాన్ రూపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు అమోల్ జోషి చెప్పారు.

First published:

Tags: EPFO

ఉత్తమ కథలు