Covid Vaccine: కరోనా వ్యాక్సిన్ వేసుకోని వారు బయట తిరగరాదు... సరైన నిర్ణయమేనా?

కరోనా వ్యాక్సిన్ వేసుకోని వారు బయట తిరగరాదు... సరైన నిర్ణయమేనా? (image credit - twitter - reuters)

Covid Vaccine: ప్రజలు కంట్రోల్ తప్పడం సహజం... ప్రభుత్వాలు అలా కాదు... నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. తాజాగా తీసుకున్న నిర్ణయం రచ్చ రేపింది. ప్రజలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

  • Share this:
    Covid Vaccine: రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఇవాళ్టి నుంచి కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ అయినా వేసుకోని వారు... బహిరంగ ప్రదేశాలకు వెళ్లడానికి వీల్లేదని ప్రకటించింది. అంతేకాదు... కరోనా వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాల్సిందే అనే కండీషన్ తెచ్చింది. దీనికి సంబంధించి జీవో జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు అనుకున్న స్థాయిలో తగ్గట్లేదు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. నిజానికి తెలుగు రాష్ట్రాలతో పోల్చితే... రాజస్థాన్‌లో పరిస్థితి బాగానే ఉంది. అక్కడ కొత్త కేసులు తక్కువే వస్తున్నాయి. ఆదివారం కొత్తగా 162 పాజిటివ్ కేసులు వచ్చాయి. నలుగురు చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 9,52,129కి చేరింది. మొత్తం మరణాలు 8,914గా ఉన్నాయి.

    ఇవాళ్టి నుంచి ప్రభుత్వ ఆఫీసులు సాయంత్రం 6 వరకూ తెరిచి ఉంటాయి. అలాగే... కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న 60 శాతం సిబ్బందితో జిమ్ములు, రెస్టారెంట్లను సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు తెరవవచ్చని ప్రభుత్వం తెలిపింది. అలాగే వ్యాక్సిన్లు వేయించుకున్న వారు ఇండోర్ క్రీడల్లో పాల్గొనవచ్చని తెలిపింది. టీకాలు వేయించుకున్న ఉద్యోగులున్న వ్యాపార సంస్థలను రాత్రి 7 గంటల వరకు తెరవచ్చని చెప్పింది. పెళ్లిళ్లకు 40 మందికి మించి అతిథుల్ని పిలవకూడదని కండీషన్ పెట్టింది. జులై 1 నుంచి మ్యారేజ్ ఫంక్షన్ హాళ్లు తెరవవచ్చని తెలిపింది. అలాగే వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు మాత్రమే ప్రార్థనా స్థలాలకు వెళ్లేందుకు వీలుంది. అంతేకాదు ఇవాళ్టి నుంచి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లనే బస్సులు, పార్కుల్లోకి అనుమతిస్తారు.

    ఇది కూడా చదవండి: DA: జులై 1 నుంచి కేంద్ర ఉద్యోగులకు కరవు బత్యం పెంపు? ఆర్థిక శాఖ ఏం చెప్పిందంటే...

    ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు వేయించుకుందామన్నా తగిన వ్యాక్సిన్లు లేవనీ... అలాంటప్పుడు ఇలాంటి కండీషన్ ఎలా పెడతారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ తప్పనిసరి అని ఎక్కడా చెప్పలేదనీ... మరి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తప్పనిసరి ఎందుకు చేస్తోందని అంటున్నారు. వ్యాక్సిన్ రెండు డోసులూ వేయించుకున్న వారికి కూడా కరోనా సోకుతున్నప్పుడు... ఇక వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే అని ఎలా పట్టుపడతారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వర్గాలు మాత్రం దేశంలో విస్తరిస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్‌కి బ్రెక్ వెయ్యాలంటే... ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవంటున్నాయి.
    Published by:Krishna Kumar N
    First published: