పశ్చిమ భారతదేశం (India)లోని గిరిజనుల (Tribal People) కోసం ప్రత్యేక రాష్ట్రమైన "భిల్ ప్రదేశ్ (Bhil Pradesh)" కోసం డిమాండ్లు మళ్లీ పెరుగుతున్నాయి. పథకాలు, చట్టాలు గిరిజనులకు సరిగ్గా అమలు కావడం లేదని.. ఈ సమస్యకు పరిష్కారం ప్రత్యేక రాష్ట్రం కావాలని కొందరు అంటున్నారు. మరి అసలు ఈ డిమాండ్ ప్రాతిపదిక ఏంటి, భిల్ ప్రదేశ్ అంటే ఏంటి, డిమాండ్లను ఎవరు పెంచుతున్నారు? అనేది తెలుసుకుందాం. ‘భిల్ ప్రదేశ్(Bhil Pradesh)’ అంటే.. గుజరాత్‌లో(Gujarat) ఉన్న రాజకీయ పార్టీ భారతీయ గిరిజన పార్టీ (బీటీపీ-BTP) భిల్ ప్రదేశ్‌ని నాలుగు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న 39 జిల్లాలతో ఒక ప్రత్యేక రాష్ట్రంగా(State) ఏర్పాటు చేయాలని భావిస్తోంది. గుజరాత్‌లో 16, రాజస్థాన్‌లో(Rajasthan) 10, మధ్యప్రదేశ్‌లో 7 మహారాష్ట్రలో 6 జిల్లాలతో భిల్ ప్రదేశ్‌ని ఏర్పాటు చేయాలని భారతీయ గిరిజన పార్టీ యోచిస్తోంది.
1913లో మాన్‌గర్ హత్యాకాండ తర్వాత భిల్ సంఘ సంస్కర్త, ఆధ్యాత్మిక నాయకుడు గోవింద్ గురు గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్‌ను మొదటిసారి లేవనెత్తారని BTP రాజస్థాన్ అధ్యక్షుడు డాక్టర్ వేలారామ్ ఘోగ్రా పేర్కొన్నారు. జలియన్‌వాలా బాగ్‌కి ఆరేళ్ల ముందు జరిగిన ఈ మారణకాండను "ఆదివాసీ జలియన్‌వాలా" అని కూడా పిలుస్తారు. రాజస్థాన్, గుజరాత్ సరిహద్దులోని మాన్‌గర్ కొండలలో 1913 నవంబర్ 17న వందలాది మంది భిల్ గిరిజనులను బ్రిటిష్ దళాలు చంపేశారు. అయితే "స్వాతంత్ర్యం తర్వాత, భిల్ ప్రదేశ్ కోసం డిమాండ్ పదేపదే పెరిగింది," అని ఘోగ్రా చెప్పారు.
గిరిజనులు తమకే ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కోరుకుంటున్నారు?
ఇంతకుముందు రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లోని దుంగార్‌పూర్, బన్స్వారా, ఉదయపూర్ ప్రాంతం మొదలైనవి ఒకే సంస్థలో భాగంగా ఉండేవి. కానీ స్వాతంత్య్రానంతరం, గిరిజన మెజారిటీ ప్రాంతాలను రాజకీయ పార్టీలు విభజించాయి. ఫలితంగా గిరిజనులు ఒకటిగా ఉండలేకపోతున్నారని BTP రాజస్థాన్ అధ్యక్షుడు డాక్టర్ వేలారామ్ ఘోగ్రా పేర్కొన్నారు. ఘోగ్రా ప్రకారం, దశాబ్దాలుగా, అనేక కేంద్ర ప్రభుత్వాలు గిరిజనులపై వివిధ చట్టాలు, ప్రయోజనాలు, పథకాలు, కమిటీ నివేదికలు తీసుకొచ్చాయి, కానీ వాటి అమలు నెమ్మదిగా సాగుతోంది.
"రాజ్యాంగంలోని ఆర్టికల్ 244(1) ప్రకారం ఐదవ షెడ్యూల్ ద్వారా గిరిజన ప్రయోజనాల పరిరక్షణ వంటి అనేక చర్యలు ఉన్నాయి. అయితే వీటిలో చాలా వరకు కాంగ్రెస్ లేదా బీజేపీ అధికార పార్టీ ఇచ్చిన హామీల లాగానే మిగిలిపోయాయి" అని ఆయన చెప్పారు. "పంచాయితీల నిబంధనల చట్టం 1996లో రూపొందించడం జరిగింది. రాజస్థాన్ ప్రభుత్వం 1999లో చట్టాన్ని ఆమోదించింది. 2011లో నిబంధనలతో అమలులోకి వచ్చింది. కానీ దుంగార్‌పూర్‌లోని పాల్‌దేవాల్ గ్రామం ప్రజలకు 25 ఏళ్లుగా చట్టం గురించి కూడా తెలియదు. బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా చట్టంపై సరైన అవగాహన లేదు." అని ఘోగ్రా వివరించారు.
భిల్ ప్రదేశ్ కోసం డిమాండ్స్ పెరుగుతున్నాయా?
గుజరాత్‌లో 2017లో ఏర్పాటైన బీటీపీ ప్రధాన లక్ష్యాలలో ప్రత్యేక భిల్ ప్రదేశ్ ఏర్పాటు ఒకటి. దశాబ్ద కాలంగా డిమాండ్‌తో తాను ప్రత్యక్షంగా పాల్గొన్నానని ఘోగ్రా చెప్పారు. గిరిజనులను ఒక చోటికి చేర్చి అవగాహన కల్పించేందుకు నిత్యం సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ రెండింటిపై గిరిజన యువకులు విశ్వాసం కోల్పోయారని ఘోగ్రా అన్నారు. అయితే రాజ్యసభ ఎన్నికలకు ముందు, కాంగ్రెస్ ఒక గిరిజనుడిని ఎగువ సభకు పంపాలనేది బీటీపీ తక్షణ డిమాండ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.