హోమ్ /వార్తలు /Explained /

Explained: యుద్ధాన్ని సమర్ధించుకోవడానికి పుతిన్ ఆరాటం..! అస్సలు ఆ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు..?

Explained: యుద్ధాన్ని సమర్ధించుకోవడానికి పుతిన్ ఆరాటం..! అస్సలు ఆ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు..?

వ్లాదిమర్ పుతిన్ (ఫైల్ ఫోటో)

వ్లాదిమర్ పుతిన్ (ఫైల్ ఫోటో)

రష్యా (Russia), ఉక్రెయిన్ (Ukraine) యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. రష్యన్ ఆర్మీ ఉక్రెయిన్ లోని అన్ని నగరాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రపంచం మొత్తం ఈ యుద్ధం ఆపమని కోరుతున్నా రష్యా వెనక్కు తగ్గట్లేదు.

రష్యా (Russia), ఉక్రెయిన్ (Ukraine) యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. రష్యన్ ఆర్మీ ఉక్రెయిన్ లోని అన్ని నగరాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రపంచం మొత్తం ఈ యుద్ధం ఆపమని కోరుతున్నా రష్యా వెనక్కు తగ్గట్లేదు. రోజురోజుకూ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోంది. తమకు తోచిన యుద్ధ విద్యలన్నీ చిన్న దేశమైన ఉక్రెయిన్ మీద ప్రయోగిస్తోంది. ఉక్రెయిన్(Ukraine) ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికే యుద్ధాన్ని ప్రారంభించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఈ సందర్భంగా రెండో ప్రపంచ యుద్ధం(World War) గురించి, నాజీల గురించి ప్రస్తావిస్తున్నారు.ఈ సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్లు నియో నాజీలని వర్ణించారు. అందుకోసమే యుద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం తన బంధు వర్గాన్ని కోల్పోయారు. పుతిన్ అతడిని నాజీలతో పోల్చినప్పటికీ, జెలెన్‌ స్కీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై ప్రజాప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్రను సొంత దేశస్థులు వ్యతిరేకిస్తున్నప్పటికీ పుతిన్ వినిపించుకోవడం లేదు. ఉక్రెయిన్లనే నాజీలుగా అభివర్ణిస్తున్నారు. తాను చెబుతున్నది ముమ్మాటికి నిజమే అంటూ చెప్పుకుంటున్నారు.

Explained: ఎక్కువ మంది ఉక్రెయిన్‌ శరణార్థులను అమెరికా ఎందుకు అనుమతించట్లేదు..? దీని వెనుక ఉన్న కారణాలు ఏవి..?

చరిత్రకారులు ఏం చెబుతున్నారు?

రష్యా రెండో ప్రపంచయుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ యూదుల పాత్రను గొప్పగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుందని కొంత మంది చరిత్రకారులు చెబుతున్నారు. పాతరోజుల్లో నాజీల మాదిరిగా నేడు ఉక్రెయిన్ లో ఏవీ లేవు. మతోన్మాదం లేదు... విష సంస్కృతి లేదు. కానీ రష్యా మాత్రం ఉక్రెయిన్లను నియో నాజీలని చెబుతోంది. రష్యా చేస్తున్న వాదన పూర్తిగా అసంబద్ధమైందని జెరూసలెం హిబ్రూ విశ్వవిద్యాలయంలో చరిత్ర ప్రొఫెసర్ జోనాథన్ డెకల్ చెన్ తెలిపారు.

హోలో కాస్ట్ వివిదం ఏంటి?

హోలో కాస్ట్ అనేది ఇజ్రాయెల్ జాతీయ గుర్తింపుకు ప్రధానమైనది. హోలోకాస్ట్ సమూహం కథలు అక్కడ నిరంతరం మనకు వినిపిస్తాయి. టెల్ అవీవ్ యూనివర్సిటీ చరిత్రకారుడు హవీ డ్రీఫస్ మాట్లాడుతూ... ప్రపంచం ప్రస్తుత రోజుల్లో హోలోకాస్ట్ తిరస్కరణ, హోలోకాస్ట్ వక్రీకరణతో వ్యవహరిస్తోందని తెలిపారు. ఇక్కడ సంస్థలు, ప్రభుత్వాలు తమ సొంత అభిప్రాయాలను ముందుకు తెస్తున్నాయని చెప్పారు.

NATO Vs Putin: పుతిన్‌ చర్యలను ఎదుర్కొనేందుకు నాటో సిద్ధమా..!నాటో రష్యాకు భయపడుతోందా..?

ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ గురించి..

కొంత మంది చెబుతున్న దాని ప్రకారం ప్రస్తుతం ఇజ్రాయెల్ రష్యాతో మంచి సంబంధాలను కలిగి ఉంది. సిరియాలో లక్ష్యాలను చేధించడానికి రష్యా మీద ఆధారపడుతుంది. ఓ వైపు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి రష్యా ఉక్రెయిన్ మీద చేస్తున్న దాడిని ఖండించారు.

జెలెన్ స్కీ యూదు వ్యక్తేనా?

ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్ స్కీ ఒక యూదు. అతడి తాత ముగ్గురు సోదరులను జర్మన్ ఆక్రమణదారులు చంపేశారని ప్రచారంలో ఉంది. అటువంటి జెలెన్ స్కీని రష్యన్ అధికారులు నాజీలతో పోల్చుతున్నారని చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ దురుద్దేశాల కోసమే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇలా ఉక్రెయిన్లను నాజీలతో పోల్చుతున్నాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తాను, తన ప్రభుత్వం చేసే యుద్ధాన్ని సమర్థించుకోవడానికి పుతిన్ ఇలా చేస్తున్నాడని చెబుతున్నారు.

First published:

Tags: Russia, Russia-Ukraine War, Vladimir Putin

ఉత్తమ కథలు