Home /News /explained /

PM NARENDRA MODI INAUGURATES PM GATISHAKTI PROJECT WITH 1 LAKH CRORE RUPEES WHAT IS THIS PROGRAM GH SK

PM GatiShakti: రూ.100 లక్షల కోట్లతో పీఎం గతిశక్తి.. అసలేంటీ మాస్లర్ ప్లాన్.. పూర్తి వివరాలు

గతిశక్తిని ఆవిష్కరిస్తున్న ప్రధాని మోదీ

గతిశక్తిని ఆవిష్కరిస్తున్న ప్రధాని మోదీ

PM Gatishakti: మౌలికసదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించి సంపూర్ణ ప్రణాళిక, అమలుకు రోడ్లు, హైవేలు, రైల్వేలు, షిప్పింగ్‌, పెట్రోలియం, గ్యాస్‌ పవర్‌, టెలికాం, విమానయానం సహ 16 మంత్రిత్వ శాఖలను అనుసంధానం చేసే డిజిటల్‌ వేదికే.. పీఎం గతిశక్తి

ఇంకా చదవండి ...
దేశంలో రవాణా రంగాన్ని విస్తృతపరిచి, ప్రయాణ ఖర్చులు తగ్గించేందుకు పీఎం-గతిశక్తి  (PM Gatishakti) పేరుతో జాతీయ మాస్టర్‌ ప్లాన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఇటీవలే ఆవిష్కరించారు. దీని కిందకు 100 లక్షల కోట్ల ప్రాజెక్టులు వస్తాయని కేంద్రం చెబుతోంది. పీఎం గతి శక్తితో దేశ రూపురేఖలే మారిపోతాయని ధీమా వ్యక్తం చేస్తోంది.

పీఎం గతిశక్తి అంటే ఏంటి?

మౌలికసదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించి సంపూర్ణ ప్రణాళిక, అమలుకు రోడ్లు, హైవేలు, రైల్వేలు, షిప్పింగ్‌, పెట్రోలియం, గ్యాస్‌ పవర్‌, టెలికాం, విమానయానం సహ 16 మంత్రిత్వ శాఖలను అనుసంధానం చేసే డిజిటల్‌ వేదికే.. పీఎం గతిశక్తి. ఈ పోర్టల్‌ 200 లేయర్ల జియోస్పాటియల్‌ డేటా, ప్రస్తుతమున్న రోడ్లు, హైవేలు, రైల్వేలు, టోల్‌ ప్లాజాల వివరాలతో పాటు అడవులు, నదులు, జిల్లాల సరిహద్దులకు సంబంధించిన భౌగోళిక సమాచారాన్ని ఈ పోర్టల్ అందిస్తుంది. వీటి ఆధారంగా ప్రణాళికలు రూపొందించేందుకు, అనుమతులు పొందేందుకు ఈ సమాచారమంతా సాయపడుతుంది. బహుళ రంగాలు, బహుళ ప్రాంతాలను ప్రభావితం చేసే ప్రాజెక్టుల పురోగతిని ఒక చోటు నుంచే పర్యవేక్షించేందుకు, పనుల తీరును వివిధ ప్రభుత్వ విభాగాలు తెలుసుకునేందుకు ఈ పోర్టల్‌ వెసులుబాటు కల్పిస్తుంది. ప్రతీ విభాగానికి ఇతర విభాగం చేసే పనులు కనిపించడంతో పాటు ప్రణాళికలు రూపొందించి, ఒక సమగ్రరీతిలో అమలు చేసేందుకు కావాల్సిన కీలక సమాచారాన్ని అందించడం ఈ పోర్టల్‌ ప్రధాన ఉద్దేశం. దీని ద్వారా వివిధ విభాగాలు అవసరాలకు అనుగుణంగా తమ ప్రాజెక్టులకు ప్రాధాన్యపరుచుకునే వీలు కూడా కలుగుతుంది. ప్రాజెక్టులు పనితీరు పర్యవేక్షణకు ఇది ఉపగ్రహ చిత్రాలు కూడా అందిస్తుంది. మన దేశంలో కొత్తగా రోడ్లు వేసిన వెంటనే అక్కడ నీళ్లు పైపులో లేదా డ్రైనేజీ పైపులు వేసేందుకు దాన్ని తవ్వడం సంప్రదాయంగా మారిపోయింది. అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ సాధనకు గతిశక్తి వేదికగా నిలుస్తుంది. వివిధ విభాగాలు సమన్వయం సాధించి, ఒక బహుళ నెట్‌వర్క్‌ వ్యవస్థగా పనిచేసేందుకు గతిశక్తి వేదికగా నిలుస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. అంతే కాదు మౌలికసదుపాయాల ఏర్పాటు కాలవ్యవధిని గ్రహించి తమ కమిట్‌మెంట్స్‌ను పెట్టుబడిదారులకు తెలియజేసే సౌలభ్యం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది కల్పిస్తుంది.

Sabarimala: నేడు ఆలయం రీఓపెన్ -రేపట్నుంచి భక్తులకు -వ్యాక్సిన్, వర్చువల్ బుకింగ్ ఉంటేనే..

తగ్గనున్న రవాణా ఖర్చుల భారం

భారతదేశపు జీడీపీలో రవాణాకు సంబంధించి అంటే లాజిస్టిక్స్‌ ఖర్చులు 13-14% వరకు ఉంటాయని వివిధ అధ్యయనాలు అంచనా వేశాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ఖర్చు 7-8% మాత్రమే ఉంటుంది. లాజిస్టిక్స్‌ ఖర్చులు అధికంగా ఉండటం వలన అది ఆర్థిక వ్యవస్థపై భారంగా మారుతోంది. అంతే కాదు తమ సరుకును కొనుగోలుదారులకు చేర్చడం ఎగుమతిదారులకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారమవుతోంది. వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు సహ భారత్‌మాల, ఇన్‌లాండ్‌ వాటర్‌ వేస్‌ స్కీమ్స్‌, టెక్స్‌టైల్‌, ఫార్మూసూటికల్‌, ఎలక్ట్రానిక్స్‌ పార్క్స్‌ వంటి ఆర్థిక మండళ్లలకు సంబంధించి వివిధ మౌలికసదుపాయల ప్రాజెక్టులన్నీ దీని ద్వారా ఒక చోటుకు చేరుతాయి. చివరి మైలు కనెక్టివిటీ అందించి, సమగ్ర ప్రణాళికల ద్వారా లాజిస్టిక్స్‌ ఖర్చులు తగ్గించడం, అమల్లో ఉండే ఓవర్‌ల్యాప్స్‌ను తగ్గించేందుకు గతిశక్తి వేదిక కృషి చేస్తుంది. మల్టీ మోడల్‌ కనెక్టివిటీ సమర్ధవంతంగా లేకపోవడం వలన దేశంలో ప్రస్తుతం అనేక ఆర్థిక మండళ్లు, ఇండస్ట్రీయల్‌ పార్కులు పూర్తిస్థాయిలో తన ఉత్పాదకతను అందించలేకపోతున్నాయి.

Manmohan Singh Family: కేంద్ర మంత్రి తీరుపై మన్మోహన్ సింగ్ కుటుంబం అభ్యంతరం.. ఇలాగేనా చేసేది..

నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ పర్యవేక్షణ విధానం

అన్ని మౌలికసదుపాయాల మంత్రిత్వ శాఖలకు లక్ష్యాలు నిర్దేశించింది నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌.2020లో భారతదేశంలోని అన్ని రేవులు 1282 MTPA కార్గోను హ్యాండిల్‌ చేశాయి. దీన్ని 2024-25 నాటికి 1,759MTPAకి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు. దీంతో పాటు దేశీయ వాటర్‌వేస్‌లో ప్రస్తుతం 74 మిలియన్‌ టన్నులుగా ఉన్న కార్గోను 95 మిలియన్‌ టన్నులు పెంచేలా కృషి చేయాలని భావిస్తున్నారు. రానున్న 4-5 సంవత్సరాల్లో దేశంలో కొత్తగా 200 విమానాశ్రయాలు, హెలీప్యాడ్లు, వాటర్‌ ఏరోడ్రోమ్‌ ఏర్పాటు చేయనున్నామని ప్రదాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతే కాదు ప్రస్తుతం 19,000 కి.మీగా ఉన్న సహజ వాయువు గ్యాస్‌ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ను రెట్టింపు చేయాలన్నది లక్ష్యం. డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ప్రమోషన్‌ ఆఫ్ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (DPIIT) ఏర్పాటు చేసే ప్రాజెక్టు పర్యవేక్షణ బృందం కీలక ప్రాజెక్టుల పురోగతనిని రియల్‌ టైమ్‌లో మానిటర్ చేస్తూ ఉంటుంది. వివిధ మంత్రిత్వశాఖల మధ్య ఏమైనా సమస్యలు ఉన్నట్టు అయితే వాటిని మంత్రుల బృందానికి నివేదిస్తుంది.

Scholarship: ఆ విద్యార్థులకు ఏఐసీటీఈ సాక్షం స్కాలర్‌షిప్.. ఎంపికైతే ఏటా రూ.50 వేలు స్టైఫండ్

గతిశక్తి పోర్టల్‌లో రాష్ట్రాలకు స్థానం ఉంటుందా?

ఖర్చులు తగ్గించుకునేందుకు, సమయాన్ని ఆదా చేసేందుకు గతిశక్తి పోర్టల్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు సాయపడుతుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. దీని ద్వారా విలువైన మౌలికసదుపాయాలు ఆయా రాష్ట్రాల ప్రజలకు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. గతిశక్తి పోర్టల్‌కు సంబంధించి ఎన్‌డీఎ పాలిత రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎంక్వైరీలు వచ్చాయని తెలిపారు.

ప్రాజెక్టులకు సంబంధించిన వివిధ మంత్రిత్వశాఖలకు సమస్యలను ప్రస్తుతం మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖల సమావేశాల్లో చర్చించి పరిష్కరించడం జరుగుతుంది. పీఎం ప్రగతి (ప్రొ-యాక్టివ్‌ గవర్నెన్స్‌ అండ్‌ టైమ్లీ ఇంప్లిమెంటేషన్‌) పోర్టల్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ సమావేశాల కంటే ముందే సమస్యలు పరిష్కారమవుతున్నాయని గోయల్‌ వివరించారు. మంత్రిత్వ శాఖలు నిరంతరం టచ్‌లో ఉంటాయి కాబట్టి మానవ జోక్యపు అవసరం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉదాహరణకు ఒక సొరంగాన్ని రోడ్డు కోసం తవ్వుతారు, మరో సొరంగాన్ని రైల్వేల కోసం తవ్వుతారు, కాని ఇప్పుడు ఈ వేదిక వచ్చిన తర్వాత అన్ని మంత్రిత్వ శాఖలు సమన్వయంతో అందరి అవసరాలు తీర్చేలా ఒక పెద్ద సొరంగాన్ని నిర్మించుకుంటాయని గోయల్‌ అన్నారు. దీని ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం ఆదా అవుతుందని తెలిపారు.

Maoist leader RK: ఆర్కే మృతి నిజమే.. మావోయిస్ట్ పార్టీ అధికారిక ప్రకటన

కొత్తగా నిర్మించే ఒక రైల్వే లైనుకు సంబంధించిన ఓవర్‌ పాస్‌ నిర్మాణానికి రహదారుల మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేయగానే విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఈ లైనులు విద్యుత్‌ అందించే పనులు వెంటనే చేపట్టవచ్చని గోయల్‌ వెల్లడించారు.

గతిశక్తి పోర్టల్‌ను భాస్కరాచార్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ అప్లికేషన్స్ అండ్‌ జీయోఇన్ఫార్మామ్యాటిక్స్‌ (BISAG-N) రూపొందించింది. ఈ పోర్టల్‌ ద్వారా కలిగిన ఒక ప్రయోజనాన్ని ఈ సంస్థ డైరెక్టర్‌ టి.పి.సింగ్‌ వివరించారు. పోర్టల్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమీక్షించి ఇటీవలి ఒక రైల్వే లైన్‌ నిర్మాణ మార్గాన్ని స్వల్పంగా మార్చడం జరిగింది. ఈ కారణంగా అటవీ అనుమతులు తీసుకోవాల్సిన సమస్య తొలగిపోయిందని వివరించారు.

Mohan Bhagwath: ఓటీటీలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు

కొత్తగా చేపట్టే ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించి ఆయా ప్రదేశాలకు అవసరమైన అనుమతులను ఈ పోర్టల్‌ హైలైట్ చేస్తుంది. ఆ అనుమతులు కోరుతూ నేరుగా సంబంధిత అధికారులకు ఈ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Infrastructure, PM Gatishakti, PM Narendra Modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు