• Home
  • »
  • News
  • »
  • explained
  • »
  • PI NETWORK NOW YOU CAN GET PI COIN FREELY AND GET EXPERIENCE ABOUT CRYPTOCURRENCY AND DIGITAL CURRENCY HERE IS HOW TO JOIN NK

Pi Network: పై క్రిప్టోకరెన్సీ... ఫ్రీగా పై కాయిన్లు సంపాదించాలా... ఇదిగో బంపర్ ఆఫర్

పై క్రిప్టోకరెన్సీ... ఫ్రీగా పై కాయిన్లు సంపాదించాలా... ఇదిగో బంపర్ ఆఫర్ (image credit - google play store)

Pi Network: బిట్‌కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలు ఇప్పుడు చాలా వచ్చేశాయి. వాటిలో ఒకటి పై కాయిన్. పైసా ఖర్చు లేకుండా... ఫ్రీగానే రోజూ పై కాయిన్లు సంపాదించే ఆఫర్ కంపెనీ ఇచ్చింది అదెలాగో తెలుసుకుందాం.

  • Share this:
    Pi Network: ఈ రోజుల్లో క్రిప్టోకరెన్సీ లేదా డిజిటల్ కరెన్సీ వాడకం క్రమంగా పెరుగుతోంది. తాము కూడా క్రిప్టోకరెన్సీ కొనాలనీ, బిట్ కాయిన్ల లాంటివి కొనాలని చాలా మంది యువత అనుకుంటున్నారు. కానీ అది ఎలాగో తెలియక కొంత ఇబ్బంది పడుతున్నారు. ఐతే... బిట్ కాయిన్ ధర లక్షల్లో ఉంటుంది కాబట్టి... దాన్ని కొనలేకపోయినా... పై నెట్‌వర్క్... పై కాయిన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ పై కాయిన్ కొనాల్సిన పనిలేదు. కంపెనీయే ఫ్రీగా ఇస్తోంది. ఇందుకోసం చిన్న కండీషన్ పెట్టింది. తమ పై నెట్‌వర్క్ యాప్ డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ చేసుకొని, రిజిస్టర్ అయ్యి... రోజుకోసారి యాప్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. అలా... రోజూ ఓపెన్ చేయడం ద్వారా... పై కాయిన్లు లభిస్తాయి. యాప్ (https://minepi.com/999kk) ఓపెన్ చేశాక... పై సింబల్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చెయ్యాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే చాలు... పై కాయిన్లు సంపాదించవచ్చు.

    రిజిస్టర్ అయ్యేందుకు కోడ్:
    పై నెట్‌వర్క్‌లో అందరికీ రిజిస్టర్ అయ్యే ఛాన్స్ లేదు. ఎవరైనా ఇన్విటేషన్ కోడ్ ఇస్తే... ఆ కోడ్ ద్వారా మాత్రమే చేరేందుకు వీలు ఉంది. ముందుగా యాప్ ఇన్‌స్టాల్ చేశాక... మొబైల్ నంబర్ ద్వారా రిజిస్టర్ అవ్వొచ్చు. అప్పుడు ఇన్విటేషన్ కోడ్ (invitation code) అడుగుతుంది. అప్పుడు 999kk అనే ఇన్విటేషన్ కోడ్ ఇవ్వొచ్చు. కోడ్ ద్వారా చేరిన వెంటనే... కుడివైపున పై సింబల్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చెయ్యమని కోరుతారు. దానిపై 3 సెకండ్లు వేలు ఉంచితే... అది యాక్టివ్ అవుతుంది. వెంటనే మీకు 0.02 పై కాయిన్లు లభిస్తాయి. ఇలా రోజూ పై సింబల్‌ని ట్యాప్ చేస్తూ ఉంటే... మీకు మరిన్ని పై కాయిన్లు లభిస్తూ ఉంటాయి. ఇలా మీకంటూ... సొంత క్రిప్టోకరెన్సీ అనేది ఉంటుంది. మీరు మరింత ఎక్కువ కాయిన్లు సంపాదించాలి అనుకుంటే... మీ ఇన్విటేషన్ కోడ్ ద్వారా మరింత మందిని జాయిన్ చేయిస్తే... మరిన్ని ఎక్కువ కాయిన్లు మీకు దక్కుతాయి. మీ ఇన్విటేషన్ కోడ్... యాప్‌లో ఉంటుంది.

    criptocurrency
    పై క్రిప్టోకరెన్సీ... ఫ్రీగా పై కాయిన్లు సంపాదించాలా... ఇదిగో బంపర్ ఆఫర్ (image credit - google play store)


    పై నెట్‌వర్క్ అంటే:
    బిట్ కాయిన్ లాంటిదే పై నెట్‌వర్క్ కాయిన్ కూడా. ప్రస్తుతం మిగతా డిజిటల్ కరెన్సీల లాగే... పై కాయిన్ విలువ కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఎక్కువ మంది పై నెట్‌వర్క్‌లో చేరుతున్న కొద్దీ... కాయిన్ విలువ పెరుగుతోంది. ఇప్పుడు ఈ కరెన్సీని సంపాదించుకునేవారికి భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయని అంటున్నారు. ఒకప్పుడు బిట్ కాయిన్ కూడా అంతగా విలువ లేనిదే. ఇప్పుడు అది అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది. ఒక్క బిట్ కాయిన్ ధర ఇప్పుడు రూ.27 లక్షలకు పైగా ఉంది.


    పై నెట్‌వర్క్ మోసం చేస్తుందా?
    పై నెట్‌వర్క్ ప్రస్తుతానికి ప్రజల నుంచి ఎలాంటి డబ్బూ అడగట్లేదు. యాప్‌లో ఫ్రీగానే పై కాయిన్లు సంపాదించుకునే అవకాశం ఇచ్చింది. అందువల్ల ఇది మల్టీలెవెల్ మార్కెటింగ్ (MLM) లాంటి మోసం కాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఐతే... ఎప్పుడైనా సరే... డబ్బు అడిగితే మాత్రం... ఈ యాప్‌ని నమ్మాల్సిన పనిలేదు. డబ్బు అడగనంతకాలం... దీన్ని నమ్మవచ్చు అంటున్నారు.

    పై కాయిన్లతో సామాన్లు కొనుక్కోవచ్చా?
    2019లో మొదలైన పై నెట్‌వర్క్ ఇప్పుడు యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఇది రోజురోజుకూ డెవలప్‌ అవుతోంది. ప్రస్తుతానికి ఇందులో కోటి మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరంతా రోజూ కాయిన్ విలువను పెంచుతున్నారు. అయితే... ఇప్పుడు పై కాయిన్లు సంపాదించుకునేవారు వాటితో సామాన్లు కొనుక్కునే అవకాశం ఇప్పుడు లేదు. 2025 నుంచి ఈ అవకాశం లభించవచ్చని అంటున్నారు. అసలు డిజిటల్ కరెన్సీతో ఏమాత్రం ఎక్స్‌పీరియన్స్ లేని వారికి ఈ ఫ్రీ యాప్ పై కాయిన్... క్రిప్టోకరెన్సీపై అవగాహన కలిగించేందుకు ఉపయోగపడుతుంది అంటున్నారు.

    (Disclaimer: The material provided on this page is for information purposes only and should not be understood as an investment advice. Any opinion that may be provided on this page does not constitute a recommendation by telugu.news18.com We do not make any representations or warranty on the accuracy or completeness of the information that is provided on this page. If you rely on the information on this page then you do so entirely on your own risk.)
    Published by:Krishna Kumar N
    First published: