PF CALCULATOR HOW IS PROVIDENT FUND CALCULATED KNOW ABOUT PF CALCULATION FORMULA HERE GH PVN
Explained: ప్రావిడెంట్ ఫండ్‌ను ఎలా లెక్కిస్తారు..పీఎఫ్ లెక్కింపు ఫార్ములా గురించి పూర్తి వివరాలు ఇవే
ప్రతీకాత్మక చిత్రం
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 1952లోని 60వ పారా పీఎఫ్ కాంట్రిబ్యూషన్లపై వడ్డీ లెక్కలకు సంబంధించిన నియమాలను పేర్కొంది. వడ్డీని లెక్కించేటప్పుడు ఉద్యోగి పీఎఫ్ అకౌంట్ నెలవారీ బ్యాలెన్స్‌ను పరిగణలోకి తీసుకుంటారు.
Provident Fund : భారత్‌లో దాదాపు వేతన జీవులందరికీ (Salaried Individuals) ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Employees Provident Fund Organisation)లో ఖాతా ఉంటుంది. ఈ ఎంప్లాయిస్ పీఎఫ్ పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ఆదాయ వనరు (Source Of Income)గా సహాయపడుతుంది. ఈ పథకంలో భాగంగా ప్రతి నెలా ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తంలో డబ్బు సేకరించి ఆ మొత్తాన్ని పదవీ విరమణ తర్వాత జమ చేస్తారు. ప్రతినెలా అదే మొత్తంలో ఉద్యోగి కంపెనీ కూడా పీఎఫ్ అకౌంట్లో జమ చేస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అనేది ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత నగదు అందించేందుకు కేంద్రం రూపొందించిన ఒక రిటైర్మెంట్ పథకం.
ఉద్యోగి మినిమం మంత్లీ కాంట్రిబ్యూషన్ వారి బేసిక్ శాలరీలో 12 శాతంగా ఉంటుంది. అయితే ఉద్యోగులు తమ బేసిక్ శాలరీలో 100 శాతం వరకు కాంట్రిబ్యూట్ కూడా చేయొచ్చు. అయితే, ఉద్యోగి 100% శాలరీని కాంట్రిబ్యూట్ చేసినా యజమాని మినిమం మంత్లీ కాంట్రిబ్యూషన్ 12 శాతం పీఎఫ్‌లో జమ చేసుకోవచ్చు. రెండు కాంట్రిబ్యూషన్లు కలిపిన తర్వాత ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు వడ్డీ మొత్తాన్ని జమ చేస్తారు.
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 1952లోని 60వ పారా పీఎఫ్ కాంట్రిబ్యూషన్లపై వడ్డీ లెక్కలకు సంబంధించిన నియమాలను పేర్కొంది. వడ్డీని లెక్కించేటప్పుడు ఉద్యోగి పీఎఫ్ అకౌంట్ నెలవారీ బ్యాలెన్స్‌ను పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుతానికి, ప్రభుత్వం ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్లపై 8.5 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్, ఒక ఏడాదిలో చేసిన కాంట్రిబ్యూషన్లు, ఒక ఏడాదిలో చేసిన విత్‌డ్రాలు అనే మూడు ప్రధాన అంశాల ఆధారంగా పీఎఫ్‌ను లెక్కిస్తారు. 12 నెలల వడ్డీని ప్రస్తుత సంవత్సరంలో విత్‌డ్రా చేసిన మొత్తాన్ని మైనస్ చేసి గతేడాది చివరి తేదీ నాటికి పీఎఫ్ మొత్తం క్లోజింగ్ బ్యాలెన్స్ ఆధారంగా అందిస్తారు.
పీఎఫ్ కాలిక్యులేషన్ ఫార్ములా
ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును తెలియజేశాక... ప్రస్తుత సంవత్సరం ముగిసిన తర్వాత... ఈపీఎఫ్ఓ సంస్థ నెలవారీ క్లోజింగ్ బ్యాలెన్స్‌ను లెక్కిస్తుంది. దీని తర్వాత, ప్రతి నెలా రన్నింగ్ బ్యాలెన్స్ జోడించి... అంతకు ముందు సంవత్సరానికి మొత్తం వడ్డీ లెక్కిస్తుంది.
అప్పుడు ఆ మొత్తాన్ని వడ్డీ రేటుతో గుణించి... ఆపై 1,200తో భాగిస్తుంది. ఉదాహరణకు, వడ్డీ రేటు 8.1 శాతంగా ఉంటే... నెలవారీ బ్యాలెన్స్ మొత్తం రూ.10,00,000 అయితే, వడ్డీ మొత్తం 1104740x 8.1/1200= రూ. 6,750 అవుతుంది. ఇంకా, ఓపెనింగ్ బ్యాలెన్స్, కాంట్రిబ్యూషన్లను యాడ్ చేసి ఆపై విత్‌డ్రాలు, వడ్డీని తీసివేయడం ద్వారా ఆ సంవత్సరం క్లోజింగ్ బ్యాలెన్స్ కాలిక్యులేట్ చేస్తుంది. ఒక ఖాతాదారుడు ఫైనల్ తుది సెటిల్మెంట్ను తీసుకుంటే, సెటిల్మెంట్ మొత్తంలో లెక్కించిన వడ్డీ పొందుతారు. ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీ షేర్, ఎంప్లాయర్ షేర్లు విడివిడిగా కాలిక్యులేట్ చేస్తారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.