Provident Fund: ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారికి PF అకౌంట్‌గురించి చెప్పాల్సిన పని లేదు. నెలవారీ జీతం నుంచి కొంత మొత్తం వారి PFఅకౌంట్లో జమ అవుతుంది. అంతే మొత్తం యాజమాన్యం కూడా పీఎఫ్ఖాతా (PF Account)లో జమచేస్తుంది. ఈ మొత్తానికి వడ్డీ కూడా లభిస్తుంది. కష్ట సమయంలో ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే చాలా మంది కెరీర్వృద్ధి కోసం ఉద్యోగాలు మారుతుంటారు. గతంలో అలాంటి వారు కొత్త ఈపీఎఫ్అకౌంట్(EPF Account) ఓపెన్ చేసేవారు. మరి పాత అకౌంట్సంగతేంటి? దానిలో ఉన్న డబ్బు పరిస్థితి ఏంటి? ఆ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చా? అనే సందేహాలు వారిలో వ్యక్తమయ్యేవి. అయితే ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం ఏంటంటే.. మీ EPFఅకౌంట్లను విలీనం చేయడం.
EPFO అందించే బెనిఫిట్స్పూర్తిస్థాయిలో పొందాలంటే ఈపీఎఫ్అకౌంట్ను ట్రాన్స్ఫర్ చేయడమే ఉత్తమ మార్గం అని నిపుణులు చెబుతున్నారు. ఒకే అకౌంట్మెయింటేన్చేయడం ద్వారా కన్ఫ్యూజన్ కూడాఉండదు. అంతేకాక మీ ఈపీఎఫ్డబ్బు మొత్తం ఒకే అకౌంట్లో ఉంటాయి. తద్వారా ఎక్కువ వడ్డీ, ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. మల్టిపుల్ UAN నంబర్లు కాకుండా ఒకే UAN నంబర్‌తో PF అకౌంట్మెయింటేన్చెయ్యవచ్చు.
UANలను విలీనం చేసే విధానం:
ఖాతా ఉన్నవారు రెండు UANలను "విలీనం" చేయడానికి రెండు మార్గాలున్నాయి. ముందుగా EPFO UAN పోర్టల్ (https://unifiedportal-mem.epfindia.gov.in)కు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక, పాత UANతో లింక్ చేసిన EPF ఖాతాలను కొత్త ఖాతాకు ట్రాన్స్ఫర్చేయమని రిక్వెస్ట్పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక, మీ పాత UANను నిలిపివేస్తారు. ఆ తరువాత పాత EPFO అకౌంట్ఇనాక్టివ్ అయిన విషయాన్ని మెసేజ్ ద్వారా ధ్రువీకరించుకోవచ్చు.
రెండో పద్ధతిని పరిశీలిస్తే.. ఇది కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒక ఉద్యోగికి రెండు UAN నంబర్లు ఉంటే.. వాటిని విలీనం చేసేందుకు ప్రస్తుత యజమానికి లేదా EPFOకి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. దీని కోసం uanepf@epfindia.gov.in కు ఈ-మెయిల్ పంపాలి. ఆ తరువాత మీ పాత UANని బ్లాక్ చేస్తారు. తర్వాత మీ కొత్త EPF ఖాతాకు UAN బదిలీ అవుతుంది. దీని కోసం క్లెయిమ్ట్రాన్స్ఫర్సమర్పించాలి. ఇలా మీ అకౌంట్‌ను బదిలీ చేయడానికి ముందు, మీ KYC అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EPFO, UAN number