హోమ్ /వార్తలు /Explained /

Petrol Rate: పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్ తగ్గించేందుకు కొన్ని రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

Petrol Rate: పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్ తగ్గించేందుకు కొన్ని రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ తయారు చేసిన ప్రతిపాదనల్లో నాలుగు పనిదినాలు, మూడు సెలవులు ఉండాలనేది ఒకటి. దీనితో సగటు ఇంధనం ఆదా నెలకు 12.2 కోట్లుగా అంచనా వేయబడింది. ఇది సంవత్సరానికి $1.5 బిలియన్లకు చేరుకోవచ్చు. 90 శాతం ఇంధనం పనిదినాల్లోనూ, మిగిలిన 10 శాతం సెలవు దినాల్లోనూ నెలలో వినియోగిస్తుండటం గమనార్హం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ తయారు చేసిన ప్రతిపాదనల్లో నాలుగు పనిదినాలు, మూడు సెలవులు ఉండాలనేది ఒకటి. దీనితో సగటు ఇంధనం ఆదా నెలకు 12.2 కోట్లుగా అంచనా వేయబడింది. ఇది సంవత్సరానికి $1.5 బిలియన్లకు చేరుకోవచ్చు. 90 శాతం ఇంధనం పనిదినాల్లోనూ, మిగిలిన 10 శాతం సెలవు దినాల్లోనూ నెలలో వినియోగిస్తుండటం గమనార్హం.

Petrol Price: పెట్రోల్‌, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ సుంకాలు, రోడ్లు, మౌలిక సదుపాయాల సెస్ తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన చేసిన అనంతరం ఎన్డీయే పాలిత రాష్ట్రాలు వ్యాట్ రేట్లను అదే స్థాయిలో తగ్గించాయి. అయితే కొన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గించేందుకు ముందుకు రావడం లేదు.

ఇంకా చదవండి ...

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ (Petrol Price)పై రూ.5, డీజిల్‌ (Diesel Rate)పై రూ.10 మేర పన్నులు తగ్గించిన తరువాత బీజేపీ (BJP), ఎన్డీయే  (NDA)కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించాయి. తమ ప్రత్యర్థులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా వ్యాట్ తగ్గించాలని ఈ వర్గాలు ఒత్తిడి పెంచుతున్నాయి. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ (West Bengal), తమిళనాడు (Tamilnadu), కేరళ (Kerala), రాజస్థాన్ (Rajastan), తెలంగాణ (Telangana), ఏపీ (Andhra Pradesh) రాష్ట్రాల్లో ఇంకా వ్యాట్ తగ్గించలేదు. అయితే వాల్యూ యాడెడ్ టాక్స్ (VAT) కొంతమేర తగ్గించేందుకు రాష్ట్రాలు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ సుంకాలు, రోడ్లు, మౌలిక సదుపాయాల సెస్ తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన చేసిన అనంతరం ఎన్డీయే పాలిత రాష్ట్రాలు వ్యాట్ రేట్లను అదే స్థాయిలో తగ్గించాయి. అయితే కొన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గించేందుకు ముందుకు రావడం లేదు. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించడం వల్ల వ్యాట్ ఆదాయం కూడా తగ్గిపోవడమే ఇందుకు కారణం.

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం వల్ల, సహజంగానే వ్యాట్ ద్వారా రాష్ట్రాలకు వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది. దీంతో అక్కడి అధికార వర్గాలు ఆలోచనలో పడ్డాయి. ఉదాహరణకు కేంద్రం ఇంధన ధరలు తగ్గించినా ఢిల్లీ ప్రభుత్వం వ్యాట్ ఏ మాత్రం తగ్గించలేదు. లీటరు పెట్రోల్‌పై రూ.1.30, డీజిల్‌పై రూ.1.70 చొప్పున వసూలు చేస్తోంది.

Kishan reddy : ధర్నాలు, నాలుకలు చీలుస్తామంటే భయపడేవారు ఎవరు లేరు..

పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం పెరగకుండా వ్యాట్ తగ్గిస్తే రాష్ట్రాల ఆదాయం తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గించడంతో దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. చాలా రాష్ట్రాలు సంక్షేమ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకంపై ఆధారపడుతున్నాయి. అనేక రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్ ద్వారా పొందే ఆదాయం వారి మొత్తం ఆదాయంలో 20 శాతంగా ఉంది.

కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఎక్సైజ్ సుంకాల్లో రాష్ట్రాలకు వాటా లభిస్తుంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఎక్సైజ్ డ్యూటీ పంపకానికి ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి డివల్యూషన్ ఫార్ములా (devolution formula)ను ప్రకటిస్తుంది. ఈ ప్రకారం పంపకాలు ఉంటాయి.

CM KCR మాటలు నిజం చేస్తారా? -జనవరి 26 తర్వాత మామూలుగా ఉండదు :revanth reddy

* బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ

బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ లీటరు పెట్రోల్‌పై 2014 డిసెంబరులో రూ.5 ఉండగా, డీజిల్‌పై రూ.4 ఉంది. 2016 నాటికి పెట్రోల్‌పై లీటరుకు రూ.9కి చేరింది. డీజిల్‌పై రూ.11 దాటింది. 2021 నాటికి బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ లీటరు పెట్రోల్‌పై రూ.1.40, డీజిల్‌పై రూ.1.80 చొప్పున తగ్గించారు. దీంతో కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గింది.

కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ లెవీని మార్చడంతో రాష్ట్రాల వాటా గత కొన్నేళ్లుగా దారుణంగా తగ్గిపోయింది. దీంతో కేంద్రం వసూలు చేసే పన్నుల నుంచి కొద్ది భాగం మాత్రమే రాష్ట్రాలకు వస్తోంది. లీటరు పెట్రోల్‌పై కేంద్రం రూ.32.90 ఎక్సైజ్ డ్యూటీ, సెస్ వసూలు చేస్తోంది. అయితే ఇందులో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ లీటరుకు రూ.1.40 మాత్రమే కావడం గమనార్హం. దీనిపై మాత్రమే రాష్ట్రాలకు వాటా వెళ్తుంది. లీటరు డీజిల్‌పై కేంద్రం రూ.31.80 పన్నులు వసూలు చేస్తున్నా, ఇందులో ప్రైమరీ ఎక్సైజ్ డ్యూటీ కేవలం రూ.1.80 మాత్రమే. ఇంధన ధరలు తగ్గించిన తరువాత కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై రూ.27.90, డీజిల్‌పై రూ.21.80 ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తోంది.

Vande Bharat Express: కొత్త ఏడాదిలో పట్టాలెక్కనున్న మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్

2015-16 కేంద్ర బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పెట్రోలియం ఉత్పత్తుల ఎక్సైజ్ సుంకాలపై భారీ మార్పులు చేశారు. ఎక్సైజ్ డ్యూటీలో రూ.4ను రోడ్ సెస్సుగా మార్చారు. దీంతో రోడ్ సెస్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ లీటరుపై రూ.2 నుంచి రూ.6కు పెరిగింది. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రం లీటరుపై రూ.3.50 నుంచి రూ.3.70దాకా తగ్గింది.

14వ ఆర్థిక సంఘం కేంద్ర ఎక్సైజ్ సుంకాల నుంచి రాష్ట్రాలకు చెల్లించే వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పెంచడం పక్కనబెట్టి, సెస్, సర్ ఛార్జీలను పెంచడం ప్రారంభించింది. దీనికి ముందు 2014, 2015 జనవరి మధ్య నాలుగు దఫాలుగా బేసిక్ ఎక్సైజ్ సుంకాన్ని లీటరు పెట్రోల్‌పై రూ.6.25, డీజిల్‌పై రూ.5 వరకు పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి ఇంధన ధరలు తగ్గినా అప్పట్లో కేంద్రం బేసిక్ ఎక్సైజ్ సుంకాన్ని పెంచి ప్రయోజనం పొందింది.

2015, 2016 జనవరి మధ్య కాలంలో కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌పై నాలుగు సార్లు బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు. ఆ తరువాత 2015- 2016 నవంబరు మధ్య కాలంలో ఐదు సార్లు పెంచారు. దీంతో మొత్తం మీద మూడుసార్లు తగ్గించినట్టయింది. 2018-19 బడ్జెట్లో లీటరు ఇంధనంపై రూ.2 తగ్గించి, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ పెంచారు. దీనికే రోడ్, మౌలిక సదుపాయాల సెస్ అని పేరుపెట్టారు. లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై ఈ సెస్‌ను రూ.8కి పెంచారు. ఆర్థిక వ్యవస్థ మందగించడంతో 2019-20 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లీటరుపై అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, రోడ్, మౌలిక సదుపాయాల సెస్ మరో రూపాయి పెంచారు. దీంతో లీటరు పెట్రోల్‌పై రూ.19.98, డీజిల్‌పై రూ.21.83 మొత్తం ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేసినా, ఇందులో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ లీటరుపై రూ.2.98, డీజిల్‌పై రూ.4.93గా ఉంది.

ఫోన్‌పే నుంచి మోటార్ ఇన్సూరెన్స్.. లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్‌తో ఆన్‌లైన్‌లోనే పాలసీ

అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ

2015 మార్చిలో లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ రూ.2 ఉండగా, 2020 మే నాటికి రూ.18కి పెంచారు. తాజాగా 2021 నవంబరులో అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ లీటరు పెట్రోల్‌పై రూ.12.50, డీజిల్‌పై రూ.8గా ఉంది.

2020 మార్చిలో కోవిడ్ మహమ్మారి కారణంగా కేంద్ర ఆదాయం తగ్గడంతో రోడ్, మౌలికసదుపాలయాల సెస్ మరో రూపాయి పెంచారు. అదే సమయంలో స్పెషల్ అడిషనల్ డ్యూటీలు కూడా పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పెట్రోల్‌, డీజిల్‌పై వ్యవసాయ మౌలికసదుపాయల అభివృద్ధి సెస్ విధించారు.

ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో విచిత్రమైన రూల్స్.. కంపెనీలు తిరస్కరించిన ఐదు వింత  సందర్భాలు

స్పెషల్ అడిషన్ ఎక్సైజ్ డ్యూటీ

2019లో లీటరు పెట్రోల్‌పై రూ.7, డీజిల్‌పై రూ.1 స్పెషల్ అడిషన్ ఎక్సైజ్ డ్యూటీ విధించారు. 2021 ఫిబ్రవరి నాటికి అది లీటరు పెట్రోల్‌పై రూ.11, డీజిల్‌పై రూ.8కి పెరిగింది.

కరోనా సమయంలో ఆదాయాలు తగ్గిపోవడంతో కొన్ని రాష్ట్రాలు కూడా వ్యాట్ పెంచాయి. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు పెంచడంతో ఇంధన ధరలు దూసుకుపోయాయి. దీంతో బీజేపీ, బీజేపీతో పొత్తుపెట్టుకున్న పార్టీలు (ఎన్డీయే).. బీజేపీయేతర పార్టీలు పాలన సాగిస్తున్న రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి.

First published:

Tags: Diesel, Diesel price, Fuel prices, Petrol, Petrol Price

ఉత్తమ కథలు