Home /News /explained /

PERSONAL LOAN VS CAR LOANS FAQS ADVANTAGES AND DISADVANTAGES CHECK ALL DETAILS BA

పర్సనల్ లోన్, కార్‌ లోన్‌ మధ్య తేడాలేంటి? కారు కొనడానికి ఏది బెస్ట్? రెండింట్లో లాభాలు, నష్టాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Personal Loan vs Car Loan FAQs | మార్కెట్లోకి నెలకో కొత్త కారు వస్తోంది. మీరు కూడా కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే, ఏ లోన్ అయితే బెటర్ అని ఆలోచిస్తున్నారా? పర్సనల్ లోన్, కార్ లోను ఈ రెండింటిలో ఏది బెటర్ అనేది ఈ స్టోరీలో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    కస్టమర్ల అవసరాలకు తగ్గట్లు వివిధ రకాల లోన్లను బ్యాంకులు అందిస్తున్నాయి. వ్యక్తిగత అవసరాలకు, ఇల్లు (Home Loan) లేదా ఆస్తుల కొనుగోలుకు, కారు కోసం.. ఇలా ప్రత్యేక అవసరాలకు ప్రత్యేకమైన లోన్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా కారు కొనేందుకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు చాలామంది బ్యాంకు రుణాలు తీసుకోవాలనుకుంటారు. అయితే ఇందుకు వ్యక్తిగత రుణాలతో (Personal Loans) పాటు కార్ లోన్లు (Car Loans) కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. ఈ రెండు రకాల లోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉండే అతిపెద్ద, అత్యంత సాధారణ ఫైనాన్సింగ్ ఆప్షన్లు.

    పర్సనల్ లోన్‌ను ఎలాంటి అవసరాల కోసమైనా ఉపయోగించవచ్చు. వ్యక్తిగత రుణాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవు. అయితే కారు కొనుగోలుకు ప్రత్యేకంగా కార్ లోన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ విషయంలో చాలామంది గందరగోళానికి గురవుతారు. ఈ నేపథ్యంలో కార్ లోన్, పర్సనల్ లోన్ల లాభనష్టాలు.. వీటి మధ్య ఉండే తేడాలేంటో తెలుసుకుందాం.

    Airtel Rs 99 Plan: ఎయిర్‌టెల్ నుంచి రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే



    పర్సనల్ లోన్లు

    లాభాలు:
    వ్యక్తిగత రుణాల విషయంలో నిధుల వినియోగానికి సంబంధించి ఎలాంటి పరిమితులు లేవు. లోన్ మొత్తాన్ని కస్టమర్లు ఎలాంటి అవసరాలకైనా ఉపయోగించుకోవచ్చు. రుణాల చెల్లింపుల విషయంలో ఉన్న సౌలభ్యం కారణంగా కస్టమర్లపై ఎలాంటి ఒత్తిడి పడదు.

    ప్రతికూలతలు:
    ఇది అన్‌సెక్యూర్డ్ లోన్ ప్రొడక్ట్. అందువల్ల పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత రుణాలు మరింత కఠినమైన రుణ ప్రమాణాలతో వస్తాయి. పర్సనల్ లోన్ అర్హతను నిర్ధారించడంలో క్రెడిట్ స్కోర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

    Discount On Cars: కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? జనవరి 1 కంటే ముందే కొనండి.. భారీ డిస్కౌంట్లు


    కార్ లోన్లు

    లాభాలు:
    కార్ లోన్లను కేవలం కారు కొనుగోలుకు మాత్రమే అందిస్తారు. సాధారణంగా వీటిపై తక్కువ వడ్డీ రేటు ఉంటుంది. కార్ లోన్‌ను సులభంగా పొందవచ్చు. ఇది సురక్షితమైన లోన్ ఆప్షన్ కాబట్టి.. మధ్యస్థమైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారు కూడా లోన్‌కు అర్హత పొందే అవకాశం ఉంది. కార్ లోన్‌కు వాహనం ఒక సెక్యూరిటీగా పనిచేస్తుంది.

    ప్రతికూలతలు:
    కార్ లోన్ కోసం డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. లోన్‌కు సంబంధించిన అన్ని చెల్లింపులు పూర్తయిన తర్వాత మాత్రమే కారుపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయి. అవసరాలు, కొనుగోలు చేసే కారు మోడళ్లను బట్టి వివిధ లోన్ ప్రొడక్ట్స్‌ను పోల్చుకున్న తరువాతే వీటిని ఎంచుకోవడం మంచిది.

    Toyota C+pod: టొయోటా నుంచి టూ-సీటర్ కార్... టాటా నానో కన్నా చిన్న మోడల్ (Photos)


    పర్సనల్ లోన్, కార్ లోన్ మధ్య తేడాలు
    ఇటీవలి కాలంలో పర్సనల్ లోన్‌ను ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. పెద్ద మొత్తంలో చేపట్టే కొనుగోళ్లకు నిధులు సమకూర్చడానికి చాలామంది ఈ వ్యక్తిగత రుణాలను మంచి ఆప్షన్‌గా భావిస్తున్నారు. పర్సనల్ లోన్ అనేది వ్యక్తుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి బ్యాంక్ లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అందించే అన్-సెక్యూర్డ్ లోన్. ఇందులో రుణం మొత్తం దరఖాస్తుదారుల ఆదాయ స్థాయి, ఉపాధి, క్రెడిట్ హిస్టరీ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

    మరోవైపు కార్ లోన్‌లు కారు కొనేందుకు చెల్లింపులు చేయడానికి మాత్రమే ఉద్దేశించిన స్పెషల్ లోన్లు. చాలా బ్యాంకులు వాహనం మొత్తం ధరలో 80% వరకు కార్ లోన్ ద్వారా ఫైనాన్సింగ్ సదుపాయం కల్పిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో.. వాహనం ఖర్చులో మిగిలిన 20 శాతాన్ని కస్టమర్లు సొంతంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొంతమంది కార్ లోన్ తీసుకున్న తరువాత కూడా.. తమ వద్ద కారు కోసం ఖర్చు చేయాల్సిన మిగిలిన 20% నిధులు ఉండకపోవచ్చు. ఈ సందర్భంలో కస్టమర్లు పర్సనల్ లోన్‌ను ఎంచుకొని.. కారు విలువ మొత్తాన్ని రెండు లోన్ల ద్వారా పొందవచ్చు. అయితే కారు కొనుగోలుకు పర్సనల్ లోన్ లేదా కార్ లోన్ ఎంచుకునే కస్టమర్లు పరిగణించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఈ రెండు ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకునే ముందు కొన్ని అంశాలపై దృష్టి పెట్టి.. వీటి మధ్య తేడాలను గుర్తించాలి.

    Ola వాడే వారికి గుడ్ న్యూస్... మీరు రైడ్ బుక్ చేస్తే ఇకపై క్యాన్సిల్ అయ్యే చాన్స్ చాలా తక్కువ.. ఎందుకంటే



    రుణ మొత్తం, వడ్డీ రేటు
    సాధారణంగా కార్ లోన్‌లతో పోల్చినప్పుడు వ్యక్తిగత రుణాలకు చాలా ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది. పర్సనల్ లోన్ లేదా కార్ లోన్‌పై కస్టమర్లు చెల్లించాల్సిన వడ్డీని బ్యాంకులు క్రెడిట్ రేటింగ్, క్రెడిట్ స్కోర్ ఆధారంగా నిర్ణయిస్తాయి. మంచి క్రెడిట్ రేటింగ్ ఉన్న కస్టమర్లు పర్సనల్ లోన్‌ ఎంచుకోవచ్చు. తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉంటే కార్ లోన్‌ను ఎంచుకోవాలని నిపుణులు సలహా ఇస్తుంటారు. సాధారణంగా వాహనం మొత్తం ధరలో 80 శాతం వరకు మాత్రమే కార్ లోన్ లభిస్తుంది. దీంతో కారు ధర ఎక్కువగా ఉంటే మిగిలిన 20% పెద్ద మొత్తమే అవుతుంది. అయితే పర్సనల్ లోన్ ద్వారా కారును కొనుగోలు చేయడానికి అవసరమైన 100% మొత్తాన్ని పొందవచ్చు. మంచి క్రెడిట్ రేటింగ్ ఉండి పర్సనల్ లోన్ తీసుకుంటే.. తక్కువ వడ్డీతో, కారు పూర్తి ధరను కవర్ చేసే రుణ మొత్తంతో లబ్ధి పొందవచ్చు.

    New Rules: జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త GST నిబంధనలు.. ఆందోళనలో నిపుణులు.. కారణం ఏంటంటే.. 



    ఒకవేళ మీకు సరైన క్రెడిట్ రేటింగ్ లేకపోతే.. కార్ లోన్‌ను ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే ఖాతాదారులు ఫైనాన్స్‌లో కొనుగోలు చేసే వాహనం బ్యాంకులకు తాకట్టుగా ఉన్నందువల్ల.. కార్ లోన్లపై తక్కువ మొత్తంలో రిస్క్‌ ఉంటుంది. దీంతో వీటి విషయంలో రుణదాతలకు పెద్ద సమస్య ఉండదు. కార్ లోన్‌ల సాధారణ వడ్డీ రేటు 8.5%- 14% మధ్య ఉంటుంది. అయితే పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు అంతకు మించి కూడా ఉండవచ్చు.

    లోన్ లక్ష్యం
    కార్ లోన్ కోసం తీసుకునే రుణాన్ని ఇతర వస్తువుల కొనుగోళ్లకు ఉపయోగించడం కుదరదు. కానీ పర్సనల్ లోన్ ద్వారా తీసుకునే రుణాన్ని కారు కొనుగోలు చేయడానికి లేదా ఇతర అవసరాలకు కూడా ఉపయోగించవచ్చు. అందువల్ల కారు కోసం కాకుండా, ఇతర అవసరాలకు డబ్బు కావాల్సి వస్తే.. పర్సనల్ లోన్‌ను ఎంచుకోవడం మంచిది.

    Bank Holidays January 2022: జనవరిలో బ్యాంకులకు 9 సెలవులు... హాలిడే లిస్ట్ ఇదే


    లోన్ గడువు
    పర్సనల్, కార్ లోన్‌ రుణాల కాలవ్యవధి లేదా లోన్ గడువు భిన్నంగా ఉంటుంది. పర్సనల్ లోన్ కాలవ్యవధి 1-5 సంవత్సరాల మధ్య ఉంటుంది. అయితే కార్ లోన్ కాలవ్యవధి 3-8 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈ రెండు ఆప్షన్లతోనూ లాభనష్టాలు ఉన్నాయి. తక్కువ రుణ కాల వ్యవధిని ఎంచుకుంటే తక్కువ మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో పెద్ద మొత్తంలో EMI చెల్లించాల్సి ఉంటుంది.

    వాహనంపై యాజమాన్య హక్కు
    కార్ లోన్ రీపేమెంట్ మొత్తం పూర్తయిన తర్వాత మాత్రమే వాహనంపై యాజమాన్య హక్కు కస్టమర్ల పేరు మీదకు బదిలీ అవుతుంది. పర్సనల్ లోన్‌ ద్వారా కారు కొన్నప్పుడు మాత్రం యాజమాన్య హక్కు వెంటనే లభిస్తుంది.

    మీ వాహనం సరిగా మైలేజీ ఇవ్వడం లేదా? అయితే, ఈ సింపుల్ టిప్స్ పాటించండి



    లోన్‌ పొందే విధానం
    కార్ లోన్ కంటే పర్సనల్ లోన్ పొందడం క్లిష్టమైన ప్రక్రియ. క్రెడిట్ స్కోర్‌ సరిగా లేకపోతే పర్సనల్ లోన్‌పై ఎక్కువ వడ్డీ రేట్లను బ్యాంకులు విధిస్తాయి. లేదంటే అప్లికేషన్‌ను తిరస్కరిస్తాయి. అయితే తాకట్టు రూపంలో కారు ఉన్నందున క్రెడిట్ స్కోర్‌తో సంబంధం లేకుండా కార్ లోన్‌లను సులభంగా పొందవచ్చు.

    తుది నిర్ణయం
    లోన్ కాలవ్యవధి, రుణ మొత్తం, EMI, వడ్డీ రేటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే కారు కొనుగోలుకు ఏ లోన్‌ ఎంచుకోవాలో నిర్ధారించుకోవాలి. తక్కువ సమయంలో లోన్‌ను క్లియర్ చేయాలనుకుంటే పర్సనల్ లోన్లు మంచి ఆప్షన్. ప్రతి నెలా పెద్ద మొత్తంలో EMI చెల్లించలేనివారు, దీర్ఘకాలంలో లోన్‌ రీపేమెంట్ చేయాలనుకునే వారు కార్ లోన్‌ ఎంచుకోవచ్చు. అయితే తుది నిర్ణయం తీసుకునే ముందు వివిధ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వడ్డీ రేట్లు, ఆఫర్లను తనిఖీ చేయడంతో పాటు అందుబాటులో ఉన్న అన్ని ఆప్షన్లను పోల్చి చూడటం మంచిది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: CAR, Car loans, Personal Loan

    తదుపరి వార్తలు