Stock Market crash: మార్కెట్ క్రాష్ అవుతున్న సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి

స్టాక్ మార్కెట్లలో రక్త కన్నీరు (ప్రతీకాత్మక చిత్రం)

గతేడాది కూడా ఇలాంటి క్షీణతే నమోదు కావడంతో మదుపర్ల జేబులు ఖాళీ కాకుండా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని తప్పిదాలు అస్సలు చేయకూడదని పెట్టుబడుదారులకు సలహా ఇస్తున్నారు.

  • Share this:
కోవిడ్ రెండో వేవ్ తీవ్రంగా విజృభిస్తున్న వేళ.. మహమ్మారి కరాళ నృత్యానికి గందరగోళ పరిస్థితులు వేళ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. వైరస్ వ్యాప్తి దేశవ్యాప్తంగా విపరీతంగా ఉండటంతో లాక్ డౌన్ భయంతో వల్ల బీఎస్ఈ సెన్సెక్స్ ఇప్పటికే 50 వేల పాయింట్ల దిగువకు దిగజారింది. గతేడాది కూడా ఇలాంటి క్షీణతే నమోదు కావడంతో మదుపర్ల జేబులు ఖాళీ కాకుండా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని తప్పిదాలు అస్సలు చేయకూడదని పెట్టుబడుదారులకు సలహా ఇస్తున్నారు.

ఈక్వీటీల నుంచి ఎగ్జిట్ కాకండి..
మార్కెట్ క్రాష్ అవ్వగానే చాలా మంది తమ ఈక్విటీ పెట్టుబడులను విక్రయిస్తారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. మార్చి 2020లో కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉండటంతో సెన్సెక్స్ 30 శాతం క్రాష్ అయిందని తెలుసుకొని చాలా మంది పెట్టుబడుదారులు ఇలాగే చేశారు. ఫలితంగా వారి నిర్ణయాల వల్ల ఆనతి కాలంలో చింతించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సెన్సెక్స్ రెండు రెట్లు పుంజుకుంది. మార్కెట్లు క్రాష్ అయినప్పుడు కొంచెం చేదుగానే అనిపించవచ్చు.. అంత మాత్రాన అమ్మాల్సిన పనిలేదు. ఏదేమైనా ఈక్వీటల నుంచి నిష్క్రమించడం దీర్ఘకాలిక లక్ష్యాలకు ఎదురుదెబబ్ అని ఇది రుజువు చేస్తుంది.

మీరు దీర్ఘకాలిక పెట్టుబడుదారులైతే ప్రతి రోజూ మార్కెట్ల గురించి పట్టించుకోవద్దు. పెట్టుబడుల పట్ల భావోద్వేగానికి గురికాకుండా ఉండండి. వాటి గురించి కాకుండా లక్ష్యాల గురించి ఆలోచించండి. పదేళ్ల ప్రయాణంలో ఒక రోజులో వచ్చే మార్పు ఎలాంటి తేడాను చూపించదు. కాబట్టి పెట్టుబడుదారులు దీర్ఘాకాలిక పోర్ట్ ఫోలియోను నిర్మించడానికి ఈ ఒడుదొడుకులను ఉపయోగించుకోవాలని నిపుణులు అంటున్నారు. మీరు దీర్ఘకాలిక ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే పెట్టుబడులు పెంచుకోవడం కోసం ఈ ఒడుదొడుకులను ఉపయోగించుకోవాలని రైట్ హారిజన్స్ సీఈఓ అనిల్ రోగ్ అన్నారు.

వైవిధ్యంగా ఉండాల్సిన పనిలేదు..
అస్థిరతను తగ్గించుకోవడానికి వైవిధ్యీకరణ(Diversification) ఉపయోగపడుతుంది. ప్రాథమికంగా ఇది అన్ని ఆస్తి తరగతుల వారిపై ఒకే సమయంలో దుష్ప్రభావం చూపవు అనే సూత్రంపై ఆధారపడుతుంది. అందువల్ల మీ ఎస్సెట్ క్లాసులతో పాటు భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించడం చాలా ముఖ్యం. ఆర్థికంగా మార్కెట్ రికవరీ కోవిడ్ అనంతరం మారువచ్చని కొంతమంది నిపుణులు తమ ఖాతాదారులకు సలహా ఇస్తున్నారు. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో వైవిధ్యంగా ఉండాలని సలహా ఇస్తున్నారు. వివిధ భౌగోళిక రిస్కులు, లాక్డౌన్లు వివిధ దశల్లో ఉన్నందున నష్టాలను పరిష్కరించడానికి, అంతర్జాతీయ ఆస్తులను పెంచాలని తాము పెట్టుబడుదారులకు సూచిస్తున్నట్లు సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సంస్థ ప్లాన్ అహెడ్ వెల్త్ అడ్వైజర్ వ్యవస్థాపకుడు విశాల్ ధావన్ అన్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఆస్తి తరగతికి మీ కేటాయింపు మొత్తం లక్ష్యానికి అనుగుణంగా ఉండాలి.
Published by:Krishna Adithya
First published: