Permafrost Pandemic: గ్లోబల్ వార్మింగ్‌పై శాస్త్రవేత్తల కొత్త ఆందోళన.. ఆ మంచు కరిగితే మరిన్ని మహమ్మారులు పుట్టుకొస్తాయ?

ప్రతీకాత్మకచిత్రం

శాస్త్రవేత్తలు ఇటీవల రష్యాలో పెర్మాఫ్రాస్ట్‌లో పెద్ద జంతువుల మృతదేహాలను కనుగొన్నారు. మంచు కరగడం వల్ల ఇలాంటి జంతువుల మృతదేహాలు మళ్లీ కుళ్ళిపోవడం ప్రారంభిస్తే.. వేలాది ఏళ్ల క్రితం నాటి బ్యాక్టీరియాను బహిర్గతమయ్యే ప్రమాదముంది. అయితే ప్రస్తుతానికి ఈ బ్యాక్టీరియా జీవుల ప్రాణాలకు హాని తలపడతాయో లేదో చెప్పడం కష్టంగా మారింది.

  • Share this:
గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆర్కిటిక్ మహాసముద్రాల్లో పేరుకుపోయిన మంచు కరిగిపోతే మరిన్ని వైరస్‌లు ఉద్భవిస్తాయా? అని అడిగితే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఐస్ ఏజ్ సమయం కంటే సాధారణ సమయంలోనే వైరస్‌లు ఎక్కువగా పుట్టుకొచ్చాయని పరిశోధకులు గుర్తుచేస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే.. శాశ్వత మంచు(పెర్మాఫ్రాస్ట్) కరిగిపోవడం వల్ల కొత్త బ్యాక్టీరియా, వైరస్‌లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐపీసీసీ తాజా నివేదిక.. గ్లోబల్ వార్మింగ్ పెరగడంతో ఆర్కిటిక్ పెర్మాఫ్రాస్ట్ తగ్గుతుందని వెల్లడించింది. దీనివల్ల మీథేన్, కార్బన్ డయాక్సైడ్ వంటి గ్రీన్‌హౌస్ వాయువులు విడుదల అవుతాయని నివేదిక హెచ్చరించింది.

కనీసం రెండు సంవత్సరాల పాటు సున్నా డిగ్రీ సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ ఉండే గ్రౌండ్‌ (మట్టి, రాతి మరియు ఏదైనా మంచు లేదా సేంద్రీయ పదార్థం) గా పెర్మాఫ్రాస్ట్‌ను నిర్వచిస్తారు. ఇది భూగోళంలో 15 శాతంగా, 23 మిలియన్ చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది.

అధిక ఉష్ణోగ్రతల వల్ల శాశ్వత మంచు కరిగిపోతే.. తక్షణ ప్రభావాలు ఎలా ఉండనున్నాయి?
దీనివల్ల శాశ్వత మంచు (permafrost) పై నిర్మించిన రోడ్లు లేదా భవనాలపై తక్షణ ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకు రష్యన్ రైల్వేని ఉదాహరణగా చూపుతున్నారు. గ్రౌండ్ లో చిక్కుకున్న సేంద్రీయ పదార్థాల (organic material) గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉందన్నారు. గ్రౌండ్ కరగడం ప్రారంభిస్తే.. మైక్రోబయోటా విచ్ఛిన్నం కావడానికి సేంద్రీయ పదార్థాలు దోహదం చేస్తాయని అంటున్నారు.

కొన్ని పరిసరాల్లో మైక్రోబయోటా.. కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తుందని.. మరికొన్ని పరిసరాల్లో మీథేన్‌ను విడుదల చేస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు. గ్రీన్‌హౌస్ వాయువు మీథేన్‌.. కార్బన్ డయాక్సైడ్ కంటే 25 నుంచి 30 రెట్లు ఎక్కువ శక్తివంతమైనదని శాస్త్రవేత్తల్లో ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు పెర్మాఫ్రాస్ట్‌లో నిక్షిప్తమైన మొత్తం కార్బన్ పరిమాణం దాదాపు 1500 బిలియన్ టన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గ్రౌండ్ పైనున్న మూడు మీటర్లు వరకు 1000 బిలియన్ టన్నులు కార్బన్ ఉంటుందని చెబుతున్నారు.

రానున్న రోజుల్లో ఉత్పన్నమయ్యే ఈ ఉద్గారాలను అర్థం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమవుతాయా?
పెగ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలపై ఇంకా చాలా అధ్యయనాలు చేయాల్సి ఉంది. పెర్మాఫ్రాస్ట్‌లో కార్బన్ ఏ స్థాయిలో ఉందో అంచనా వేయడానికే ఇప్పటివరకూ శాస్త్రీయ ప్రయత్నాలు జరిగాయి. 2019లో ప్రచురించిన ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం.. గతంలో కార్బన్ స్టోర్‌హౌస్ గా ఉన్న పెర్మాఫ్రాస్ట్‌లు ఇప్పుడు కార్బన్ వాయువును ఉత్పత్తిచేసే ప్రదేశాలుగా మారాయని తెలుస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేసే కార్చిచ్చు గురించి కూడా అధ్యయనాలు చేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అగ్నిప్రమాదం తర్వాత రాబోయే 50- 60 ఏళ్లలో అడవి తిరిగి పెరుగుతుంది. ఇది పర్యావరణ వ్యవస్థలో కార్బన్ నిల్వను యథాస్థితికి తెస్తుంది. కానీ మంచుతో కప్పి ఉండే పరిసరాల్లో సేంద్రీయ పదార్థం ఉన్న చోట కుళ్ళిన ప్రదేశాలు ఏర్పడతాయి. వీటిని పోగుచేసి కాల్చేయడానికి చాలా సమయం పడుతుంది. కాల్చేసిన తర్వాత ఉత్పన్నమయ్యే కార్బన్ గ్రౌండ్ లెవల్ లో యథాస్థితికి రావడానికి చాలా ఏళ్ళు పడుతుంది. ఇది కూడా ఒక సమస్యే!

శాశ్వత మంచు కరగడం వల్ల కొత్త బ్యాక్టీరియా లేదా వైరస్‌లు విడుదల అవుతాయా? కొత్త మహమ్మారి విజృంభించే ప్రమాదం ఉందా?
శాస్త్రవేత్తలు ఇటీవల రష్యాలో పెర్మాఫ్రాస్ట్‌లో పెద్ద జంతువుల మృతదేహాలను కనుగొన్నారు. మంచు కరగడం వల్ల ఇలాంటి జంతువుల మృతదేహాలు మళ్లీ కుళ్ళిపోవడం ప్రారంభిస్తే.. వేలాది ఏళ్ల క్రితం నాటి బ్యాక్టీరియాను బహిర్గతమయ్యే ప్రమాదముంది. అయితే ప్రస్తుతానికి ఈ బ్యాక్టీరియా జీవుల ప్రాణాలకు హాని తలపడతాయో లేదో చెప్పడం కష్టంగా మారింది. గ్రీన్లాండ్‌లోని వ్యాధుల సంఖ్య కంటే భారతదేశంలో వ్యాధుల సంఖ్య చాలా ఎక్కువ. ఇందుకు కారణం మంచు ప్రదేశాల్లో కంటే సాధారణ ప్రదేశాల్లోని పర్యావరణం వైరస్‌లు, బ్యాక్టీరియా సైజు, అభివృద్ధికి చాలా అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాంతో మరొక మహమ్మారి విజృంభించే ముప్పు పొంచి ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నాయి.
Published by:Krishna Adithya
First published: