హోమ్ /వార్తలు /Explained /

Pangeos: అబ్బురపరుస్తున్న ఫ్లోటింగ్‌ సిటీ ‘పాంగియోస్‌’ డిజైన్‌.. సముద్రంలో తేలియాడే నగరం ప్రత్యేకతలు ఇవే..

Pangeos: అబ్బురపరుస్తున్న ఫ్లోటింగ్‌ సిటీ ‘పాంగియోస్‌’ డిజైన్‌.. సముద్రంలో తేలియాడే నగరం ప్రత్యేకతలు ఇవే..

ఫ్లోటింగ్ సిటీ(ప్రతీకాత్మక చిత్రం)

ఫ్లోటింగ్ సిటీ(ప్రతీకాత్మక చిత్రం)

తాబేలు ఆకారంలో ఉన్న ప్రపోజ్డ్‌ ఫ్లోటింగ్‌ సిటీకి సూపర్ కాంటినెంట్ పాంగియా (Pangea) పేరు పెట్టారు. భూమిపై పాలిజోయిక్ చివరి యుగం, మెసోజోయిక్ ప్రారంభ యుగంలో ఉనికిలో ఉన్న ఒక సూపర్ కాంటినెంట్‌కు పాంగియా అనే పేరు ఉండేది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Floting city : ఇప్పటి వరకు అందరూ పెద్ద పెద్ద భవంతులను తలపించే ఓడలను చూసి ఉంటారు. పడవలు, సూపర్ యాచ్‌ల గురించి విని వింటారు.. కానీ టెరాయాచ్‌ల గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్‌ సిటీని నిర్మించడానికి ఇటాలియన్ డిజైన్ హౌస్ లాజారిని (Lazzarini) రూపొందించిన కాన్సెప్ట్‌. నీటిపై ప్రయాణించే నగరంగా, అన్ని హంగులు ఉండేలా లాజారిని సంస్థ ఈ తేలియాడే నగరాన్ని డిజైన్‌ చేసింది. ఈ ఫ్లోటింగ్‌ సిటీ ప్రత్యేకతలు తెలుసుకుందాం.

8 బిలియన్‌ డాలర్ల వ్యయం

CNN తెలిపిన వివరాల ప్రకారం.. తాబేలు ఆకారంలో ఉన్న ప్రపోజ్డ్‌ ఫ్లోటింగ్‌ సిటీకి సూపర్ కాంటినెంట్ పాంగియా (Pangea) పేరు పెట్టారు. భూమిపై పాలిజోయిక్ చివరి యుగం, మెసోజోయిక్ ప్రారంభ యుగంలో ఉనికిలో ఉన్న ఒక సూపర్ కాంటినెంట్‌కు పాంగియా అనే పేరు ఉండేది. ఇదే పేరుతో లాజారిని సంస్థ ఒక వండర్ ఫ్లోటింగ్ సిటీని నిర్మించే డిజైన్‌ను తయారుచేసింది. 1,800 అడుగుల పొడవు, 2,000 అడుగుల వెడల్పుతో ఉండే పాంగియోస్‌ను నిర్మించేందుకు దాదాపు 8 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని డిజైనర్లు చెబుతున్నారు. 'ఫ్లోటింగ్ సిటీ'లో హోటళ్లు, షాపింగ్ మాల్స్, పార్కులు, చిన్న ఓడలు, విమానాల కోసం ఓడరేవులు కూడా ఉంటాయి.

సౌదీ అరేబియాలో ఫ్లోటింగ్‌ సిటీ

ఫ్లోటింగ్‌ సిటీకి డిజైనర్లు సౌదీ అరేబియాను లొకేషన్‌గా ప్రపోజ్‌ చేశారు. Interesting Engineering.com అనే వెబ్‌సైట్‌ ప్రకారం.. ఫ్లోటింగ్‌ సిటీ ఎంట్రన్స్‌లోనే విల్లాలు ఉండేలా డిజైన్‌ చేశారు. ఆ తర్వాత ప్రైవేట్ హౌసెస్‌, భవనాలు, రూఫ్‌టాప్ టెర్రస్‌లకు దారి తీస్తుంది. ఓడ ఎగువ షెల్‌పై వివిధ ఎగిరే వాహనాల కోసం రూపొందించిన జోన్ కూడా ఉంటుంది. ఓడ దిగువ ప్రాంతంలో 30,000 సెల్స్ లేదా క్లస్టర్ కంపార్ట్‌మెంట్లు ఉండేలా డిజైన్‌ చేశారు. వీటిని ప్రధానంగా ఉక్కుతో నిర్మించనున్నారు. నీటిలో మునిగిపోకుండా ఫ్లోటింగ్‌ సిటీ డిజైన్‌ రూపొందించారు.

పవర్‌ జనరేషన్‌ కోసం సోలార్‌ సిస్టమ్‌

ఓడ రెక్కలు సముద్రపు అలల నుంచి శక్తిని సేకరించేలా సిద్ధం చేయనున్నారు. దీంతో గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేయకుండా పాంగోస్‌ శాశ్వతంగా ప్రయాణిస్తుంది. టెరాయాచ్‌కు పవర్ అందించేందుకు అనేక సోలార్‌ ప్యానెల్స్‌ను పైకప్పు ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు.

Free Town : ఆక్కడకు వెళ్తే రూ.25 లక్షలు ఇస్తారు.. లైఫ్ సెటిల్.. వెళ్తారా

నిర్మాణానికి ఎనిమిది సంవత్సరాలు

Stuff.co.NZ వివరాల ప్రకారం.. NFT-రిలేటెడ్‌ క్రౌడ్ ఫండింగ్ పీరియడ్‌ తర్వాత 60,000 మంది వ్యక్తుల సామర్థ్యం కలిగిన ఈ నగర నిర్మాణం ప్రారంభం అవుతుంది. క్రిప్టోకరెన్సీతో NFT వంటి వర్చువల్ ప్రాపర్టీ అందుబాటులో ఉంది. పాంగియోస్ నిజంగా సాకారం అయితే ఫిజికల్ ఆస్తికి డిపాజిట్‌గా పనిచేస్తుంది. నిర్మాణానికి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది. ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా ఒక భారీ షిప్‌యార్డ్ సృష్టించాలి. ఇది తొమ్మిది అధిక ఉష్ణోగ్రత సూపర్ కండక్టర్ ఇంజన్‌ల ద్వారా శక్తిని పొందుతుంది . వాటిలో ప్రతి ఒక్కటి 16,800hp సామర్థ్యం గల పూర్తి ఎలక్ట్రిక్ మోటారు, వివిధ ఆన్‌బోర్డ్ శక్తి వనరుల ద్వారా శక్తిని పొందుతుంది.

 అలల నుంచి శక్తిని గ్రహించే రెక్కలు

డిజైనర్లు వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. జెట్ డ్రైవ్ ట్రాన్స్‌మిషన్ ద్వారా, టెరా-స్ట్రక్చర్ ఐదు నాట్ల వేగంతో ప్రయాణించగలదని చెప్పారు. ప్రయాణిస్తున్న సమయంలో పెద్ద రెక్కలు అలల నుంచి శక్తిని పొందుతాయన్నారు. ఎలాంటి ఉద్గారాలు లేకుండా పాంగియోస్ శాశ్వతంగా భూమి, సముద్రాల చుట్టూ ప్రయాణిస్తుందని వివరించారు. రూఫ్‌టాప్ ప్రాంతం సోలార్‌ ప్యానెల్స్‌తో నిండి ఉంటుందని, వీటి ద్వారా అవసరమైన పవర్‌ జనరేట్‌ అవుతుందని పేర్కొన్నారు. లాజారిని డిజైన్ స్టూడియో గతంలో స్వాన్ ఆకారంలో ఉన్న మెగాయాచ్, ది షేప్ సూపర్‌యాచ్‌లను ఆవిష్కరించింది.

First published:

Tags: Saudi Arabia

ఉత్తమ కథలు