Oxygen Shortage in India: దేశాన్ని పీడిస్తున్న ఆక్సిజన్ కొరత.. అధిగమించేందుకు మార్గాలున్నాయా?

ప్రతీకాత్మక చిత్రం

Oxygen Shortage in India: ఐర‌న్‌, స్టీల్ ప‌రిశ్ర‌మ‌ల‌కు, హాస్పిట‌ళ్ల‌కు, ఫార్మాసూటిక‌ల్ యూనిట్ల‌కు, గ్లాస్ త‌యారీ ప‌రిశ్ర‌మ‌కు ఆక్సిజ‌న్ అవ‌స‌రం ఉంటుంది. ప్ర‌స్తుతం చాలా రాష్ట్రాలు వారి పూర్తి ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తిని వైద్య వినియోగానికే కేటాయించాయి.

  • Share this:
భార‌త‌దేశంలో ఇప్ప‌టికే 16 ల‌క్ష‌ల కొవిడ్ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. రోజురోజుకీ క‌రోనా వ్యాప్తి పెరుగుతున్న త‌రుణంలో చాలా రాష్ట్రాల్లో అవ‌స‌ర‌మైన పేషంట్ల‌కు ఇవ్వ‌డానికి మెడిక‌ల్ ఆక్సిజ‌న్ కొర‌త ఏర్ప‌డింది. ఈ ప‌రిస్థితుల్లో ఇండియా 50,000 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను దిగుమ‌తి చేసుకునే ఆలోచ‌న‌లో ఉంది. ఈ దిగుమ‌తి కోసం ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ టెండ‌ర్లు పిల‌వమ‌ని కూడా ఆదేశించింది.

ఈ రాష్ట్రాల్లో ప‌రిస్థితి దారుణం
అత్య‌ధిక కేసులు న‌మోద‌వుతున్న మ‌హారాష్ట్ర‌లో మెడిక‌ల్ ఆక్సిజ‌న్ కొర‌త ఎక్కువ‌గా ఉంది. ఇక్క‌డ 6.38 ల‌క్ష‌ల కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 10% అంటే సుమారుగా, 60,000-65,000 మందికి ఆక్సిజ‌న్ స‌పోర్ట్ అవ‌స‌రం ఉంది. దేశంలో ఇదే అత్య‌ధికం. అయితే ప్ర‌స్తుతం మ‌హారాష్ట్రలో ఆక్సిజ‌న్ వినియోగం అక్క‌డ‌ పూర్తి ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి కెపాసిటీ 1,250 ట‌న్నులను చేరుకుంది. ఇది ప్ర‌తిరోజూ ఛ‌త్తీస్‌ఘ‌ర్ నుంచి 50 ట‌న్నులు, గుజ‌రాత్ నుంచి 50 ట‌న్నుల‌ను తీసుకుంటుంది. అంతేకాదు, గుజ‌రాత్‌లోని జ‌మునా న‌గ‌ర్ రిల‌యెన్స్ ప్లాంట్ నుంచి 100 ట‌న్నుల ఆక్సిజ‌న్ తీసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉంది.

మ‌ధ్య ప్ర‌దేశ్‌లో ఏప్రిల్ 16 నాటికి 59,193 యాక్టివ్ పేషెంట్లు ఉన్నారు. దీనికి రోజూ 250 ట‌న్నులు అవ‌స‌రం ఉంది. ఈ రాష్ట్రానికి సొంత ప్లాంట్ లేదు అందుకే గుజ‌రాత్‌, ఛ‌త్తీస్‌ఘ‌ర్‌, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ నుంచి ఆక్సిజ‌న్ తెచ్చుకుంటుంది. అయితే చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల్లోనూ కేసులు పెరుతుండ‌టంతో బ‌య‌ట నుంచి తెచ్చుకునే అవ‌కాశ‌‌మూ త‌గ్గుతుంది. ఎందుకంటే గుజ‌రాత్‌లో ఇప్ప‌టికే 49,737 యాక్టివ్ కేసుల‌తో రోజుకి 500 ట‌న్నుల ఆక్సిజ‌న్ అవ‌స‌ర‌మ‌వుతుంది.

క‌రోనా విజృంభిస్తున్న వేళ అత్య‌వ‌స‌ర వైద్య ప‌రిక‌రాల స‌ప్లై అవ‌స‌రాన్ని ప‌ర్య‌వేక్షించ‌డానికి కేంద్రం ఎంప‌వ‌ర్డ్ గ్రూప్-2ను నియ‌మించింది. ఇది అత్య‌ధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న 12 రాష్ట్రాల‌ను గుర్తించింది. అవి, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్, గుజ‌రాత్‌, రాజ‌స్థాన్, క‌ర్ణాట‌క‌, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్, ఢిల్లీ, ఛ‌త్తిస్‌ఘ‌ర్‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, పంజాబ్‌, హ‌ర్యాణా. ఈ ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో ఆక్సిజ‌న్ అవ‌స‌రం మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. ఈ 12 రాష్ట్రాల డిమాండ్‌కు స‌రిప‌డా ఆక్సిజ‌న్‌ను ఇప్ప‌టికి ఆక్సిజ‌న్ అవసరం కంటే కాస్త ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి మూడు విడ‌త‌ల‌గా 17,000 ట‌న్నులు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. ఈ స‌మ‌స్య గ్రామీణ ప్రాంతాల్లో మ‌రింత ఎక్కువ‌గా ఉంది. ఈ ప్రాంతాల్లో ఒక‌వైపు కోవిడ్-19 కేసులు పెరుగుతూ ఉంటే ఇక్క‌డ పెద్ద పెద్ద స్టోరేజ్ ట్యాంక‌ర్ల లోపం క‌నిపిస్తుంది. క‌నుక‌ చిన్న న‌ర్సింగ్ హోమ్ లు రోజువారీ ఆక్సిజ‌న్ సిలండ‌ర్ల‌పైనే ఆధార‌ప‌డాల్సి వ‌స్తుంది.

ఎంత ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి జ‌రుగుతోంది? స‌ప్లైలో వ‌స్తున్న స‌మ‌స్య‌లేంటి?
ఐర‌న్‌, స్టీల్ ప‌రిశ్ర‌మ‌ల‌కు, హాస్పిట‌ళ్ల‌కు, ఫార్మాసూటిక‌ల్ యూనిట్ల‌కు, గ్లాస్ త‌యారీ ప‌రిశ్ర‌మ‌కు ఆక్సిజ‌న్ అవ‌స‌రం ఉంటుంది. ప్ర‌స్తుతం చాలా రాష్ట్రాలు వారి పూర్తి ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తిని వైద్య వినియోగానికే కేటాయించాయి. ప‌రిశ్ర‌మల నిపుణులు చెబుతున్న‌ దాని ప్ర‌కారం ఇండియా 7,000 మెట్రిక్ ట‌న్నుల కంటే ఎక్కువ‌గానే ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేయగ‌ల‌దు. ఇందులో ఎక్కువ ఉత్ప‌త్తి చేస్తుంది, ఐనాక్స్ ఎయిర్ ప్రొడ‌క్ట్స్, లిండే ఇండియా, గోయ‌ల్ ఎమ్ జి గ్యాసెస్ ప్ర‌యివేట్ లిమిటెడ్‌, నేష‌న‌ల్ ఆక్సిజ‌న్ లిమిటెడ్‌. వీటిల్లో పెద్ద‌దైన ఐనాక్స్ రోజుకి 2,000 ట‌న్నులు ఉత్ప‌త్తి చేస్తుంది. ఇది భార‌త‌దేశ వ్యాప్తంగా అవ‌స‌ర‌మైన ఆక్సిజ‌న్ లో 60% ఆక్సిజ‌న్‌ను అందించ‌గ‌లుగుతుంది. ఇప్పుడు ఈ సంస్థ నైట్రోజ‌న్, ఆర్గాన్ గ్యాస్ ఉత్ప‌త్తిని కూడా ఆపేశాయని ఐనాక్స్ అధికారి ఒక‌రు చెబుతున్నారు. ‌

గ‌తేడాది వ‌చ్చిన కొరోనా స‌మ‌యంలో ఇండ‌స్ట్రీయ‌ల్ ఆక్సిజ‌న్‌ను ఉత్ప‌త్తి చేసే చిన్న‌ ‌చిన్న ప‌రిశ్ర‌మ‌లు కూడా కొన్ని మార్పుల‌తో మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ని త‌యారుచేశాయి. అది మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి కెపాసిటీ పెర‌గ‌డానికి స‌హాయం చేసింది. త‌యారిదారులు 99.5% శుద్ధ‌మైన లిక్విడ్ ఆక్సిజ‌న్‌ని త‌యారుచేస్తారు. దీన్ని జంబో ట్యాంక‌ర్ల‌లో స్టోర్ చేస్తారు. ఇది సూచించిన ఉష్టోగ్ర‌త‌లో క్ర‌యోజెనిక్ (cryogenic) ట్యాంక‌ర్ల‌లో డిస్ట్రిబ్యూట‌ర్ల ద‌గ్గ‌ర‌కు పంపిస్తారు. ఇక్క‌డ డిస్ట్రిబ్యూట‌ర్లు చేసే ప్రాసెస్‌లో ఆక్సిజ‌న్‌ను గ్యాస్ రూపంలోకి మార్చే రీగ్యాసిఫికేష‌న్ (regasification) జరుగుతుంది. దీన్ని జంబో సిలిండ‌ర్లు, డ్యూరా సిలీండ‌ర్ల‌లో నింపుతారు. ఇది చిన్న స‌ప్ల‌య‌ర్ల ద‌గ్గ‌ర‌కు, లేదంటే నేరుగా హాస్ప‌ట‌ళ్ల‌కు చేరుకుంటాయి. అయితే, `డిమాండ్ చాలా ఎక్కువ‌గా ఉంది. కానీ స్టోర్ చేయ‌డానికి, ట్రాన్స్‌పోర్ట్ చేయ‌డానికి స‌రిప‌డా సిలిండ‌ర్లు, ట్యాంక‌ర్లు లేవు` అంటారు ప‌రిశ్ర‌మ‌ల నిపుణులు. ఇప్ప‌టికిప్పుడు కొత్త ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి కేంద్రాల‌ను నిర్మించ‌డం, లేదంటే ఉన్న‌వాటిని పెంచ‌డం సాధ్యం కాని ప‌ని. గ‌తేడాది కాలంలో ఐనాక్స్ ప‌శ్చిమ బెంగాల్‌లో రోజుకి 200 ట‌న్నులు, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో రోజుకి 150 ట‌న్నుల ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేసే ప్లాంట్‌లు ప్రారంభించింది. ఇక్క‌డ ఒక్కో ప్లాంట్ నిర్మాణానికి 24 నెలల కాలం ప‌ట్టింది. భ‌విష్య‌త్తులో ఐనాక్స్ మ‌ధ్య‌ప్ర‌దేశ్, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్‌లో కొత్త ప్లాంట్ల‌ను త‌యారుచేసే ఆలోచ‌న‌లో ఉన్నా అది ప్ర‌స్తుత‌మున్న స‌మ‌స్య‌నైతే తీర్చ‌లేదు అంటారు ఆ సంస్థ అధికారి ఒక‌రు.

ట్రాన్స్‌పోర్టేష‌న్‌లో ఉన్న అడ్డంకులేంటి?
మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను 24/7 ట్రాన్స్ పోర్ట్ చేయ‌డానికి ఇండియాలో స‌రిప‌డా క్ర‌యోజెనిక్ ట్యాంక‌ర్లు లేవు. ఇక ఈ ఆక్సిజ‌న్‌ను ఒక రాష్ట్రం నుంచి మ‌రో రాష్ట్రానికి ట్రాన్స్ పోర్ట్ చేయాలంటే త‌యారీదారుని ద‌గ్గ‌ర నుంచి పేషెండ్ బెడ్ ద‌గ్గ‌ర‌కి చేర‌డానికి క‌నీసం 3-5 రోజుల నుంచి 6-8 రోజుల స‌మ‌యం అధిక‌మ‌వుతుంది. ఇక చిన్న హాస్ప‌ట‌ళ్ల‌కు, మారుమూల ప్రాంతాల‌కు చేరుకోవాలంటే ఇంకాస్త ఎక్కువ స‌మ‌య‌మే ప‌డుతుంది. అందుకే చిన్న స‌ప్ల‌య‌ర్లు కూడా స‌ప్లై చేయ‌డానికి వారి ద‌గ్గ‌ర జంబో, డ్యూరా సిలిండ‌ర్లు లేవ‌ని చెబుతున్నారు.
అంతేకాదు, ర‌వాణా, లాజిస్టిక్ ఖ‌ర్చులు పెర‌గ‌డం వ‌ల్ల సిలీండ‌ర్లు రీఫిల్లింగ్ కాస్ట్ కూడా పెరిగింది. అదీ ఎంత దారుణంగా అంటే, ఒక‌ప్పుడు రీఫిల్లింగ్ ఖ‌ర్చు రూ. 100-150 ఉంటే ఇప్పుడ‌ది రూ. 500-2000 అయ్యింది.

మ‌న‌కున్న మార్గాలేంటి?
సాధార‌ణంగా 100లో 20 మందికి ల‌క్ష‌ణాలు ఉంటుంటే అందులో ముగ్గురికి ప‌రిస్థితి విషమంగా ఉంటుంది. దీన్ని బ‌ట్టి 100కు 10-15 మంది పేషంట్ల‌కు వివిధ ర‌కాలుగా ఆక్సిజ‌న్ ఇవ్వాల్సి ఉంటుంది. సోల్యూష‌న్‌లో భాగంగా ప్ర‌పోజ‌ల్‌లో ఉన్న కొన్నింటిని చూద్దాం.

* ఎంప‌వర్ గ్రూప్ ప్లాన్ ప్ర‌కారం దూరదూరంగా ఉన్న 100 హాస్ప‌ట‌ళ్ల‌ను గుర్తించి ప్రెజ‌ర్ స్వింగ్ అబ్జార్ప్‌ష‌న్ (pressure swing absorption (PSA) ప్లాంట్ల‌ను పెడ‌దామ‌ని అనుకుంటున్నారు. అవి సొంత‌గా ఆక్సిజ‌న్ త‌యారు చేసుకుంటాయి. త‌ద్వారా ఆసుప‌త్రులు ఎవ‌రిపైనా ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. దీనితో మారుమూల ప్రాంతాల‌కు ఆక్సిజ‌న్ స‌ప్లైలో జాప్యం జ‌ర‌గ‌దు, అలాగే ర‌వాణా ఖ‌ర్చు త‌గ్గుతుంది. మ‌రో 162 ప్లాంట్ల నిర్మాణం కూడా పూర్తికాబోతుంది.

* కొన్ని హాస్ప‌ట‌ళ్లు క‌నీసం 10 రోజులు నిల్వ ఉండేవిధంగా స్టోరేజ్ ట్యాంకుల‌ను నిర్మించుకుంటున్నాయి. గ‌తేడాది ఇలా కొన్ని సివిల్ హాస్ప‌ట‌ళ్లు జంబో ట్యాంక‌ర్ల‌ను ఏర్పాటు చేసుకున్నాయి.

* మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ప‌రిశ్ర‌మ‌లు రోడ్డు ద్వారా ర‌వాణాను మాత్ర‌మే ఉప‌యోగించుకోకుండా, త్వ‌ర‌గా పంపిణీ చేయ‌డానికి రైలు మార్గాల్లో పంపాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే అయితే ఆక్సిజ‌న్‌ను విమానం ద్వారా ఒక రాష్ట్రం నుంచి మ‌రో రాష్ట్రానికి పంపాల‌ని సూచించారు.

* ఐర‌న్, స్టీల్ ప్లాంట్‌ల‌లోని మిగులు ఆక్సిజ‌న్‌ను మెడిక‌ల్ అవ‌స‌రానికి మ‌ళ్లించాలి. ఎంప‌వర్డ్ గ్రూప్ అయితే నైట్రోజెన్‌, ఆర్గాన్ ట్యాంక‌ర్ల‌ను కూడా ఆక్సిజ‌న్ స‌ప్లై కోసం వాడాల‌ని సూచించింది. దీని కోసం పెట్రోలియం, సేఫ్టీ ఆర్గ‌నైజేష‌న్‌ ఆర్డ‌ర్లు కూడా వెలువ‌రించింది. అలాగే ఎంప‌వ‌ర్‌మెంట్ గ్రూప్ రీఫిల్లింగ్ కోసం ప‌రిశ్ర‌మ‌ల సిలిండ‌ర్ల‌ను వాడాల‌ని చెప్పింది.

* ఇప్ప‌టికే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆక్సిజ‌న్ నిరుప‌యోగంగా ఉంచ‌డాన్ని, అన‌వ‌స‌రంగా వినియోగించ‌డాన్ని ఆప‌మ‌ని చెప్పింది. అలాగే ప‌రిశ్ర‌మ‌ల నిపుణులు హాస్ప‌ట‌ల్‌లో వాడే గ్యాస్ పైప్‌లైన్ లీకేజీల వ‌ల్ల వేస్ట్ అవుతున్న ఆక్సిజ‌న్ గురించి గుర్తుచేశారు. గ‌తేడాది ఆరోగ్య శాఖ కిందున్న ఒక నిపుణుల కమిటీ ప్ర‌తి నిమిషానికి, ప్ర‌తి పేషెంట్‌కి నార్మ‌ల్ వార్డులో అయితే 15 లీట‌ర్ల ఆక్సిజ‌న్, ఐసియు అయితే 40 లీట‌ర్ల ఆక్సిజ‌న్ పెట్టాల‌ని సూచించింది. ఆక్సిజ‌న్ కావాల్సిన పేషంట్ల‌ను ప‌ర్య‌వేక్షించి ఎవ‌రికి 94% కంటే త‌క్కువ‌గా ఆక్సిజ‌న్ సాచ్యురేష‌న్ స్థాయిలు ఉంటాయో వారికే పెట్ట‌మ‌ని సూచించారు.
First published: