Home /News /explained /

ONGOING SUNSHINE IN INDIA FIND OUT THE SYMPTOMS AND PROTECTION MEASURES FOUND IN HEAT WAVE VICTIMS GH VB

Explained: ఇండియాలో కొనసాగుతున్న ఎండ తీవ్రత.. బాధితుల్లో కనిపించే లక్షణాలు, రక్షణ చర్యలు తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒక ప్రాంతంలో ఉండే సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదైతే హీట్‌వేవ్‌గా పరిగణిస్తారు. మైదాన ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రత కనీసం 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటితే హీట్‌వేవ్‌గా చెప్పవచ్చు.

ఒక ప్రాంతంలో ఉండే సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదైతే హీట్‌వేవ్‌గా(Heatwave) పరిగణిస్తారు. మైదాన ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రత కనీసం 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటితే హీట్‌వేవ్‌గా చెప్పవచ్చు. కొండ ప్రాంతాలలో కనీసం 30 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావాలి. సాధారణ ఉష్ణోగ్రత నుండి 4.5 డిగ్రీల సెల్సియస్ నుండి 6.4 డిగ్రీల సెల్సియస్ వరకు లేదా వాస్తవ గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ లేదా సమానంగా ఉన్నప్పుడు హీట్‌వేవ్ అంటారు. 6.4 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు లేదా వాస్తవ గరిష్ట ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా లేదా సమానంగా ఉన్నప్పుడు తీవ్రమైన హీట్ వేవ్‌గా సూచిస్తారు. భారతదేశంలోని పంజాబ్(Punjab), హర్యానా(Haryana), చండీగఢ్, ఉత్తరప్రదేశ్(Uttara Pradesh), రాజస్థాన్ రాష్ట్రాలు ముఖ్యంగా హీట్‌వేవ్ పరిస్థితులకు గురవుతాయి. హీట్‌వేవ్‌ల కారణంగా సాధారణంగా డీహైడ్రేషన్, హీట్ క్రాంప్స్, హీట్ ఎగ్జాషన్ లేదా హీట్ స్ట్రోక్‌లు వంటివి కలుగుతాయి.

హీట్‌వేవ్‌ సంకేతాలు, లక్షణాలు..

హీట్ క్రాంప్స్: ఎడెర్నా(వాపు), మూర్ఛ, సాధారణంగా జ్వరం 102 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే తక్కువగా ఉంటుంది.

హీట్ ఎగ్జాషన్: అలసట, బలహీనత, తల తిరగడం, తలనొప్పి, వికారం, వాంతులు, కండరాల తిమ్మిరి, చెమట వంటివి వస్తాయి.

హీట్ స్ట్రోక్: శరీర ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ అంటే, 104 డిగ్రీల ఫారెన్‌హీట్ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటాయి. మతిమరుపు, మూర్ఛ లేదా కోమా వంటివి వస్తాయి. ఇది ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ప్రాణాలకు ప్రమాదం.

Explained: న్యూక్లియర్ రియాక్టర్లపై కొత్త పాడ్‌కాస్ట్‌ ఎపిసోడ్.. అందుబాటులో అణుశక్తిపై పూర్తి సమాచారం!


చిన్న పిల్లలకు ఇలా రక్షణ
చిన్న పిల్లల్లో అలసట, కండరాల నొప్పులు, మూర్ఛ, ఎక్కువగా చెమటలు పట్టడం, తలనొప్పి, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వాంతులు, శరీర ఉష్ణోగ్రత 105 ఫారన్‌హీట్‌ల కంటే ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే హీట్‌వేవ్‌ కారణంగా కలిగిన ఆరోగ్య సమస్యలుగా భావించాలి. వెంటనే వారిని చల్లని ప్రాంతానికి తీసుకెళ్లి, పడుకోబెట్టాలి. పిల్లల దుస్తులను గాలి తగిలేలా వదులు చేయాలి. వాంతులు చేసుకుంటూ ఉంటే పక్కకు పడుకోబెడితే ఉపశమనం ఉంటుంది. ఫ్యాన్‌లు ఆన్‌ చేసి చల్లదనం ఉండేలా చూసుకోవాలి. తడిబట్టతో శరీరాన్ని తుడిస్తే ఉష్ణోగ్రత తగ్గుతుంది. కొంచెం కొంచెంగా నీరు లేదా పండ్ల రసాలు తాగించాలి.

* హీట్ వేవ్ సమయంలో ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవలసిన చర్యలు

- దాహం వేయకపోయినా తగినంత నీరు తాగాలి. వీలైనంత తరచుగా మంచి నీరు తాగాలి.

- ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లకూడదు, పని చేయకూడదు.

- మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య వంటలు చేయకూడదు.

- కాలినడకన ఎండలో బయటకు వెళ్లకూడదు.

- తేలికైన, లేత రంగు, వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి.

- బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు శ్రమతో కూడిన పనులకు దూరంగా ఉండాలి.

- ప్రయాణాలు చేసే సమయంలో మంచినీటి బాటిల్‌ను వెంట తీసుకెళ్లండి.

- శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటేడ్ శీతల పానీయాలకు దూరంగా ఉండటం మంచిది.

- బయట పని చేస్తుంటే, టోపీ లేదా గొడుగు తప్పక ఉపయోగించాలి. తల, మెడ, ముఖం, శరీర అవయవాలపై తడి గుడ్డను ఉంచుకొంటే వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

- పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలను, పెంపుడు జంతువులను వదిలి వెళ్లకూడదు.

- మూర్ఛ లేదా అనారోగ్యంగా అనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించాలి.

- శరీరాన్ని తిరిగి హైడ్రేట్ చేయడానికి సహాయపడే ORS, ఇంట్లో తయారుచేసిన లస్సీ, నిమ్మ నీరు, మజ్జిగ మొదలైన పానీయాలు తాగాలి.

- జంతువులను నీడలో ఉంచి వాటికి పుష్కలంగా నీరు తాగించాలి.

- ఇంటిని చల్లగా ఉంచండి, కర్టెన్లు, షట్టర్లు లేదా సన్‌షేడ్‌లను ఉపయోగించాలి. రాత్రి కిటికీలను తెరిచి ఉంచాలి.

- ఫ్యాన్‌లు, తడి దుస్తులను వినియోగించాలి. తరచుగా చల్లటి నీటితో స్నానం చేయాలి.
Published by:Veera Babu
First published:

Tags: Explained, Health, Heat, Heat wave, Summer

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు