Home /News /explained /

NIPAH VIRUS STRIKES KERALA WHAT IS THE DIFFERENCE BETWEEN NIPAH AND CORONAVIRUS AND MEDICINE FOR THOSE BA GH

Nipah- Corona Difference: నిఫా-కోవిడ్ మధ్య తేడా ఏంటి? వాటి లక్షణాలు ఏంటి?.. ఏది ప్రమాదకరం?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

What is Nipah Virus | నిఫాను మొదటిసారిగా 1999లో గుర్తించారు. ప్రస్తుతం దీనికి ఎలాంటి డ్రగ్స్ కానీ, వ్యాక్సిన్లు కానీ అందుబాటులో లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాధాన్యత కలిగిన వ్యాధుల జాబితాలో నిఫాను కూడా చేర్చింది. వ్యాప్తి తక్కువగా ఉండటం వల్ల కరోనా మాదిరిగా నిఫా ప్రపంచం మొత్తానికి వ్యాప్తి చెందలేదు.

ఇంకా చదవండి ...
నిఫా వైరస్ (Nipah Virus).. రెండేళ్ల కింద కేరళ (Kerala Nipah Virus)ను వణికించిన ఈ వైరస్ మళ్లీ తిరోగమించింది. మరోసారి ఆ రాష్ట్రంపై ప్రతాపం చూపిస్తోంది. మరోవైపు కరోనా మహమ్మారి కూడా మలయాళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. అక్కడ కేసుల ఉద్దృతి రోజురోజుకు పెరుగుతోంది. స్వభావం పరంగా ఈ రెండూ ఒకే విధంగా కనిపించినప్పటికీ.. వైవిధ్యతను ప్రదర్శిస్తూ విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు వైరస్‌ల మధ్య వ్యత్యాసం.. లక్షణాల్లో తేడాల గురించి తెలుసుకుందాం.

నిఫా జోనేటిక్ (zoonotic) ఇన్ఫెక్షన్
నిఫా వైరస్ అనేది జోనేటిక్ ఇన్ఫెక్షన్ కిందకు వస్తుంది. అంటే రెండు జీవ జాతుల మధ్య సంక్రమించే వైరస్. జంతువుల నుంచి మానవులు లేదా మానవులు నుంచి జంతువుల మధ్య వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ను మొదటిసారిగా 1999లో గుర్తించారు. మలేసియాలోని సున్గాయ్ నిఫా అనే గ్రామంలో కనుగొనడం వల్ల వైరస్‌కు ఆ పేరు వచ్చింది. పందులు, గబ్బిలాలు, మేకలు, పిల్లులు, గుర్రాలు, గొర్రెలు లాంటి జంతువులను ఈ వైరస్ హోస్ట్‌గా చేసుకుంటుంది. ఇన్ఫెక్షన్‌కు సంబంధించి ఎలాంటి లక్షణాలను వెంటనే చూపదు.

కోటీశ్వరుడిగా మారిన బార్బర్​.. అతని వద్ద 400 లగ్జరీ కార్లు.. ఇప్పటికీ కూడా..


మరోవైపు SARC COV-2(కోవిడ్-19) చైనాలోని వుహాన్‌లో మొదటిసారి వెలుగుచూసింది. అయితే ఇంతవరకు వైరస్ నిర్ధారణపై స్పష్టత లేదు. మొదట్లో వుహాన్‌లో హువానాన్ సీఫుడ్ మార్కెట్లో ఉద్భవించిందని నమ్మారు. అయితే ఈ సిద్ధాంతం నిరూపణ కాలేదు. కరోనా చైనాలోని ల్యాబ్‌లో తయారైందనే చర్చ ఇంకా కొనసాగుతోంది.

మరోసారి నిఫా వైరస్ పంజా .. బాలుడి మృతి.. అధికారుల అలర్ట్...!


రెండింటికీ చికిత్స లేదు..
ఈ రెండు ఇన్ఫెక్షన్లకు పరిపూర్ణమైన చికిత్స లేదు. వీటికి యాంటీవైరల్ మెడిసిన్‌ను కూడా ఇంకా తయారు చేయలేదు. ప్రస్తుతం నిఫా (NiV) సంక్రమణకు లైసెన్స్ పొందిన చికిత్సలు అందుబాటులో లేవు. విశ్రాంతి, హైడ్రేషన్, లక్షణాలకు చికిత్స చేయడం లాంటి సహాయక సంరక్షణ చర్యలు మాత్రమే చేపడుతున్నారు. ఇన్ఫెక్షన్ల చికిత్స కోసం ప్రస్తుతం ఇమ్యునోథెరపిక్ చికిత్సలు (మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీలు) అభివృద్ధి దశలో ఉన్నాయని సీడీసీ స్పష్టం చేసింది. మోనోక్లోనల్ యాంటీబాడీల ఉపయోగంపై భారత్ దృష్టి సారించింది.

పెద్దాయనను కరిచిన ఎలుక. బాధితుడి మృతితో తీవ్ర కలకలంకరోనా చికిత్స కోసం 2020 అక్టోబర్‌లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) రెమిడెసివిర్‌ను ఆమోదించింది. అయితే అది పునర్వినియోగపరిచే యాంటీ వైరల్ డ్రగ్. ఈ చికిత్సకు లైసెన్స్ లేదు. టోసిలిజుమాల్‌తో సహా ఇతర పునర్వినియోగ మందులను చికిత్సలో ఉపయోగిస్తున్నారు. అయితే కోవిడ్-19 నివారణకు యాంటిబయాటిక్స్ సహా ఇతర మందులను సిఫార్సు చేయట్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.

నిఫా ఎక్కువ ప్రమాదకరం, తక్కువ వ్యాప్తి.. కరోనా ఇందుకు వ్యతిరేకం..

ఇంతకు ముందు కేరళలో నిఫా వైరస్ వ్యాప్తి చెందినప్పుడు 17 నుంచి 19 శాతం రోగులకు సంక్రమించింది. దీని ప్రమాద తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉంటుంది. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో వివిధ వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందాయి. వైరస్ సోకిన చాలా మందికి తేలిక పాటి నుంచి మితమైన శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయి. బాధితులకు ప్రత్యేక చికిత్స లేకుండానే కోలుకుంటారు. కరోనా మరణాల రేటు సగటున 1 శాతం కంటే తక్కువగా ఉందని డేటా సూచిస్తుంది.

నిఫా వ్యాక్సిన్ ఎక్కడ?
నిఫాను మొదటిసారిగా 1999లో గుర్తించారు. ప్రస్తుతం దీనికి ఎలాంటి డ్రగ్స్ కానీ, వ్యాక్సిన్లు కానీ అందుబాటులో లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాధాన్యత కలిగిన వ్యాధుల జాబితాలో నిఫాను కూడా చేర్చింది. వ్యాప్తి తక్కువగా ఉండటం వల్ల కరోనా మాదిరిగా నిఫా ప్రపంచం మొత్తానికి వ్యాప్తి చెందలేదు.

హీరో పుట్టినరోజుకు దున్నపోతును బలిచ్చిన అభిమానులు.. వెల్లువెత్తుతున్న విమర్శలు


మలేసియా, సింగపూర్, బంగ్లాదేశ్, భారత్ లాంటి దేశాల్లో నిఫా వైరస్ వ్యాప్తి చెందింది. కంబోడియా, ఇండోనేసియా, మడగాస్కర్, థాయ్ లాండ్, తిమోర్-లెస్టేతో సహా దేశాల్లో కేసులను గుర్తించారు. గబ్బిలాలను కూడా ఈ వైరస్ ప్రభావితం చేస్తున్నట్లు కనుగొన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 221 దేశాలు, భూభాగాల్లో 221,721,579 ధ్రువీకరించిన కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో నిఫా ప్రభావం తక్కువేఅని చెప్పుకోవచ్చు.

వ్యాధుల లక్షణాలు..
కరోనా వైరస్ వేర్వేరు వ్యక్తులను వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. జ్వరం, పొడిదగ్గు, అలసట, నొప్పులు, వాసన కోల్పోవడం లాంటివి అత్యంత సాధారణ లక్షణాలు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం 80 శాతం తేలికపాటి లక్షణాలు, 15 శాతం తీవ్రమైన లక్షణాలు, 5 శాతం ఆక్సిజన్ అవసరమయ్యే కేసులు, 5 శాతం క్లిష్టమైన ఇన్ఫెక్షన్లలో వెంటిలేషన్ అవసరమని పేర్కొంది.

మానవుల్లో నిఫా వైరస్ ఇన్ఫెక్షన్లలో అనేక రకాల క్లినికల్ ప్రెజెంటేషన్‌కు కారణమవుతుంది. ఈ వైరస్ బాధితుల్లో అసింప్టమాటిక్ ఇన్ఫెక్షన్, అక్యూబ్ రెస్పిరేటర్ ఇన్ఫెక్షన్, ప్రాణాంతక ఎంసెఫాలిటీస్ లాంటి లక్షణాలు ఉంటాయని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. నిఫా సోకిన వ్యక్తులకు ముందు జ్వరం, తలనొప్పి, మైయాల్జియా(కండరాల నొప్పి) వాంతులు, గొంతు నొప్పి వస్తాయి.

అనంతరం మైకం, మగత అనంతరం తీవ్రమైన ఇంఫాలిటిస్ సూచించే నరాల నొప్పులు ఉండవచ్చు. కొంతమంది తీవ్రమైన శ్వాసకోశ బాధతో సహా వైవిధ్య న్యూమోనియా, తీవ్రమైన శ్వాస సమస్యలకు కూడా గురయ్యే అవకాశం ఉంది. 24 నుంచి 48 గంటల లోపల కోమాలోకి చేరుకుంటారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Coronavirus, Kerala, Nipah

తదుపరి వార్తలు