Explained: చైనా హైపర్‌సోనిక్ గ్లైడ్ క్షిపణి ప్రయోగం..? అంతరిక్ష రంగంలో ఆధిపత్యమే లక్ష్యంగా డ్రాగన్​ దూకుడు

ప్రతీకాత్మక చిత్రం

అంతరిక్ష రంగం (Space sector)లో ఆధిపత్యం చెలాయించడానికి చైనా (china) దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆగస్టు నెలలో బీజింగ్​లో రహస్యంగా అణు సామర్థ్యమున్న హైపర్‌సోనిక్ క్షిపణి (Hypersonic missile)ని పరీక్షించినట్లు సమాచారం.

  • Share this:
అంతరిక్ష రంగం (Space sector)లో ఆధిపత్యం చెలాయించడానికి చైనా (china) దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆగస్టు నెలలో బీజింగ్​లో రహస్యంగా అణు సామర్థ్యమున్న హైపర్‌సోనిక్ క్షిపణి (Hypersonic missile)ని పరీక్షించినట్లు సమాచారం. చైనా అభివృద్ధి చేసిన ఈ హైపర్‌సోనిక్ మిస్సైల్ (Hypersonic missile) దాని లక్ష్యం వైపు దూసుకెళ్లే ముందు భూగోళాన్ని మొత్తం చుట్టేసింది. ఆగస్టు నెలలో చైనీస్ మిలిటరీ (china military) రహస్యంగా ఒక హైపర్‌సోనిక్ గ్లైడ్ వాహనాన్ని మోసుకెళ్లే రాకెట్‌ (Rocket)ను ప్రయోగించిందని ఒక నివేదిక పేర్కొంది. ఆ హైపర్‌సోనిక్ క్షిపణి దిగువ భూ కక్ష్యలో ప్రయాణించి.. దాని లక్ష్యం దిశగా వెళ్లే ముందు ప్రపంచాన్ని ఒకసారి చుట్టేసిందని నివేదిక వివరించింది. హైపర్‌సోనిక్ తన లక్ష్యానికి దాదాపు రెండు డజన్ల మైళ్ల (సుమారు 39 కి.మీ) దూరంలో పడినట్లు తెలిపింది.

అమెరికా (America) అధికారులు ఊహించినదానికంటే చైనా దేశం హైపర్‌సోనిక్ ఆయుధాలపై మరింత పురోగతి సాధించిందని తెలిసి యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆశ్చర్యపోయాయని నివేదిక పేర్కొంది. ఈ అణ్వస్త్ర ఆయుధం దక్షిణ ధృవం (South Pole)పై కూడా చక్కర్లు కొట్టగలదని.. అలా జరిగితే యూఎస్ మిలిటరీకి పెద్ద సవాలే ఎదురవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన హైపర్‌సోనిక్ క్షిపణిని ఆగస్టులో పరీక్షించినట్లు వస్తున్న వార్తలను చైనా ఖండించింది, ఈ పరీక్ష "సాధారణ అంతరిక్ష నౌక ప్రయోగం (routine spacecraft experiment)" అని సోమవారం తెలిపింది.

చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ (China Academy of Launch Vehicle Technology) చేసిన ఒక ప్రకటన తర్వాత ఈ రహస్య ప్రయోగం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. లాంగ్ మార్చ్ 2సీ రాకెట్‌ (Rocket)ని 77వ ప్రయోగంగా జూలైలో ప్రయోగించినట్లు చైనా అకాడమీ (china academy) వెల్లడించింది. తర్వాత ఆగష్టు 24 79వ ప్రయోగానికి సంబంధించి వివరాలను విడుదల (release) చేసింది. కానీ 78వ ప్రయోగం గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో అనేక అనుమానాలు పుట్టుకొచ్చాయి.

హైపర్‌సోనిక్ మిస్సైల్ అంటే ఏమిటి?

హైపర్‌సోనిక్ (hyper sonic) క్షిపణి అనేది ధ్వని వేగం కంటే ఐదు రెట్ల వేగంతో ప్రయాణించగలదు. హైపర్‌సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి కాబట్టే వీటిని మాక్ 5 (Mach 5) కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయని చెబుతుంటారు. ఈ క్షిపణులు గంటకు 6,115 కి.మీ వేగంతో దూసుకెళ్తాయి. ఇందులో అద్భుతమైన టెక్నాలజీ (technology) కూడా ఉంటుంది. ఇది బాలిస్టిక్ క్షిపణుల, క్రూయిజ్ క్షిపణులు చేయగల విన్యాసాలు కూడా చేయగలదు.

హైపర్‌సోనిక్ ఆయుధాలు క్షిపణి యుద్ధాన్ని, ప్రత్యేకించి అణు యుద్ధాన్ని (Nuclear war) నూతన స్థాయికి తీసుకెళ్లగలవు. ఆ స్థాయిలో హైపర్‌సోనిక్ ఆయుధాలు (hypersonic weapons) దాడులు చేస్తుంటే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. ఇవి తక్కువ ఎత్తులో బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల కంటే చాలా వేగంగా ప్రయాణించగలవు. అలాగే ఇవి ఆకాశంలోనే దిశను మార్చగలవు. ఇవి సంప్రదాయ క్షిపణుల లాగా కాకుండా ఊహించగల ఆర్చిను అనుసరించవు కాబట్టి వాటిని ట్రాక్ చేయడం, అడ్డుకోవడం దాదాపు అసాధ్యం.

హైపర్‌సోనిక్ కోసం గ్లోబల్ రష్..

హైపర్‌సోనిక్ సామర్థ్యాలను అభివృద్ధి చేసిన మొదటి దేశం చైనా (china) కాదు కానీ అది నేషనల్ డే మిలటరీ పరేడ్ లో హైపర్‌సోనిక్ గ్లైడ్ వాహనం DF-17ను ప్రదర్శించింది. ఇక 2020లో యూఎస్ నిరాయుధ ప్రోటోటైప్ హైపర్‌సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షిస్తున్నట్లు ప్రకటించింది. పెంటగాన్ మార్చి 2020లో ఒక టెస్ట్ గ్లైడ్ వాహనం.. హైపర్‌సోనిక్ వేగంతో ఒక నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుందని వెల్లడించింది.

రష్యా (Russia) కూడా హైపర్‌సోనిక్ సామర్థ్యాలను ప్రదర్శించింది. 2019 డిసెంబర్‌లో తన మొట్టమొదటి అవాంగార్డ్ హైపర్‌సోనిక్ క్షిపణి సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు రష్యా ప్రకటించింది. పని చేయగల హైపర్‌సోనిక్ ఆయుధాన్ని కలిగిన తొలి దేశంగా రష్యానే అని ఆ దేశం ప్రకటించుకుంది. రష్యన్ అధికారుల ప్రకారం, అవాంగార్డ్ హైపర్‌సోనిక్ పరీక్షలలో మాక్ 27 వేగాన్ని చేరుకుంది. అంటే గంటకు దాదాపు 33,000 కిలోమీటర్ల వేగంతో ఆ క్షిపణి ప్రయాణించింది.

హైపర్‌సోనిక్ సామర్ధ్యం వల్ల ప్రత్యర్థుల మధ్య అణు యుద్ధాలు (nuclear war) జరిగే ప్రమాదం ఉందని అమెరికా (America) గుర్తించింది. హైపర్‌సోనిక్ దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు మార్గాలను కనుగొనడానికి వాషింగ్టన్.. అడ్వాన్స్డ్ మిస్సైల్ డిఫెన్స్ పరిశోధనలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది.

హైపర్‌సోనిక్ మిస్సైల్‌ టెక్నాలజీలో భారత్ పురోగతి

కొత్త చైనీస్ హైపర్‌సోనిక్ సామర్ధ్యం గురించి వస్తున్న నివేదికలతో భారతదేశానికి (India) పరోక్ష హెచ్చరికలు జారీ అవుతున్నాయి. చైనా ఇండియాలో ఏ లక్ష్యాన్ని అయినా చేధించే సామర్థ్యాన్ని బీజింగ్‌కు ఇస్తోంది. ప్రస్తుతం తూర్పు లడఖ్‌లో సరిహద్దు వివాదం రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని (enemy) పెంచుతోంది. ఇదిలా ఉండగా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) హైపర్‌సోనిక్ టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్ వెహికల్ (HSTDV)ను తన తొలి పరీక్షలోనే విజయవంతంగా లాంచ్ చేసింది. దీనిబట్టి ఇప్పటికే భారతదేశం కూడా హైపర్‌సోనిక్ టెక్నాలజీని అభివృద్ధి (develop) చేసిందని చెప్పుకోవచ్చు. హెచ్ఎస్టిడివి (HSTDV) అనేది హైపర్‌సోనిక్ స్పీడ్ ఫ్లైట్ కోసం తీసుకొచ్చిన మానవరహిత స్క్రామ్‌జెట్ ప్రదర్శన విమానం. ఇది మాక్ 6 వేగంతో ప్రయాణించగలదు. 20 సెకన్లలో 32.5 కిమీ ఎత్తుకు వెళ్లగలదు. ఇండియా యాంటీ శాటిలైట్ టెక్నాలజీ (ASAT) ప్రత్యర్థుల అంతరిక్ష కార్యకలాపాలను నిలువరించగలదు. యాంటీ-శాటిలైట్స్ లేదా ఏఎస్ఏటీ (ASAT)లు అనే అంతరిక్ష ఆయుధాలు వ్యూహాత్మక సైనిక ప్రయోజనాల కోసం ఉపగ్రహాలను డిసేబుల్ చేయగలవు. లేదా నాశనం చేయగలవు. దిగువ భూకక్ష (LEO) లో ప్రత్యక్ష ఉపగ్రహాన్ని విజయవంతంగా టార్గెట్ చేయడానికి భారతదేశం 2019లో ఈ క్షిపణిని పరీక్షించింది.
Published by:Prabhakar Vaddi
First published: