మానవజాతిని కష్టాల్లోకి నెట్టిన కరోనా వైరస్ (Corona Virus) నుకట్టడి చేయడంలో వ్యాక్సిన్లు ఎంతో కీలకపాత్ర పోషిస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నర నుంచిప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలు కొవిడ్-19 (Covid 19) బారిన పడి అల్లాడిపోయారు. అలాంటి వారికి ఊరటనిచ్చేలా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి కరోనా వైరస్ ను నియంత్రించడంలోఅద్భుతంగా పనిచేస్తున్నాయి. అందుకే, ప్రజలంతా కరోనా వైరస్ బారిన పడకుండా సురక్షితంగా ఉండాలంటే కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, మన దేశంలో కేవలం 18 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే ప్రస్తుతం వ్యాక్సిన్ వేస్తున్నారు. అయితే, కొన్ని దేశాల్లో చిన్న పిల్లలకు సైతం వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.
ఇటీవల కాడెల్ వాకర్ అనే వ్యక్తి తన 9 ఏళ్ల కుమార్తె సోలోమ్కు కరోనా వ్యాక్సిన్ వేయించి ఆదర్శనీయంగా నిలిచారు. ఈ వ్యాక్సిన్ (Vaccine) కేవలం తన కూతురిని రక్షించడానికి మాత్రమే కాకుండా... కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఇతర ప్రమాదకరమైన వేరియంట్లను అడ్డుకోడానికిసహాయం చేస్తుందని ఆయన తెలిపారు. "వ్యాక్సిన్ మనకు మాత్రమే కాదు మనపొరుగువారికి సైతం రక్షణగా నిలుస్తుంది. అందుకే, నా 9 ఏళ్ల కుమార్తెకు వ్యాక్సిన్ వేయించాం." అనిసోలోమ్ తల్లిలూయిస్విల్లే అన్నారు.
కరోనా మహమ్మారిని పూర్తిగా ఓడించడానికి ఏకైక మార్గం మనమందరం సమిష్టిగా పనిచేయడమని ఆమెపేర్కొన్నారు. ప్రతి ఇన్ఫెక్షన్ (Infection)... యెమెన్‌లోని పెద్దవారిలో లేదా కెంటుకీలోని పిల్లవాడిలో అయినా వైరస్ పరివర్తన చెందడానికి మరొక అవకాశాన్ని ఇస్తుందని శాస్త్రవేత్తలు (Scientist) అంగీకరిస్తున్నారు. ఆయా ఇన్ఫెక్షన్లు ప్రపంచంలో ఎక్కడైనా జనాభాను రక్షించడానికి ఉన్న అవకాశాలను పరిమితం చేస్తాయి.
28 మిలియన్ల పిల్లలకు వ్యాక్సిన్...
5 నుంచి 11 సంవత్సరాల వయస్సు గల 28 మిలియన్ల అమెరికన్ పిల్లలకు పైజర్-బయోఎన్‌టెక్ (Pfizer Biontech) వ్యాక్సిన్ వేసేందుకు అన్ని అనుమతులు లభించాయి.పెద్దలతో పాటు పిల్లలకు సైతం టీకాలు వేయాలని ఇటీవలే ఆస్ట్రియా (Austria) నిర్ణయం తీసుకుంది. మరోవైపు, ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న వారికిబూస్టర్ షాట్ (Booster Shot) లను సైతం ఇవ్వాలని నిర్ణయించింది. ఇవి కొత్త వేరియంట్లు, సరికొత్త ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడేందుకు తోడ్పాటునందిస్తాయి.
నిశ్శబ్ద వ్యాప్తి అరికట్టడం..
పిల్లలకు టీకాలు వేయడం అంటే వైరస్ నిశ్శబ్ద వ్యాప్తిని తగ్గించడమని అర్థం. ఎందుకంటే చాలా మందికి వైరస్ సోకినప్పుడు ఎటువంటి లక్షణాలు లేవు. కొంతమందిలో తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపించాయి. వైరస్ కనిపించకుండా వ్యాపించినప్పుడు.. దాన్ని అరికట్టడం కష్టంతో కూడుకున్న పని అని శాస్త్రవేత్తలు అంటున్నారు. విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలో వైరాలజీ నిపుణుడు డేవిడ్ ఓ'కానర్ అంటువ్యాధులను "వైరస్ లను లాటరీ టిక్కెట్లతో పోల్చారు. ప్రస్తుతం డెల్టా వేరియంట్ (Delta Varient) ప్రమాదకరమైందని పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్ సోకిన తక్కువ మందిలో తక్కువ లాటరీ టిక్కెట్లు కలిగి ఉంటారన్నారు.
వేరియంట్లను రూపొందించడంలో మనమందరం మెరుగ్గా ఉంటామని చెప్పాడు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో వేరియంట్లు మరింత ఎక్కువగా ఉద్భవించేఅవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. కరోనా మహమ్మారి పిల్లలపై ప్రభావితం చేసిందనే విషయంపై పరిశోధకులు విభేదిస్తున్నారు. వారు వైరల్ వ్యాప్తికి పెద్దగా సహకరించలేదని తెలిపారు. కానీ కొంతమంది నిపుణులు మాత్రం... ఈ సంవత్సరం ఆల్ఫా, డెల్టా వంటి అంటువ్యాధులను వ్యాప్తి చేయడంలో పిల్లలు ముఖ్యమైన పాత్ర పోషించారని పేర్కొన్నారు.
IIT Madras Survey: మహిళా పారిశ్రామిక వేత్తలు అక్కడే అధికం.. IIT మద్రాస్ అధ్యయనం
టీకాలు వేయడంతోనే మార్పు..
పిల్లలకు టీకాలు వేయడం వల్ల భవిష్యత్తులో నిజమైన మార్పు వస్తుంది. హబ్తాజా అంచనాల ప్రకారం... ఈ నవంబర్ నుంచి మార్చి 12, 2022 వరకు 5 నుంచి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు టీకాలు వేయడం వలన కొత్త వేరియంట్లు రాకపోతే మొత్తం యూఎస్ జనాభాలో దాదాపు 430,000 కొవిడ్ కేసులను నివారించవచ్చని తేలింది. ఒకవేళ, డెల్టా కంటే 50 శాతం ఎక్కువ ట్రాన్స్మిసిబుల్ వేరియంట్ కనిపించినట్లయితే 860,000 కేసులను కంట్రోల్ చేయవచ్చనిపెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీకి చెందిన ప్రాజెక్ట్ కో-లీడర్ కట్రియోనా షియా చెప్పారు.
డెల్టా వేరియంట్ విజృంభన..
యునైటెడ్ స్టేట్స్‌లోని కరోనా కేసుల్లో99 శాతానికి పైగా కేసులు డెల్టా వేరియంట్‌తోనే వస్తున్నాయి. అయితే, దీని వెనుకున్న కారణాన్ని మాత్రంశాస్త్రవేత్తలు కూడా విశ్లేషించలేకపోతున్నారు. ఇది అంతర్లీనంగా అంటువ్యాధి కావచ్చని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీలో ఇన్ఫెక్షియస్ డిసీజ్ నిపుణుడు డాక్టర్ స్టువర్ట్ క్యాంప్‌బెల్ రే అన్నారు. అమెరికాలో డెల్టా వేరియంట్ఉద్ధృతి ఎక్కువగాఉందని, ఇందుకు రుజువులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఇది ఇతర వేరియంట్లకు కంటే వేగంగా విస్తరిస్తుందన్నారు. డెల్టా అనేది వైరస్ల "పెద్ద కుటుంబం" అని.. ప్రపంచం ఇప్పుడు ఒక విధమైన "డెల్టా సూప్"లో పయనిస్తోందనిరే చెప్పారు.
ఈ ప్రమాదకర వేరియంట్లు ఎప్పటికైనా చెలరేగే ప్రమాదం లేకపోలేదు. వ్యాక్సినేషన్ తీసుకోనివారి నుంచి అవి సోకే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ తీలుకోని ప్రాంతాల నుంచి అవి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అవి క్రమంగా వ్యాక్సిన్ తీసుకున్న పిల్లలను చేరుకునే ప్రమాదం లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
వ్యాక్సిన్ తీసుకున్న 9 ఏళ్ల చిన్నారి సోలోమ్నునువాకర్, లూయిస్విల్లే అనే దంపతులు ఇథియోపియా దేశం నుంచి దత్తత తీసుకున్నారు. ఆ చిన్నారి శిశువుగా ఉన్నప్పుడేక్షయవ్యాధికి గురైంది. ఆ తర్వాత శ్వాసకోశ వ్యాధుల కారణంగా ఆమెకు న్యుమోనియా సంభవించిందనిడాక్టర్లు తెలిపారు. అందువల్ల, కరోనా లాంటి వైరస్‌లనుంచి మనల్ని, మన చుట్టు పక్క వారినికాపాడుకోవాలంటే వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకొని పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తుచేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona Vaccine, Covid -19 pandemic, Covid vaccine, Delta Variant