హోమ్ /వార్తలు /Explained /

Explained: భారత్‌లో వినియోగానికి ఆమోదం పొందిన రెండు కొత్త వ్యాక్సిన్లు, ఒక టాబ్లెట్.. ఇవి ఎలా పనిచేస్తాయంటే..

Explained: భారత్‌లో వినియోగానికి ఆమోదం పొందిన రెండు కొత్త వ్యాక్సిన్లు, ఒక టాబ్లెట్.. ఇవి ఎలా పనిచేస్తాయంటే..

కరోనా మహమ్మారిని అంతమొందించే ప్రయత్నంలో కొవొవ్యాక్స్‌, కార్బివాక్స్‌ అనే రెండు సరికొత్త వ్యాక్సిన్లకు భారత్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. అలాగే తాజాగా మోల్నుపిరవిర్‌ అనే ఓరల్ మాత్రకు కూడా ఆమోదం తెలిపింది. ఇవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం.

కరోనా మహమ్మారిని అంతమొందించే ప్రయత్నంలో కొవొవ్యాక్స్‌, కార్బివాక్స్‌ అనే రెండు సరికొత్త వ్యాక్సిన్లకు భారత్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. అలాగే తాజాగా మోల్నుపిరవిర్‌ అనే ఓరల్ మాత్రకు కూడా ఆమోదం తెలిపింది. ఇవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం.

కరోనా మహమ్మారిని అంతమొందించే ప్రయత్నంలో కొవొవ్యాక్స్‌, కార్బివాక్స్‌ అనే రెండు సరికొత్త వ్యాక్సిన్లకు భారత్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. అలాగే తాజాగా మోల్నుపిరవిర్‌ అనే ఓరల్ మాత్రకు కూడా ఆమోదం తెలిపింది. ఇవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

  కరోనా మహమ్మారిని(Corona Virus) అంతమొందించే ప్రయత్నంలో కొవొవ్యాక్స్‌ (Covaxin) , కార్బివాక్స్‌(Corbo Vax) అనే రెండు సరికొత్త వ్యాక్సిన్లకు భారత్(india) ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. అలాగే తాజాగా మోల్నుపిరవిర్‌ అనే ఓరల్(Oral) మాత్రకు కూడా ఆమోదం తెలిపింది. అయితే కొత్త టీకాలతోపాటు మోల్నుపిరవిర్‌ మాత్రలు కోవిడ్-19(Covid19) వ్యాధిని ఎంత సమర్ధవంతంగా ఎదుర్కొంటాయో తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో వీటిని ఎలా తయారు చేశారు? ఇవి ఎంత శక్తివంతమైనవి? లాంటి విషయాలు ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

  కార్బివాక్స్‌: ప్రొటీన్‌ సబ్-యూనిట్ టీకా..

  హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఇ (BE) తయారు చేసిన కార్బివాక్స్‌ అనేది ఒక ప్రొటీన్ సబ్-యూనిట్ (sub-unit) వ్యాక్సిన్. పేరుకు తగినట్లుగానే ఇది వైరస్‌కు బదులుగా రోగనిరోధక శక్తిని ప్రేరేపించడానికి చిన్న స్పైక్‌ ప్రొటీన్‌ను ఉపయోగిస్తుంది. ఈ సబ్-యూనిట్ వ్యాక్సిన్‌లో హానిచేయని ఎస్-ప్రొటీన్‌ ఉంటుంది. ఈ ప్రొటీన్‌ అనేది కరోనావైరస్‌లోని అత్యంత ప్రమాదకరమైన స్పైక్‌ ప్రొటీన్‌ లాగానే ఉంటుంది. ఈ టీకా తీసుకోగానే ఎస్ ప్రొటీన్‌ అనేది శరీరంలోకి ప్రవేశిస్తుంది.

  Explained: భారత్‌లో కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులు.. డోసుల మధ్య గ్యాప్ ఎంత ఉండాలి.. పూర్తి వివరాలు తెలుసుకోండి..


  ఆ సమయంలో రోగనిరోధక వ్యవస్థ ప్రొటీన్‌ను గుర్తించి అది నిజమైన కరోనావైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ అని భావిస్తుంది. ఆ వెంటనే ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటానికి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఆ విధంగా శరీరంలో యాంటీ బాడీలను నింపి నిజమైన కరోనావైరస్‌ను(Corona Virus) సైతం ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్(Vaccine) తీసుకున్న వారిని సిద్ధం చేస్తుంది. ఈ టీకా చేసుకున్నవారికి కరోనా సోకితే శరీరంలోని అప్పటికే బలపడిన రోగనిరోధక వ్యవస్థ దాన్ని వెంటనే నిర్వీర్యం చేస్తుంది.

  యాంటీ బాడీలను ఉత్పత్తి చేసే వైరస్ యాంటీజెనిక్ భాగాలను టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ సెంటర్ ఫర్ వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ అభివృద్ధి చేసింది. అమెరికాలోని టెక్సస్‌లోని బేలార్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన ‘నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌’ (ఎన్‌ఎస్‌టీఎం) సాయంతో ఈ టీకాను రూపొందించారు.

  Covid Symptoms: డెల్టా వర్సెస్ ఒమిక్రాన్‌.. కొత్త వేరియంట్‌ బాధితుల్లో భిన్నంగా ఉండే లక్షణాలు ఇవే..!


  కార్బివాక్స్‌ సమర్థత..

  బయోలాజికల్-ఇ భారతదేశం అంతటా 33 అధ్యయన సైట్‌లలో 3,000 కంటే ఎక్కువ విషయాలపై ఫేజ్-3 ట్రయల్స్‌ను పూర్తి చేసింది. కార్బివాక్స్‌ డెల్టా స్ట్రెయిన్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీ టైట్రేలను అడ్డుకోగలదని తేలింది. ఇది వైరస్ పై ప్రభావశీలత చూపుతున్నట్లు ప్రచురితమైన అధ్యయనాల ప్రకారం తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్ కోవిషీల్డ్ కంటే మెరుగైనదా అని అంచనా వేయడానికి ఫేజ్ -3 యాక్టివ్ కంపారిటర్ క్లినికల్ ట్రయల్స్‌ను చేపట్టారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో పోల్చితే కార్బివాక్స్‌ అత్యుత్తమ రోగనిరోధక శక్తిని ప్రేరేపించిందని బయోలాజికల్-ఇ (BE) వెల్లడించింది.

  మోల్నుపిరవిర్‌ - ఓరల్ యాంటీవైరల్ డ్రగ్..

  మోల్నుపిరవిర్‌ ఓరల్ యాంటీవైరల్ మాత్రాలను అమెరికాకు చెందిన మెర్క్, రిడ్జ్‌బ్యాక్ బయోథెరప్యూటిక్స్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కరోనా మాత్రల వినియోగం తక్కువగా ఉన్న నేపథ్యంలో దీన్ని తయారు చేశారు. కోవిడ్-19 వ్యాధి తీవ్రత ముదిరే ప్రమాదమున్న అడల్ట్ పేషెంట్లకు చికిత్సగా వాడేందుకు దీనికి అనుమతి లభించింది. శరీరంలోకి చొరబడిన వైరస్ అనేది కాపీ మెషీన్ లా పనిచేస్తూ లెక్కలేనన్ని వైరస్‌లను తయారు చేస్తుంటుంది.

  అయితే ఇలా కొత్తగా వైరస్‌లను పునరుత్పత్తి చేసే ఆర్‌ఎన్‌ఏ పాలిమరైజ్‌ వ్యవస్థలో మోల్నుపిరవిర్‌ జోక్యం చేసుకుంటుంది. ఆ విధంగా వైరస్ జన్యు కోడ్‌లో లోపాలను ప్రవేశపెడుతుంది. దీని వల్ల వైరస్‌లు మళ్లీ పుట్టడం జరగదు. తద్వారా వైరల్ లోడ్ తగ్గి కరోనా తీవ్రత అనేది క్షీణిస్తుంది. చివరికి కోవిడ్-19 రోగులు కోలుకుంటారు. మోల్నుపిరవిర్ 200mg మాత్రలలో వస్తుంది. భారతదేశంలో రోజుకు రెండుసార్లు 800 mg మోతాదులో మాత్రలను తీసుకోవాలి. 5 రోజులు పాటు దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మాత్రలను ఇండియాలో 13 ఔషధాల తయారీ దారులు తయారు చేస్తారు. ఇందులో డాక్టర్ రెడ్డిస్, హెటిరో వంటి ఔషధ సంస్థలు ఉన్నాయి.

  మోల్నుపిరవిర్‌ సమర్థత..

  యూకే డ్రగ్ రెగ్యులేటర్ డిసెంబర్ 4న మోల్నుపిరవిర్‌ను సురక్షితమైనది, ప్రభావవంతమైనదిగా గుర్తించింది. యూఎస్ డిసెంబర్ 23న ఆమోదం తెలిపింది. కానీ వరుసగా ఐదు రోజుల కంటే ఎక్కువ కాలం వినియోగించకూడదని తెలిపింది. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న రోగులలో ఎముక, మృదులాస్థి పెరుగుదలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున దీని వినియోగానికి అనుమతి ఇవ్వలేదు. ఇండియాలో వయోజనులు, వ్యాధి ముదిరే ముప్పు ఉన్న రోగులు ఈ మాత్రలను వాడొచ్చు.

  Corona Vaccine: 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వారికి శుభవార్త.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు


  కొవొవ్యాక్స్‌: రీకాంబినెంట్ నానోపార్టికల్ టీకా..

  కొవొవ్యాక్స్‌ను సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) తయారు చేసింది. ఇది కూడా ప్రొటీన్ సబ్-యూనిట్ వ్యాక్సిన్. కాకపోతే ఇది రీకాంబినెంట్ నానోపార్టికల్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. దీనిని అమెరికాకు చెందిన నోవావాక్స్ అభివృద్ధి చేసింది. ఈ టీకా తీసుకున్నాక హానిచేయని స్పైక్ ప్రోటీన్ కాపీలు శరీర కణాలలో పెరుగుతాయి. ఈ ప్రొటీన్లు వైరస్-వంటి నానోపార్టికల్స్‌లో పోగుపడతాయి. వీటన్నిటినీ ఎదుర్కోవడానికి రోగనిరోధకశక్తి యాంటీబాడీలను తయారుచేస్తుంది. ఆ విధంగా శరీరం నిజమైన వైరస్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన యాంటీ బాడీలను తయారుచేసుకుంటుంది. డిసెంబర్ 20న, WHO వ్యాక్సిన్‌కి అత్యవసర వినియోగ జాబితాలో చేర్చింది.

  కొవొవ్యాక్స్‌ సమర్ధత..

  యూకేలో ఒక ట్రయల్ లో కొవొవ్యాక్స్‌ ఒరిజినల్ వైరస్ స్ట్రెయిన్ నుంచి 96.4%, ఆల్ఫా వేరియంట్ నుంచి 86.3%.. మొత్తం మీద 89.7% రక్షణ కల్పించింది. యూఎస్, మెక్సికోలో PREVENT-19 ట్రయల్ మోస్తరు, తీవ్రమైన వ్యాధుల నుంచి 100% రక్షణను, మొత్తం మీద 90.4% సమర్థవంతమైన టీకాగా నిలిచింది.

  First published:

  Tags: Corona cases, Covid -19 pandemic, Omicron, Omicron corona variant

  ఉత్తమ కథలు