Home /News /explained /

NARENDRA MODI COMPLETED 20 YEARS IN OFFICE KNOW WHY HE IS SO SUCCESSFUL BA GH

Opinion: స్వయంకృషితో ఎదిగిన నరేంద్ర మోదీ.. ప్రభుత్వాధినేతగా కొత్త శిఖరాలు: జపన్ పాథక్

ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

1980ల సమయం కాలం గుజరాత్ రాజకీయాల్లో ఆసక్తికరమైన కాలమని చెప్పాలి. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ ఝంఝాటం లేకుండా అధికారంలో ఉన్న సమయం అది. అలాంటి సమయంలో రాజకీయ జీవితంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించేందుకు ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి నరేంద్ర మోదీ వచ్చారు.

ఇంకా చదవండి ...
(Japan Pathak, Journalist, Ahmedabad)

ఈ అక్టోబర్ 7తో ప్రభుత్వాధినేతగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు నరేంద్ర మోదీ. (Narendra Modi). గుజరాత్ (Gujarat) వాసులుగా మేము నరేంద్ర మోదీ ఎదిగిన తీరును, గుజరాత్ రాష్ట్రాన్ని నడిపించిన తీరును దగ్గర నుంచి చూశాం. మోదీని విభిన్నంగా నిలుపుతున్నదేంటని చాలా మంది అడుగుతూ ఉంటారు. నా మటుకు అయితే అది మానవీయ స్పర్శ. అది పనిలో కావచ్చు, లేదా వ్యక్తిగతమైన సంభాషణల్లో కావచ్చు. అదే ఆయనను ఉన్నత శిఖరాలపై నిలిపింది.

1980ల సమయం కాలం గుజరాత్ రాజకీయాల్లో ఆసక్తికరమైన కాలమని చెప్పాలి. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ  (Congress Party) ఏ ఝంఝాటం లేకుండా అధికారంలో ఉన్న సమయం అది. నిరుత్సాహకరమైన పాలన, తీవ్రమైన వర్గవిభేధాలు, తప్పుడు ప్రాధాన్యతలు ఉన్నప్పటికీ ఇతర రాజకీయ పార్టీ ఏదైనా అధికారంలోకి వస్తుందని ఊహించశక్యం కాని సమయం అది. కరుడుగట్టిన బీజేపీ మద్దతుదారులు, కార్యకర్తల్లోనూ ఒకలాంటి అనిశ్చితి.

PM Modi: ప్రపంచంలో బలమైన సైనిక శక్తిగా భారత్...ఏడు రక్షణ సంస్థలను ప్రారంభించిన ప్రధాని మోదీ.. అహ్మదాబాద్ కార్పొరేషన్ ఎన్నికల కోసం మోదీ రంగంలోకి

అలాంటి సమయంలో రాజకీయ జీవితంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించేందుకు ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి నరేంద్ర మోదీ వచ్చారు. అహ్మదాబాద్  కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే సవాల్ను ఆయన తీసుకున్నారు. వృత్తి నిపుణులను బీజేపీతో అనుసంధానం చేయడం ఆయన చేపట్టిన చర్యల్లో ఒకటి. ప్రముఖ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, టీచర్లను పార్టీ యంత్రాంగం కలిసి వారిని ఎన్నికల ప్రక్రియ, రాజకీయ ప్రక్రియలో భాగం కావాలని కోరింది. రాజకీయాలతో పాటు పరిపాలనా సమస్యల గురించి మాట్లాడేందుకు నరేంద్ర మోదీ కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజలను ఉద్దరించే వారి జీవితాలు మార్చేందుకు వినూత్న మార్గాల గురించి ఆయన నిరంతరం ఆలోచన చేసేవారు.

ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో..దేశంలో 100 సైనిక్ సూల్స్ స్థాపనకు కేంద్ర కేబినేట్ ఆమోదం..అద్భుతమైన వాక్చాతుర్యం కలిగిన మోదీ

వక్తగా నరేంద్ర మోదీ మాటలు నిజంగా అద్భుతం. అవి ప్రేరణ కలిగించేలా ఉండేవి. అహ్మదాబాద్లోని ధరణిధర్ ప్రాంతంలోని నిర్మల్ పార్టీ ప్లాట్లో జరిగిన ఒక చిన్నపాటి సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం నాకు ఇప్పటికీ గుర్తుంది. సరదా మాటలతో ఆయన మొదట కాసేపు ఆహుతులను బాగా నవ్వించారు. ఆ తర్వాత ఆయన వచ్చిన వారిని అడిగారు.. ఇలాగే జోకులు వేసుకుందామా లేదా జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలు గురించి మాట్లాడుకుందామా? అని. అప్పుడు నాలో ధైర్యం ఎలా వచ్చిందో తెలియదుగాని, రెండు కావాలని నేను గట్టిగా అరిచాను. నేను అలా అనగానే ఆయన నా వైపు తిరిగి, రెండు కుదరవని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆయన బీజేపీ పరిపాలనా దృష్టి గురించి, 370 అధికరణ గురించి, షా బానో కేసు గురించి ఇంకా చాలా విషయాల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఆ సైద్ధాంతిక స్పష్టత నన్ను మంత్రముగ్దుడిని చేసింది.

Narendra Modi: మోదీ ప్రజా ప్రస్థానానికి 20 ఏళ్లు.. ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు.. ఈ రోజంతా భారీగా ప్లాన్1990ల్లోనే మోదీ ప్రజాదరణ క్యాసెట్లకు ప్రజాదరణ

గుజరాత్‌కు వెలుపల ఉన్నవారికి మోదీ గురించి తెలియదు కానీ.. 1990ల్లో ఆయన ప్రసంగాల క్యాసెట్లు రాష్ట్రంలో చక్కని ప్రజాదరణ పొందాయి. గుజరాత్‌లో ఏదో ఒక ప్రాంతంలో మోదీ చేసిన ప్రసంగాలు ఆ క్యాసెట్లలో ఉండేవి. లాతూర్ భూకంపం సమయంలో అంటే 1994లో ఆయన చేసిన ఒక ప్రసంగం కదిలించి వేసింది. అహ్మదాబాద్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం నుంచి సహయ సామగ్రి తీసుకొని కొంత మంది వాలంటీర్లు లాతూరు బయలుదేరుతున్నారు. హఠాత్తుగా నరేంద్ర మోదీ ఒక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం తర్వాత కనీసం ఒక యాభై మంది అప్పటికప్పుడు లాతూరు వెళ్లేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. ఆయన మాటల ప్రభావం వారి మస్తిష్కంపై అంత ప్రభావం చూపింది. కానీ ఆయన వారికి నచ్చజెప్పారు. జనం ఎక్కువ మంది కాదు వెళ్లడం, అక్కడి ప్రజల సహాయ సామగ్రి చేరడం ముఖ్యమని చెప్పారు. ఎక్కడున్నా వాళ్లంతా దేశం కోసం పాటుపడాలని కోరారు.

సమాజంలోని విభిన్న వర్గాలను చేరువయ్యే సామర్ధ్యం నరేంద్ర మోదీలో పుష్కలంగా ఉంది. చాయ్‌ పే చర్చ అన్న పదాన్ని 2013-14లో ప్రపంచం చూసుకుంది. కాని విభిన్నవర్గాలకు చెందిన మార్నింగ్‌ వాకర్స్‌తో ఉదయాన్ని టీ తాగుతూ ఆయన ఏర్పరుచుకున్న బంధాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. 1990ల్లో అహ్మదాబాద్‌లోని పరిమళ్‌ గార్డెన్స్‌ ప్రాంతంలో కొంత మంది మార్నింగ్‌ వాకర్స్‌తో ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను ఆయనను కలుసుకున్నాను. వెంటనే నేను ఆయనతో కనెక్ట్‌ అయిపోయాను. నరేంద్ర భాయ్‌తో సంభాషణలు వర్తమాన పరిస్థితులు అర్థం చేసుకునేందుకు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిసిన ఒక డాక్టరు నాతో అన్నారు.

PM Modi: సొంత ఇళ్లతో లక్షాధికారులు.. సంతోషంగా ఉందన్న ప్రధాని మోదీమోదీలోని మానవీయకోణాన్ని తెలిపే రెండు ఉదాహరణలు

నరేంద్ర మోదీలోని మానవీయ కోణాన్ని తెలియజెప్పేందుకు నా దగ్గర రెండు ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి 2000 ప్రారంభంలో చోటుచేసుకున్న ఘటన. సంఘ్‌ వ్యవస్థ తెలిసిన వ్యక్తి, గుజరాతీ సాహితీ శిఖరం కేఖా శాస్త్రి రచనలను నేను, చరిత్రకారుడు రిజ్వాన్‌ ఖాద్రీ డాక్యుమెంటేషన్‌ చేస్తున్న సమయం అది. ఆయనను కలిసేందుకు మేము వెళ్లాం. ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదనే విషయాన్ని నేను గుర్తించాను. ఆయన ఫొటో తీసి నేను నరేంద్ర మోదీ కార్యాలయానికి పంపించాను. ఆ వెంటనే కేఖా శాస్త్రిని చూసుకునేందుకు ఒక నర్స్‌ వచ్చారు.

మరో ఘటన రచయిత ప్రియాకాంత్ పారిఖ్‌కు సంబంధించినది. తన 100వ రచనను నరేంద్ర మోదీ చేతుల మీదు ఆవిష్కరింపచేజయాలన్నది ఆయన బలమైన ఆకాంక్ష. కానీ ఆయన కదల్లేదు. ఒక ప్రమాదం కారణంగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. కదల్లేరు. నాకు గుర్తుంది, ఆశ్రమ్‌ రోడ్డులోని ప్రియాకాంత్‌ పారిఖ్‌ ఇంటికి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ వెళ్లి ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించిన విషయం. అనారోగ్యం బారినపడి కదల్లేని స్థితిలో ఒక రచయిత పుస్తకావిష్కరణకు ఒక ముఖ్యమంత్రి రావడం గుజరాతీ సాహితీ వర్గాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

రెండు సుగుణాలు ఆయనను ఎంతో ఉన్నతంగా నిలబెట్టాయి. ప్రతీ రాజకీయ నాయకుడికి అవి ఉండాలి కూడా. అవి సావధానం ఆలకించే నైపుణ్యం, టెక్నాలజీ అంటే ప్రేమ. కాని టెక్నాలజీ విషయంలో ఆయన ఎప్పుడూ బాధపడుతుంటారు, ఫోన్‌ నెంబర్లను గుర్తుంచుకోలేకపోతున్నానని.


నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రయాణంలో పార్టీ క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. లక్ష్యం ఆయనకు తెలియంది కాదు. పార్టీ వ్యూహరచనను సమన్వయపరిచే బాధ్యతను నరేంద్ర మోదీ చేపట్టిన తర్వాత అది లోక్‌సభ కావచ్చు లేదా అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు లేదా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఎక్కడా బీజేపీ ఓటమి అన్నది చూడలేదు. ఒక్క 2000 సంవత్సరంలో ఎన్నికలపరంగా బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది దానికి కారణం ఆయన సమయంలో నరేంద్ర మోదీ రాష్ట్రం వెలుపల ఉండటం.

జర్నలిస్టులుగా మేము అనేక మందిని కలుస్తూ ఉంటాం. కానీ నేను యువ రిపోర్టుగా ఉన్న సమయంలో నరేంద్ర మోదీ నాతో అన్నారు, ఈ బంధాలన్నవి లావాదేవీ సంబంధాలుగా ఉండకూడదు, అవి జీవిత కాలం అనుబంధంగా నిలవాలని. 1998 హోలి సమయంలో నేను ఢిల్లీలో ఉన్నారు. ఆ సమయంలో నరేంద్ర మోదీ చెప్పిన మాటను నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీ టెలిఫోన్‌ డెయిరీలో 5000 నెంబర్లు ఉండవచ్చు వారిని కనీసం ఒకసారైనా నీవు కలిసి ఉంటావు. వారిని నీవు ఒక సోర్సుగా కాకుండా ఒక పరిచయమున్న వ్యక్తిగా లేదా స్నేహితుడిగా తెలియాలి. నరేంద్ర మోదీ చెప్పినట్టుగా నేను 5000 మందిని కలవలేదు, కానీ మానవీయ కోణం ఎంత ముఖ్యమనే విషయం ఆ మాటలతో నాకర్థమైంది. అది నరేంద్ర మోదీలో పుష్కలంగా ఉంది, అందుకే ఆయన ఇంతటి విజయాన్ని చూస్తున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Gujarat, Narendra modi, Pm modi, PM Narendra Modi

తదుపరి వార్తలు