హోమ్ /వార్తలు /Explained /

mYoga App: ‘ఎం యోగా’ యాప్‌ను విడుదల చేసిన ప్రధాని మోదీ.. యాప్‌ ఎలా పనిచేస్తుందంటే..

mYoga App: ‘ఎం యోగా’ యాప్‌ను విడుదల చేసిన ప్రధాని మోదీ.. యాప్‌ ఎలా పనిచేస్తుందంటే..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

భారత్‌లో నిర్వహించిన వేడుకల్లో mYoga మొబైల్ యాప్‌ను విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. సోమవారం ఆన్‌లైన్ ద్వారా మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా నుంచి కాపాడుకునేందుకు యోగాను రక్షణ కవచంలా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఇందుకు ‘ఎం యోగా’ యాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

ఇంకా చదవండి ...

ప్రపంచ వ్యాప్తంగా యోగా ప్రాధాన్యాన్ని చాటిచెప్పే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు వివిధ దేశాల్లో ఘనంగా ముగిశాయి. భారత్‌లో నిర్వహించిన వేడుకల్లో mYoga మొబైల్ యాప్‌ను విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. సోమవారం ఆన్‌లైన్ ద్వారా మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా నుంచి కాపాడుకునేందుకు యోగాను రక్షణ కవచంలా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఇందుకు ‘ఎం యోగా’ యాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. యోగాసనాలకు సంబంధించిన వీడియోలు ఈ యాప్‌లో నిక్షిప్తమై ఉంటాయి. వివిధ భాషలలో లభించే యోగా ట్రైనింగ్ వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రావడం మంచి విషయమని చెప్పారు మోదీ.

యోగాను విస్తరించడంలో సహాయపడే ఎం యోగా యాప్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ సాయంతో అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. దీన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రాచీన శాస్త్రాల కలయికగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో అసలు ‘ఎం యోగా’ యాప్ పనితీరు, దీని ప్రాధాన్యం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

mYoga యాప్‌లో ఏముంటుంది?

mYoga యాప్‌లో వీడియో, ఆడియో యోగా పాఠాలను పొందుపరిచారు. ప్రజలు తమకు ఇష్టమైనప్పుడు, ఖాళీ సమయాల్లో యోగా నేర్చుకునేందుకు, ప్రాస్టీస్ చేసుకునేందుకు వీలుగా వీటిని రూపొందించారు. 12-65 సంవత్సరాల వయసు ఉన్నవారు అందరూ యోగాసనాలకు మార్గదర్శిగా ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు.

యాప్‌ను ఎలా అభివృద్ధి చేశారు?

ఈ యాప్ అభివృద్ధిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పాత్ర సైతం ఉంది. శాస్త్రీయ సాహిత్యం, అంతర్జాతీయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు, సమీక్ష ద్వారా mYoga యాప్‌ను అభివృద్ధి చేసినట్లు WHO వెబ్‌సైట్ పేర్కొంది.

యాప్‌ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు?

‘ఎంయోగా’ యాప్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), కేంద్ర ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి (ఆయుష్) మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

డేటా ప్రైవసీకి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

ఎం యోగా యాప్‌.. వినియోగదారులకు సంబంధించిన డేటాను సేకరించదు. 12-65 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి యోగాసనాల్లో సహాయకారిగా ఉపయోగించడానికి మాత్రమే దీన్ని సిఫార్సు చేస్తున్నారు.

ఈ యాప్ ఎన్ని భాషల్లో అందుబాటులో ఉంది?

mYoga యాప్ ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఐక్యరాజ్యసమితి గుర్తించిన అన్ని భాషల్లో ఈ యాప్‌ లభించనుంది.

First published:

Tags: Yoga day 2021

ఉత్తమ కథలు